E-Paper
Advertisement

Action Thriller Series OTT: రైలు పట్టాలు ఎక్కే మృత్యువు… హైజాకర్ల హైటెక్ విధ్వంసం… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సిరీస్

Action Thriller Series OTT: రైలు పట్టాలు ఎక్కే మృత్యువు… హైజాకర్ల హైటెక్ విధ్వంసం… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సిరీస్
Advertisement

Action Thriller Series OTT : రీసెంట్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది హైజాకర్ల చుట్టూ తిరిగే ఒక ఉత్కంఠభరితమైన సిరీస్. మొదటి సీజన్ ప్లేన్ హైజాక్ చుట్టూ తిరిగితే, ఈసారి కథ బెర్లిన్ అండర్‌గ్రౌండ్ మెట్రో ట్రైన్ చుట్టూ తిరుగుతుంది. ప్రతి ఎపిసోడ్ సీట్ ఎడ్జ్ తో సాగుతుంది. గన్ ఫైట్లు, మైండ్ గేమ్స్, చివర్లో వచ్చే అదిరిపోయే ట్విస్టులతో ఈ సీజన్ మొత్తం ఫుల్ జోష్‌తో సాగుతుంది. విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి ఇందులో. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

యాపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్ 

ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘హైజాక్ (Hijack) సీజన్ 2’. ఇందులో ఇద్రిస్ ఎల్బా ప్రధాన పాత్రలో నటించారు. ఈ హీరో సిరీస్ లో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. మొదటి సీజన్ 2023 జూన్ 28న యాపిల్ టీవీ (Apple TV) లో విడుదలైంది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ కథ విమానం హైజాక్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు వచ్చిన సీజన్ 2, 2026 జనవరి 14న మొదలై మార్చి 4 ముగిసింది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సరీస్ ప్రతి బుధవారం ఒక కొత్త ఎపిసోడ్ తో స్ట్రీమింగ్ అయింది. ఈ కథ ఒక ట్రైన్ హైజాక్ తో మొదలవుతుంది. ఇక ఇందులో టోబీ జోన్స్, లిసా వికారి కొత్త పాత్రల్లో కనిపించారు. సీజన్ 2 కూడా యాపిల్ టీవీ (Apple TV) లోనే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి సీజన్‌లో ప్లేన్ హైజాక్ నుండి అందరినీ కాపాడిన సామ్ నెల్సన్ (ఇద్రిస్ ఎల్బా), ఈసారి బెర్లిన్ సిటీలో తన పని మీద తిరుగుతుంటాడు. అయితే ఒక రోజు, అతను ప్రయాణిస్తున్న అండర్‌గ్రౌండ్ మెట్రో ట్రైన్‌ను కొందరు హైజాకర్లు అదుపులోకి తీసుకుంటారు. రైలు పట్టాల మీద స్పీడ్‌గా వెళ్తుంటే, లోపల గన్లతో వాళ్ళు హల్చల్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుకుంటారు. బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయిన ఆ పరిస్థితుల్లో, సామ్ మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ హైజాకర్ల ప్లాన్ చాలా డెంజరస్‌గా ఉంటుంది. వాళ్ళు కేవలం రైలునే కాదు, మొత్తం సిటీ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌నే హ్యాక్ చేసి గందరగోళం సృష్టిస్తారు. రైలు ఆపితే పేల్చేస్తామని బెదిరిస్తూ, గవర్నమెంట్‌తో మైండ్ గేమ్స్ ఆడతారు.

సామ్ నెల్సన్ ఒక పక్క లోపల ఉన్న జనాల్లో భయం పోగొడుతూనే, మరోపక్క కిడ్నాపర్ల కళ్ళు గప్పి ఒక్కొక్కరిని దెబ్బకొట్టేలా ప్లాన్లు వేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్లు బయట తలలు పట్టుకుంటుంటే, సామ్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ సీటు అంచున కూర్చోబెట్టేలా ఉత్కంఠను పెంచుతాడు. చివరికి ఆ మెట్రో ట్రైన్ ఒక పెద్ద టెర్మినల్ దగ్గరకు దూసుకొస్తుండగా, క్లైమాక్స్ మామూలుగా ఉండదు. ఇక కథలో సామ్ ఈ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాడా ? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు ? ఎందుకు హైజాక్ చేశారు ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×