E-Paper
Advertisement

Sravanthi Chokarapu: కమిట్మెంట్ పై స్రవంతి కామెంట్స్.. అవకాశాలు రావాలంటే లొంగిపోవాల్సిందేనా?

Sravanthi Chokarapu: కమిట్మెంట్ పై స్రవంతి కామెంట్స్.. అవకాశాలు రావాలంటే లొంగిపోవాల్సిందేనా?
Advertisement

Sravanthi Chokarapu:సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే లొంగిపోవాల్సిందే అనే మాట ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రమ్యకృష్ణ (Ramyakrishna) లాంటి స్టార్ హీరోయిన్లు కూడా అవకాశాలు రావాలి అంటే కాస్త తగ్గి తీరాల్సిందే అనే కామెంట్లు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో తొలి అవకాశం అందుకున్న ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu) కూడా కమిట్మెంట్ పై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అవకాశాలు రావాలంటే లొంగిపోవాల్సిందేనా? కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం లభిస్తుందా? అన్న కామెంట్లకు ఆమె ఊహించని రిప్లై ఇచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కమిట్మెంట్ పై స్రవంతి కామెంట్..

రాయలసీమ ముద్దుబిడ్డ కదిరి ప్రాంతం నుంచి వచ్చిన స్రవంతి చొక్కారపు యాంకర్ గా బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. అటు బుల్లితెర షోలకు ఇటు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్న ఈమె.. ఇండస్ట్రీలోకి రావాలనే కోరికను తాజాగా ‘హే భగవాన్’ అనే సినిమాతో తీర్చుకోబోతోంది. కానీ సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమాకు ‘హే బల్ వంత్’ అని పేరు మార్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటుంది స్రవంతి.

కొత్త అమ్మాయిలకు స్రవంతి హెచ్చరిక..

Advertisement

అందులో భాగంగానే స్రవంతి మాట్లాడుతూ..” ఈ మధ్యనే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో నాకు మెసేజ్ పెట్టింది. సినీ పరిశ్రమలో కమిట్మెంట్ లేకుండా ఎదగలేమా? ఇంకో మార్గం ఏదైనా ఉందా? అంది.. ఒట్టు వేసి మరీ చెబుతున్నాను. నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ కూడా ఎదురు కాలేదు. ముఖ్యంగా మన ప్రవర్తన బట్టి ఎదుటివారి ప్రవర్తన కూడా ఉంటుందనేది నా నమ్మకం. ఇక్కడ ఏ విషయంలో ఎవరూ కూడా మిమ్మల్ని బలవంతం చేయరు. పూర్తిస్థాయిలో నిజాయితీ ఉంది అని మాత్రం చెప్పలేను. ఆ సమయాన్ని బట్టి మనం ఎలా డీల్ చేస్తున్నామనేదే ముఖ్యం. నా సర్కిల్లో ఇలాంటి అనుభవం ఎదురైన వారు కూడా ఎవరూ లేరు. ఇండస్ట్రీలో అమ్మాయిలు సేఫ్ గానే ఉన్నారని నేను మాత్రం గట్టిగా చెప్పగలను” అని ఆమెతో చెప్పాను” అంటూ స్రవంతి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఇండస్ట్రీలో ఎదగాలంటే లొంగిపోవాల్సిందే అనే విషయం మన ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త అమ్మాయిలకు స్రవంతి కాస్త ఊరట కలిగించింది అని చెప్పవచ్చు.

ALSO READ:Tollywood Movies: భారీ అంచనాలు – బాక్సాఫీస్‌లో భారీ నిరాశ.. హైప్ తట్టుకోలేక కూలిన సినిమాలు

స్రవంతి చొక్కారపు తొలి సినిమా..

Advertisement

ఇకపోతే ప్రస్తుతం సుహాస్, శివాని నాగారం జంటగా మరోసారి వస్తున్న చిత్రం ఇది. పక్కా ఎంటర్టైన్మెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి స్రవంతి తొలి ప్రయత్నంగా చేస్తున్న ఈ మొదటి సినిమా సక్సెస్ అవ్వాలని, ఆమె మళ్ళీ సినిమా రంగంలో వరుస అవకాశాలు అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటూ ఉండడం గమనార్హం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×