E-Paper
Advertisement

Big TV Kissik Talks: ఇండస్ట్రీ గుట్టు రట్టు.. టిల్లు 2 నుంచీ తొలగించడంపై నిజాలు బయటపెట్టిన శ్రీ సత్య!

Big TV Kissik Talks: ఇండస్ట్రీ గుట్టు రట్టు.. టిల్లు 2 నుంచీ తొలగించడంపై నిజాలు బయటపెట్టిన శ్రీ సత్య!
Advertisement

Big TV Kissik Talks: మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టి సినిమాలలో అవకాశాలందుకొని.. ఆ తర్వాత సీరియల్స్ లో నటించి ఇప్పుడు షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీ సత్య తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చింది. తనకు నటన కంటే మోడల్ గా ఉండటమే ఇష్టమని.. ర్యాంప్ వాక్ చేయడం అంటే ప్రాణం అంటూ చెప్పుకొచ్చిన ఈమె ఇండస్ట్రీపై నమ్మకం కోల్పోవడానికి కారణం అదే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇండస్ట్రీ గుట్టు రట్టు చేసిన శ్రీ సత్య..

ఇకపోతే ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. “సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ, నేహా శెట్టి కాంబినేషన్లో వచ్చిన టిల్లు 2 సినిమాలో నాకు అవకాశం కల్పించారు. సెకండ్ హాఫ్ మొత్తం నా పాత్రే ఉంటుంది. ఆల్మోస్ట్ డబ్బింగ్ కూడా పూర్తి అయ్యింది. కానీ సినిమా చూసేసరికి నేను షాక్ అయిపోయాను. ఎడిటింగ్ లో నేను నటించిన భాగం మొత్తం లేపేసారు. ఇక ఎందుకు ఇలా చేశారు అని నేను మళ్ళీ వారిని అడగలేక పోయాను.. ఎంత కష్టపడినా ఆఖరికి ఎడిటింగ్ లో నేను చేసిన షూటింగ్ మొత్తాన్ని డిలీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఇక మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. నిజంగా ఎవరైనా సరే సినిమాలలో పని చేయాలి అనుకుంటే అంతకుముందు మీరు ఏం చేశారు అనే విషయాన్ని మాత్రం చెప్పకూడదు . నేను అలా చెప్పడం వల్లే నన్ను టిల్లు 2 నుండి ఎడిటింగ్లో తీసేసారు. ఎవరైనా ఇండస్ట్రీలో సినిమా కోసం ఎదురు చూస్తుంటే.. గతంలో మీరు ఏం చేశారు అనే విషయాన్ని మాత్రం చెప్పకండి అంటూ ఇండస్ట్రీకి వచ్చే నటీనటులకు సలహా ఇచ్చింది శ్రీ సత్య.

నా జీవితంలో మళ్లీ అలాంటిది వద్దు..

Advertisement

నేను బలంగా శివుడిని నమ్ముతాను.. నా జీవితంలో ఏదైనా అతిపెద్ద కష్టం రాకుండా ఆయన ఆపుతున్నాడేమో అనే బలమైన నమ్మకం నాకుంది . ఇక నేను భవిష్యత్తులో ఇకపై అలాంటిది ఎదుర్కోకూడదు అంటే అది ఒక రిలేషన్షిప్ మాత్రమే. దానిలో నేను నరకం చూసాను. రిలేషన్ షిప్ లో బ్రేకప్ అనేది నాకు మాత్రమే కాదు నేను శత్రువుగా చూసే వారికి కూడా అలాంటి బాధ కలగకూడదు అంటూ తెలిపింది.

also read:Big TV Kissik Talks: సర్జరీపై తొలిసారి స్పందించిన శ్రీ సత్య.. ఆ మాటలు భరించలేకపోయా!

దమ్ముంటే ఆ పని చేయి..

Advertisement

నన్ను చాలామంది వెన్నుపోటు పొడిచారు. దేవుడి దయతో నా స్నేహితులెవరు నన్ను అలా చేయలేదు. కానీ తెలిసిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు. ఇక నేను వెళ్ళిన తర్వాత నా వెనుక చాలామంది తప్పుగా మాట్లాడిన వాళ్లు కూడా ఉన్నారు . మీకు దమ్ముంటే ధైర్యంగా నా ఎదురుగా వచ్చి ఆ మాటలు మాట్లాడండి అంటూ తెలిపింది శ్రీ సత్య.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×