E-Paper
Advertisement

Kissik talks.. చిన్నప్పుడే తండ్రి చేతిలో చిత్రహింసలకి గురయ్యాను.. ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ కన్నీళ్లు!

Kissik talks.. చిన్నప్పుడే తండ్రి చేతిలో చిత్రహింసలకి గురయ్యాను.. ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ కన్నీళ్లు!
Advertisement

Kissik Talks: బిగ్ టీవీ పాపులర్ టాక్ షో “కిస్సిక్ టాక్స్” వేదికగా యాంకర్ వర్ష అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ తన గతాన్ని తలచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు .దీంతో ఎప్పుడూ బుల్లి తెరపై  సందడి చేసే ఈ యంగ్ హీరో వెనుక ఇంతటి విషాదం ఉందా అని షాక్ అవుతున్నారు నెటిజన్లు.

‘మౌనరాగం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన శివకుమార్ సాత్విక్ పాత్రతో మంచి మార్కులే కొట్టేశాడు.ఇక ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, మౌనరాగం సీరియల్‌లో తనతో పాటు నటించిన ప్రియాంక జైన్‌తో శివకుమార్ ప్రేమలో పడ్డ సంగతి తెల్సిందే.ముఖ్యంగా. 2023లో ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ప్రియాంక జైన్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టాప్-5 వరకు దూసుకెళ్లడంతో ఈ జంట మరింత పాపులర్ అయింది.
నరకం చూపించిన తండ్రి 
ఇలా సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న శివకుమార్, కిస్సిక్ టాక్ షో ప్రోమోలో తన తండ్రి ప్రవర్తన గురించి సంచలన నిజాలు బయటపెట్టాడు. సమాజంలో ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి, తన జీవితంలో ఒక విలన్‌లా మారాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా పని చేసేదని, సాయంత్రం స్కూల్ అయిపోయాక కేవలం అరగంట ఆలస్యంగా వచ్చినా తండ్రి నరకం చూపించేవాడని కన్నీరు పెట్టుకున్నాడు. పరాయి మగవాళ్లతో ముడిపెడుతూ నీచమైన మాటలతో నిందిస్తూ, విచక్షణారహితంగా కొట్టేవాడని శివకుమార్ గుర్తుచేసుకున్నాడు. మద్యం, గుట్కాలకు బానిసవడమే కాకుండా, ఎందరో మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబ గౌరవాన్ని బజారున పడేశాడని, ఆ తండ్రి ప్రవర్తన చూసి తన చెల్లికి అసలు మగవాళ్లంటేనే విరక్తి కలిగిందని ఆవేదన చెందాడు.
20 రూపాయల కోసం నానా రచ్చ 
ఒకరోజు కేవలం 20 రూపాయల గొడవ వల్ల తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భయంకరమైన రోజును శివకుమార్ ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆ తండ్రి ఎక్కడో తాగి 20 రూపాయలు పోగొట్టుకుని, ఆ నిందను శివకుమార్‌పై వేసి ఊరందరి ముందు నానా రచ్చ చేశాడట. ఆ అవమానాన్ని తట్టుకోలేక, రోజూ జరిగే ఈ నరకం భరించలేక చనిపోవడమే మేలని శివకుమార్ నిర్ణయించుకున్నాడు. తనే స్వయంగా తల్లి, చెల్లిపై కిరోసిన్ పోసి, తనపై కూడా పోసుకుని అగ్గిపుల్ల వెలిగించబోయాడు. సరిగ్గా అదే సమయంలో తన తల్లి దగ్గర చదువుకునే ఒక స్టూడెంట్ దేవుడిలా వచ్చి వారిని గదిలోంచి బయటకు లాగి కాపాడటంతో ప్రాణాలు దక్కాయని శివకుమార్ ఎమోషనల్ అయ్యాడు. ఒకవేళ ఆరోజు ఆ అబ్బాయి కాపాడకపోయుంటే ఈరోజు శివకుమార్ అనే నటుడు మీ ముందు ఉండేవాడు కాదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
వారిద్దరికీ విడాకులు ఇప్పిస్తున్నా
చిన్నప్పటి నుండి ఇప్పటి వరకి తనకి తన నాన్న నుండి సరైన ప్రేమ దొరకలేదని, కాని తానెప్పుడు తన నాన్నతో మంచిగానే ఉండాలని కోరుకుంటానని, ఐ లవ్ యూ సో మచ్ నాన్న అంటూ మనసులో దాచుకున్న ప్రేమని ఇలా బయటపెట్టాడు. అయితే అంతటి క్రూరుడితో కలిసి బతకడం కంటే విడిపోవడమే మంచిదని తన తల్లికి నచ్చజెప్పి, ఇన్నాళ్లకు వారిద్దరికీ విడాకులు ఇప్పిస్తున్నానని.అది కూడా ఈ షో ద్వారా ఫస్ట్ టైమ్ చెబుతున్నానని రివీల్ చేశాడు శివ కుమార్. ఇలా ఎన్నో విషయాలను ఈ షో ద్వారా పంచుకున్నాడు .. ప్రస్తుతం శివ కుమార్ ఎపిసోడ్ కు సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Advertisement

Also read :NBK111.. బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. జూన్ 10న డబుల్ ట్రీట్.. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో విశ్వరూపమే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×