E-Paper
Advertisement

బ్రిడ్జర్‌తో రెనాల్ట్ బిగ్ స్ట్రాటజీ… డస్టర్‌ కు షాక్ తప్పదా?

బ్రిడ్జర్‌తో రెనాల్ట్ బిగ్ స్ట్రాటజీ… డస్టర్‌ కు షాక్ తప్పదా?
Advertisement

Renault’s Big Strategy: రెనాల్ట్ భారత మార్కెట్ కోసం కొత్తగా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రిడ్జర్ ను తీసుకురాబోతోంది. 2027లో విడుదల కానున్న ఈ మోడల్, డిజైన్. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ డ్ గా ఉండటమే కాకుండా, బిజినెస్ పరంగా కూడా కంపెనీకి చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా, డస్టర్. టెక్టన్ కంటే బ్రిడ్జర్ ఎందుకు పాపులర్ అవుతోందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బ్రిడ్జర్ ఎస్‌యూవీ గురించి..

బ్రిడ్జర్ ఎస్‌యూవీ బి సెగ్మెంట్‌కు చెందిన ఎస్‌యూవీ. అంటే 4 మీటర్ల లోపు ఉండే ఈ విభాగం భారత్ లో  అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజ్జాలాంటి మోడళ్లు ఈ సెగ్మెంట్‌ లో సత్తా చాటుతున్నాయి. ధర పరంగా అందుబాటులో ఉండటం, మంచి మైలేజీ, సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలంగా ఉండటం వల్ల ఈ కేటగిరీకి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే రెనాల్ట్ కూడా ఈ విభాగంలో బలంగా అడుగుపెట్టాలని చూస్తోంది.

గేమ్ ఛేంజర్ కాబోతుందా?

Advertisement

బ్రిడ్జర్ సక్సెస్ అయితే, రెనాల్ట్, నిస్సాన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ భారత్‌ లో తన స్థానం బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జర్ కీలక పాత్ర పోషించనుంది. ఇతర కంపెనీలు ఈ సెగ్మెంట్‌ లో విజయాన్ని సాధించిన విధానం చూస్తే, ఇది పెద్ద అవకాశంగా కనిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన అంశం పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్. బ్రిడ్జర్‌ లో ఒకే రకం ఇంజిన్ కాకుండా, పెట్రోల్, హైబ్రిడ్, CNG, అలాగే ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు ఎంపికలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ ఈ సెగ్మెంట్‌ లో ఇప్పటికీ తక్కువగా ఉంది. సో, రెనాల్ట్‌ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.

కొత్త ప్లాట్ ఫారమ్ పై తయారీ

ఈ SUV కొత్త ప్లాట్‌ ఫారమ్‌పై తయారవుతోంది. దీనివల్ల వివిధ రకాల ఇంజిన్‌లు ఒకే ప్లాట్‌ ఫారమ్‌పై అమర్చే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తయారీ ఖర్చులు తగ్గి, వాహనాన్ని పోటీ ధరలో అందించడానికి కంపెనీకి వీలు కలుగుతుంది. బ్రిడ్జర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా కంపెనీకి చాలా ముఖ్యం కానుంది. ఇది భారత్‌ లో రెనాల్ట్ తీసుకొచ్చే మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఒకసారి చార్జ్ చేస్తే మంచి రేంజ్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఇది కంపెనీకి కొత్త అవకాశాలను అందించే అవకాశం ఉంది.

Advertisement

మొత్తంగా బ్రిడ్జర్ కేవలం కొత్త కారు మాత్రమే కాదు. ఇది రెనాల్ట్, నిస్సాన్‌ కు భారత మార్కెట్‌లో తిరిగి బలపడేందుకు కీలకమైన అడుగు కాబోతోంది. సరైన ధర, మంచి ఫీచర్లు, విభిన్న పవర్‌ ట్రెయిన్ ఎంపికలు ఉంటే, ఈ SUV మార్కెట్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది.

Read Also: డీజిల్ కంటే బెస్ట్ మైలేజ్ ఇచ్చే 5 హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×