E-Paper
Advertisement

Kavitha Vs Harish Rao: హరీష్‌రావు టార్గెట్‌గా కవిత పావులు.. పార్టీపై ప్రకటన, సిద్ధిపేట నుంచి బరిలోకి

Kavitha Vs Harish Rao: హరీష్‌రావు టార్గెట్‌గా కవిత పావులు.. పార్టీపై ప్రకటన, సిద్ధిపేట నుంచి బరిలోకి
Advertisement

Kavitha Vs Harish Rao: తెలంగాణలో రాజకీయ పార్టీల చూపు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశాయి. పార్టీల నేతలు తమ నియోజకవర్గాలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఎక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు? హరీష్‌రావు కోటని టార్గెట్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

హరీష్‌రావు టార్గెట్‌గా పావులు కదుపుతున్న కవిత

Advertisement

తెలంగాణ జాగృతి చీఫ్ కవిత గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. మే మొదటి వారంలో పార్టీ ప్రకటించాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాను సిద్ధిపేట్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు చెప్పకనే చెప్పేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి మాత్రమే ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో తాము పక్కాగా అధికారంలోకి వస్తామని చెప్పకనే చెప్పేశారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా సిద్ధిపేట్‌ని తన కంచుకోటగా మార్చుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు. అక్కడ ఆయన్ని ఓడించడం ఆశామాషీ కాదని కారు పార్టీ నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. హైదరాబాద్‌లో హరీష్‌రావు కనిపించినా, సిద్ధిపేట్‌కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలు, కేడర్, పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉంటారని చెబుతుంటారు. అలాంటి సిద్ధిపేట్ కోటని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు కవిత.

Advertisement

సిద్ధిపేట్ నుంచి బరిలోకి దిగనున్న కవిత, షాక్‌లో బీఆర్ఎస్ కేడర్

బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బహిష్కరణ కాగానే తొలుత హరీష్‌రావుని టార్గెట్ చేశారు ఆమె.  కాళేశ్వరం ప్రాజెక్టు  విషయంలో కేసీఆర్‌కు అవినీతి మరక ఆయన  అంటించారని పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చారు.  ఆనాటి నుంచి ఇప్పటివరకు సమయం దొరికినప్పుడల్లా హరీష్‌రావుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  కవిత విమర్శలపై ఏనాడూ ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట్ నియోజకవర్గాన్ని కవిత ఎంపిక చేసుకున్నట్లు పలు రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. దీని వెనుక కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు జాగృతి నేతలు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనల మేరకు ఆమె అడుగులు వేస్తున్నారని బీఆర్ఎస్‌లోని ఓ వర్గం బలంగా నమ్ముతోంది. కవిత చిట్ చాట్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి నేరుగా హరీష్‌రావుని ఢీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కవిత.

ALSO READ:  ఫిబ్రవరి 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×