E-Paper
Advertisement

Kissik Talks: ఈటీవీకి మరోబిడ్డ.. ఆ సీరియల్ వల్లే బ్యాన్ చేసే పరిస్థితి.. నిజం బయటపెట్టిన సోనియా!

Kissik Talks: ఈటీవీకి మరోబిడ్డ.. ఆ సీరియల్ వల్లే బ్యాన్ చేసే పరిస్థితి.. నిజం బయటపెట్టిన సోనియా!
Advertisement

Kissik Talks: సోనియా సింగ్.. ప్రముఖ తెలుగు నటి.. యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలలో అడుగుపెడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా రౌడీ బేబీ , అనసూయ రామలింగం, శశి మధనం వంటి టీవీ వెబ్ సిరీస్ లతో మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమె అటు విరూపాక్ష, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఇప్పుడు నాగబంధం వంటి ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. పైగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ వంటి రియాలిటీ షోతో పాటు టీవీ షోలో కూడా సందడి చేస్తూ ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొని పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.

ఆ సీరియల్ వల్లే బ్యాన్ చేసే పరిస్థితి..

ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. “నేను విన్నాను.. మీరు ఈటీవీలో కొన్ని సంవత్సరాల పాటు పని చేయకూడదు అని.. మీకు అవకాశాలు రాకుండా ఆపారు అని, నిజమేనా?” అని ప్రశ్నించింది.. సోనియా మాట్లాడుతూ..” మీరు విన్నది నిజమే.. నేను ఈటీవీకి ఇంకో బిడ్డ. నాకు ఏమీ లేనప్పుడు..నేను జీరో గా ఉన్నప్పుడు.. నాకు బ్యాక్ బోన్ గా.. అంత పెద్ద సంస్థ నిలిచింది. అలా నాకు యమలీల ద్వారా గొప్ప ఆపర్చునిటీని ఇచ్చింది. పైగా ఈ యమలీల సీరియల్ లో చేస్తున్నప్పుడే డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు విరూపాక్ష సినిమాలో అవకాశాన్ని కల్పించి అలా నటిగా నన్ను మార్చేశారు.

నా సమస్యే అది – సోనియా

Advertisement

నాకు ఒక సమస్య ఉంది.. నేను ఒక స్టోరీకి కనెక్ట్ అయ్యాను అంటే.. ఇక ఆ ఫ్లో లోనే వెళ్తాను. ఒకవేళ స్టోరీ మార్చేశారు అంటే ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా సరే నిర్మొహమాటంగా చెయ్యను అని చెప్పేస్తాను. అలా యమలీల సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సమయంలో సడన్గా స్టోరీ మార్చేశారు. నాకు స్టోరీ మీద గ్రిప్ గట్టిగా ఉండాలి. కానీ సీరియల్ స్టోరీలో ఎన్నెన్నో మార్పులు చేసేసారు. నాకు నచ్చలేదు. ఇక వెంటనే నేను హెడ్ ఆఫీస్ కి వెళ్ళిపోయి.. ఇలా ఉంటుంది..ఇలా అవుతోంది..ఇది కరెక్ట్ కాదు అంటూ నా పద్ధతిలో చెప్పాను.. కానీ వాళ్లంతా నన్ను చేయమని చెప్పారు. కానీ నేను చేయలేనని గట్టిగా చెప్పేసాను. అయితే ఆ సమయంలో వాళ్లు నాపైన ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు.. నన్ను బ్యాన్ చేయొచ్చు.. నా కెరియర్ ని నాశనం చేయొచ్చు..వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు.. కానీ ఏది చేయలేదు.. ఎందుకంటే నన్ను వాళ్ళు నేను ఏం చేసినా నన్ను బిడ్డగానే స్వీకరించారు.

శశి మధనంతో అన్నీ సెట్ అయ్యాయి..

ఇక ఇదంతా జరిగిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని.. నేను సిద్ధూ తో కలిసి ఈటీవీ విన్ ప్లస్ ఓటిటి యాప్ కోసం శశి మధనం చేశాను. మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈటీవీ తో మంచి రిలేషన్ కొనసాగుతోంది.. అయితే ఆ సమయంలో ఏదైనా జరిగి ఉండొచ్చు.. దయచేసి ఎవరూ నాలాగా ఇలా రిస్కు తీసుకొని ఏ పనులు చేయకండి అంటూ కొత్త వాళ్లకి కూడా సలహా ఇచ్చింది సోనియా.

Advertisement

 

ALSO READ: ఇండస్ట్రీలో ఘోర విషాదం..లెజెండ్రీ పాండవాని సింగర్ మృతి!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×