E-Paper
Advertisement

Amaravati: ఏపీకి డబుల్ బూస్ట్! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు, అమరావతి నుంచి ఆ రెండు నగరాలకు

Amaravati: ఏపీకి డబుల్ బూస్ట్! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు, అమరావతి నుంచి ఆ రెండు నగరాలకు
Advertisement

Amaravati: ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేవలం రోడ్లు, విమానాలు మాత్రమే. రైలు కనెక్టివిటీ ఉండేలా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో నిర్మించనున్న రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు రాజధాని అమరావతితో లింకు కనెక్ట్ కానుంది. ఇంతకీ కొత్త హైస్పీడ్ రైళ్ల కారిడార్ ఏంటి? ఎక్కడ అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

ఏపీకి కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు

Advertisement

ఏపీలో అన్ని జిల్లాలకు రైలు కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కొత్త హైస్పీడ్ కారిడార్లపై ఆయన ఫోకస్ చేశారు. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో అమరావతి మీదుగా వెళ్లేలా కేంద్రం ప్లాన్ చేసింది. అదే సమయంలో సీఎం చంద్రబాబు.. కొత్తగా మరొక ప్రతిపాదన తీసుకొచ్చారు.

అందులో గుంటూరు నుంచి చెన్నైకి, మరొకటి నాయుడుపేట నుంచి మైసూరు వరకు కనెక్టివిటీ. దీంతో నాయుడుపేట హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు కీలక హబ్‌‌గా మారనుంది. మైసూరు టు చెన్నై కారిడార్‌లో చిత్తూరు-తిరుపతి-నాయుడుపేటకు లింకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

అమరావతి నుంచి చెన్నై, ఆపై మైసూరు 

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన బాగుండడంతో నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ మ్యాప్ లో చేర్చింది. వచ్చే ఏడాది నాటికి వీటికి సంబంధించి డీపీఆర్‌లు రూపొందించనున్నారు. ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది. 2029 కి ముందు శంకుస్థాపనలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి కారిడార్‌ రానుంది. అదే సమయంలో నాయుడుపేట నుంచి తిరుపతి, చిత్తూరు, బంగారపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరుకు మరొకటి రానుంది. ప్రస్తుతం అహ్మదాబాద్‌-ముంబై మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ALSO READ: జగన్‌కు దిమ్మతిరిగేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్, ఇంప్లిమెంట్ అయితే, ఇక వైసీపీ అస్సామే? 

నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీని ద్వారా వివిధ కారిడార్ల డీపీఆర్‌ల రూపకల్పన జరుగుతోంది. మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కారిడార్‌ నిర్మాణ పనులు పూర్తి చేయనుంది. బడ్జెట్‌లో కొత్తగా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను చేర్చింది. అందులో తెలంగాణ, ఆంధ్ర-తమిళనాడు, కర్ణాటకలకు ఉపయోగపడేలా రెండు కారిడార్లను మంజూరు చేసిన విషయం తెల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×