E-Paper
Advertisement

అయ్య బాబోయ్.. లీకైన సిలిండర్ ను గాల్లోకి విసిరేసిన సీరియల్ హీరోయిన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!

అయ్య బాబోయ్.. లీకైన సిలిండర్ ను గాల్లోకి విసిరేసిన సీరియల్ హీరోయిన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!
Advertisement

TV: టెలివిజన్ సీరియల్స్ అంటేనే వినోదం, ఎమోషన్స్.. కానీ అప్పుడప్పుడు కొన్ని సీన్లు చూస్తే మాత్రం “ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలేదే!” అనక మానలేం. తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే ‘గుండమ్మ కథ’ సీరియల్‌కు సంబంధించిన ఒక క్లిప్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కిచెన్‌లో గ్యాస్ లీక్ అవుతుంటే మన హీరోయిన్ చేసిన సాహసం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అసలు ఆ సీన్ లో ఏముంది? ఎందుకు అంతలా ట్రోల్ అవుతుందో చూద్దాం..

సిలిండర్‌తో గుండమ్మ ఫీట్లు:

సాధారణంగా గ్యాస్ లీక్ అయితే మనం వెంటనే రెగ్యులేటర్ ఆపేస్తాం లేదా కిటికీలు తెరుస్తాం. కానీ ‘గుండమ్మ కథ’ హీరోయిన్ గీత మాత్రం రూటే సెపరేట్ అని నిరూపించింది. కిచెన్‌లో సిలిండర్ లీక్ అవుతుంటే, ఆమె ఏమాత్రం కంగారు పడకుండా ఆ భారీ సిలిండర్‌ను సింగిల్ హ్యాండ్‌తో పట్టుకుని బయటకు తీసుకొచ్చింది. ఇక అంతటితో ఆగకుండా, దానిని అమాంతం గాలిలోకి విసిరేసింది. ఆ సిలిండర్ అలా గాల్లో ఎగురుకుంటూ వెళ్లి ఇంటి అవతల పడి పేలిపోవడం చూస్తుంటే బాహుబలి రేంజ్ యాక్షన్ గుర్తొస్తుందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

హీరోయిన్ పవర్.. హీరో గారి రియాక్షన్:

Advertisement

ఈ సీరియల్‌లో హీరోయిన్ కొంచెం బొద్దుగా, ధైర్యవంతురాలిగా కనిపిస్తుంది. ఆమె భర్త సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్నా, ఈ సీన్ లో మాత్రం హీరోయిన్ చేసిన పనికి హడలిపోయాడు. సిలిండర్ పేలిపోగానే భయంతో హీరో గారు ఏకంగా హీరోయిన్ చంక ఎక్కడం ఈ క్లిప్‌లో మరో హైలైట్. ఇక హీరోయిన్ శక్తిని పొగిడే క్రమంలో దర్శకుడు చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు కామెడీ సీన్ అయి కూర్చుంది. ఈ వింత హీరోయిజం చూసి సామాన్య ప్రేక్షకులు సైతం అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం:

ఈ వీడియో క్లిప్ బయటకు రాగానే మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. “ఏంట్రా బాబు ఈ ఐడియాలు.. అసలు గ్రావిటీ అనేదే లేదా?” అని కొందరు, హాలీవుడ్ మూవీస్ లో కూడా ఇలాంటి ఫీట్లు చూడలేదు సామీ” అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక నిజానికి సీరియల్స్ లో లాజిక్ వెతకకూడదని అందరికీ తెలుసు, కానీ మరీ గ్యాస్ సిలిండర్‌ను గాల్లోకి విసిరేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా! అందుకే ఈ సీన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ALSO READ:ఏ బ్యూటిఫుల్ మూమెంట్.. కాబోయే భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన బెల్లంకొండ హీరో!

లాజిక్ లేని సీరియల్ లోకమ్:

గతంలో కూడా చాలా సీరియల్స్ లో ఇలాంటి వింత సీన్లు వచ్చాయి. ఒకరు ల్యాప్‌టాప్‌ను సబ్బుతో కడగడం, మరొకరు గాలిలో ఎగురుతూ తాళి కట్టడం వంటివి మనం చూశాం. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ‘సిలిండర్ ఫైట్’ కూడా చేరిపోయింది. ప్రేక్షకులకు వినోదం పంచాలనే తాపత్రయంలో దర్శకులు కొన్నిసార్లు వాస్తవానికి దూరంగా వెళ్లిపోతుంటారు. ఇక ఏదేమైనా ఈ సీన్ మాత్రం ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని, నవ్వును అందిస్తోంది.

సినిమాల్లో హీరోలు విలన్లను గాల్లోకి విసిరేయడం చూశాం కానీ, సీరియల్ హీరోయిన్ ఇలా సిలిండర్‌ను విసిరేయడం మాత్రం ఇదే మొదటిసారి కాబోలు. సీరియల్ టీమ్ ఉద్దేశం హీరోయిన్ బలాన్ని చూపించడం కావొచ్చు, కానీ అది కాస్తా రివర్స్ అయి ట్రోలింగ్‌కు దారితీసింది. ఏదేమైనా ఈ వీడియో చూశాక “గుండమ్మ కథ” రేటింగ్ పెరుగుతుందో లేదో కానీ, నెటిజన్లకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×