E-Paper
Advertisement

బిగ్ బాస్ కి నోటీసులు.. 2 కోట్లు ఇవ్వాల్సిందే – ప్రముఖ నటి

బిగ్ బాస్ కి నోటీసులు.. 2 కోట్లు ఇవ్వాల్సిందే – ప్రముఖ నటి
Advertisement

Bigg Boss:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ షో క్రేజ్ ఎలా ఉందంటే ఇందులో ఒక్కసారి అవకాశం రావాలని కోరుకునే నటీనటులే కాదు సామాన్యులు కూడా కోకొల్లలు.. బిగ్ బ్రదర్ పేరిట ఎక్కడో పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ షో క్రమంగా ఇండియా భాషలకి కూడా పాకిపోయింది. అలా హిందీలో మొదలైన ఈ షో క్రమంగా అన్ని ప్రాంతాలను వ్యాపించి.. ఇప్పుడు తెలుగు, తమిళ్ , కన్నడ, మరాఠీ, హిందీ, మలయాళం అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ కు నోటీసులు పంపించిన నటి..

ఇక తెలుగు విషయానికి వస్తే.. తెలుగులో బిగ్ బాస్ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్. త్వరలోనే పదవ సీజన్ కూడా మొదలుకానుంది . ఈసారి కూడా షో లో పాల్గొనాలని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కి ఒక నటి నోటీసులు పంపించింది.. తనకు బిగ్ బాస్ వల్ల నష్టం కలిగింది అని , రెండు కోట్లు నష్టం దావా వేసింది. మరి ఆమె ఎవరు? బిగ్ బాస్ వల్ల ఆమెకు కలిగిన నష్టం ఏమిటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వ్యాధి వచ్చి మూడు నెలలు అవుతున్నా తగ్గలేదు..

Advertisement

బిగ్ బాస్ గేమ్ మీద ఒక నటి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 మరాఠీ పూర్తయింది . ఈ సీజన్లో సినీ నటి తన్వీకొల్టే విజేతగా నిలిచింది. అయితే ఇదే సీజన్లో మోడల్, నటి సోనాలి రౌత్ కూడా పాల్గొనింది. అలాంటి ఈమె ఇప్పుడు బిగ్ బాస్ కు నోటీసులు పంపించింది. రెండు కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలి అని నోటీసులు పంపించినట్లు సమాచారం. బిగ్ బాస్ కారణంగా తనకు చర్మ సంబంధిత వ్యాధి తామర వచ్చిందని ఆరోపించింది. అందుకే షో నుంచి రెండు వారాలలోనే బయటకు వచ్చేసానని.. ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా ఈ వ్యాధి తగ్గలేదని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తనకు తామర వచ్చిందని , షో కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అందుకే నష్టపరిహారం చెల్లించాలి అంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

also read:నమ్మకద్రోహం భరించలేకపోయా.. కచ్చితంగా కర్మ అనుభవించే పోతావ్ -సుమన్ శెట్టి

సోనాలి రౌత్ కెరియర్..

Advertisement

సోనాలి రౌత్ విషయానికి వస్తే.. 1990 డిసెంబర్ 23న ముంబై మహారాష్ట్రలో జన్మించింది. మోడల్ గా తన కెరియర్ మొదలుపెట్టిన ఈమె .. 2010లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఒకరిగా దర్శనమిచ్చింది. 2011లో మాక్జిమం మ్యాగజైన్ కోసం ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ తో కలిసి ఒక సంచలనాత్మక ఫోటో షూట్ కూడా చేసింది. అలాగే 2014లో ది ఎక్స్పోజ్ అనే సినిమాలో నటించింది. అలాగే 99% యూస్ లెస్ ఫెలోస్ అనే చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత సినిమా నుండి తప్పుకుంది. దీనికి కారణం హిందీ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా చేరడమే. అలా ఆ బిగ్ బాస్ లో సందడి చేసిన ఈమె మళ్లీ బిగ్ బాస్ మరాఠీ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్గా చేసి ఈ షో వల్ల తనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని పంచుకుంది. మరి దీనిపై బిగ్ బాస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×