E-Paper
Advertisement

డబ్బులు కట్టాలా? వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ ఫీచర్లు.. మెటా ప్లాన్స్ ఇవే!

డబ్బులు కట్టాలా? వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ ఫీచర్లు.. మెటా ప్లాన్స్ ఇవే!
Advertisement

Meta Plus Subscription: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మనం రోజూ వాడే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో కొన్ని అధునాతన ఫీచర్ల కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉంది. అయితే సాధారణ ఫీచర్లు ఎప్పటిలాగే ఉచితంగా లభిస్తాయని, కేవలం అదనపు ప్రైవసీ, క్రియేటర్ టూల్స్ కావాలనుకునే వారు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మెటా ప్లస్ పేరుతో కొత్త ప్లాన్స్:

మెటా సంస్థ ఈ పెయిడ్ సర్వీసులను ‘మెటా ప్లస్జ’ బ్రాండింగ్ కింద తీసుకురావాలని చూస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ధర నెలకు సుమారు 3.99 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాట్సప్ ప్లస్ ధర నెలకు దాదాపు 2.99 డాలర్లుగా ఉండవచ్చు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ప్లాట్‌ఫారమ్‌ను బట్టి ఈ ధరలు నెలకు రూ.250 నుండి రూ.350 వరకు ఉండే అవకాశం ఉంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ప్రత్యేక సదుపాయాలు:

Advertisement

ఈ ప్రీమియం ప్లాన్ తీసుకునే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వినియోగదారులకు కొన్ని ప్రత్యేకమైన టూల్స్ అందుబాటులోకి వస్తాయి. తమ స్టోరీని ఎవరెవరు ఎన్నిసార్లు తిరిగి చూశారో తెలుసుకోవడం, ఇతరులకు తెలియకుండా అజ్ఞాతంగా వారి స్టోరీలను వీక్షించడం, ప్రొఫైల్ కస్టమైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. క్రియేటర్ల రీచ్ పెంచేందుకు వీక్లీ స్పాట్‌లైట్ బూస్ట్ వంటి ఆప్షన్లు కూడా లభిస్తాయి.

Also Read: 54 డిగ్రీల హీట్‌నైనా తట్టుకునే బెస్ట్ 1 టన్ ఏసీలు ఇవే.. కరెంట్ బిల్లు కూడా తక్కువే!

వాట్సాప్ ప్లస్‌లో కొత్త లుక్:

Advertisement

వాట్సప్ ప్రీమియం వినియోగదారుల కోసం చాట్ మేనేజ్‌మెంట్ మరింత సులువు కానుంది. దీనిలో నచ్చినట్టు మార్చుకునే ప్రత్యేకమైన థీమ్స్, సరికొత్త స్టిక్కర్లు, ప్రీమియం నోటిఫికేషన్ సౌండ్స్ లభిస్తాయి. వీటికి తోడు ఆఫీస్ లేదా వ్యాపార అవసరాల కోసం ముఖ్యమైన చాట్‌లను ఎక్కువ సంఖ్యలో పిన్ చేసుకునే సదుపాయాన్ని కూడా మెటా కల్పించబోతోంది.

మెటా వన్ పేరిట కాంబో ఆఫర్:

ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) సాంకేతికతపై మెటా భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేవలం ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడకుండా స్థిరమైన ఆదాయ వనరును సృష్టించుకోవడానికే మెటా ఈ అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో వీటన్నింటినీ కలిపి ‘మెటా వన్’ అనే ఒకే ప్యాకేజీగా కూడా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్లాన్స్ పరిశీలన, టెస్టింగ్ దశలోనే ఉన్నాయి.

Also Read: ఏసీ కొనే ప్లాన్ ఉందా? ఈ ‘కాపర్ కండెన్సర్’ సీక్రెట్ తెలియకపోతే మీ డబ్బులు వేస్ట్ అయినట్టే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×