E-Paper
Advertisement

jangaon: కేటీఆర్ టూర్‌లో అపశ్రుతి.. కాన్వాయ్‌లో ఢీ కొన్న రెండు కార్లు, ఎమ్మెల్సీకి గాయాలు

jangaon: కేటీఆర్ టూర్‌లో అపశ్రుతి.. కాన్వాయ్‌లో ఢీ కొన్న రెండు కార్లు, ఎమ్మెల్సీకి గాయాలు
Advertisement

jangaon: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్ల-వెనుక భాగాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్సీ గాయపడ్డారు.

కేటీఆర్ కన్నెపల్లి టూర్‌లో అపశ్రుతి

Advertisement

ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఆయన కాన్వాయ్ స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోకి రాగానే వాహనం వెనుక రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌‌ను సందర్శించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ ఘనపూర్ పరిసరాల్లోకి చేరుకోగానే డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.

ఈ క్రమంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్ల-వెనుక భాగాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం సమయంలో ఓ కారులో ఆ పార్టీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేతికి గాయాలు అయ్యాయి. ఛాతి భాగంలో గాయం కావడంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం కొంపల్లి కిమ్స్‌‌కి తరలించినట్టు తెలుస్తోంది.

Advertisement

కాన్వాయ్‌లో ఢీ కొన్న రెండు కార్లు, ఓ ఎమ్మెల్సీకి గాయాలు

అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కేటీఆర్ తన కాన్వాయ్‌ను కొంతదూరం వెళ్లాక నిలిపివేశారు. శంభీపూర్ రాజు ఆరోగ్యం గురించి అడిగి తెలుసు కున్నారు. నాయకులంతా కలిసి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లారు.

కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తత: మరోవైపు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ వాహనాలు వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. కన్నెపల్లి పంపు హౌస్‌కు చేరుకుని ప్రాజెక్టుని పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీరు ఎత్తిపోసే అవకాశం ఉన్నా రైతులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడిన విషయం తెల్సిందే.

ALSO READ: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. జూలై 6, 7 తేదీల్లో ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×