E-Paper
Advertisement

Podarillu : ‘పొదరిల్లు’ లో డాక్టర్ బాబు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్… మ్యాటరేంటంటే..?

Podarillu : ‘పొదరిల్లు’ లో డాక్టర్ బాబు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్… మ్యాటరేంటంటే..?
Advertisement

Podarillu : బులితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ముందు వరుసలో సీరియల్స్ ఉంటాయి. ఈమధ్య సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. ఒక సీరియల్ హిట్ అయితే, దానికి సీక్వల్ గా మరొక సీరియల్ కూడా వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సీరియల్ లో నటిస్తున్న వాళ్లకి సినిమా హీరోల కన్నా క్రేజ్ ఎక్కువే. హీరోలను పెద్దగా పట్టించుకోని జనాలు సీరియల్ స్టార్ కు మాత్రం నీరాజనం పలుకుతుంటారు. అలా జనాలను తన నటనతో ఆకట్టుకున్న ఎంతోమంది నటీనటుల్లో డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ పరిటాల ఒకరు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.. ఈయన సీరియల్ లో హీరోగా నటించిన మాత్రమే కాదు ఈమధ్య ప్రొడ్యూసర్ గా కూడా సీరియల్ ని నిర్మిస్తున్నారు. ఆ సీరియలే పొదరిల్లు.. నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా కీలక పాత్రలో నటించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. మరి ఏ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

సీరియల్స్ కు నిర్మాతగా నిరూపమ్..

సీరియల్ నటుడు నిరూపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తూనే మరోవైపు వరుసగా సీరియల్స్ ని నిర్మిస్తున్నాడు. గతంలో హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌ని నటించి.. నిర్మించిన నిరుపమ్ పరిటాల.. ఇప్పుడు స్టార్ మా ఛానల్‌లో ‘పొదరిల్లు’ సీరియల్‌ని నిర్మించారు.. ఈ సీరియల్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నలుగురు మగాళ్లు ఉన్న ఇంటికి ఒక అమ్మాయి కోడలుగా వెళితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. ప్రస్తుతం నిరూపము నటిస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ తోనే ఈ సీరియల్ పోటీ పడుతుంది. నటుడుగా తన కెరీయర్ని మొదలు పెట్టిన నిరూపం ఇప్పుడు నిర్మాతగా స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ కు వ్యవహరిస్తున్నారు. అయితే కొన్ని సీరియల్స్ కి ఆయన హీరోగా కూడా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Also Read :ఆ టాటు వల్ల 6 నెలలు బాధపడ్డాను.. శివుడి పై నటి సంచలన వ్యాఖ్యలు..

‘పొదరిల్లు ‘ లో డాక్టర్ బాబు ఏ పాత్రలో..? 

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ హీరో హీరోయిన్లు కొత్తవాళ్లే. సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న కృతిక గతంలో మగువా ఓ మగువ సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. చక్రి తమిళ నటుడు.. తమిళ్ లో ఎన్నో సీరియల్స్లలో నటించి పాపులర్ అయిన ఇతను తెలుగులో ఈ సీరియల్ తో పరిచయమయ్యాడు. ఇందులో నటిస్తున్న నటీనటులు చాలా వరకు అందరికీ తెలిసిన వాళ్లే. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్న స్టోరీలో మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతుంది అంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. నిరూపం పరిటాల ఈ సీరియల్కు నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా.. ఓ పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం మహా, చక్రీ ల రిసెప్షన్ను ఏర్పాటు చేస్తారు.. ఆ కార్యక్రమంలో డాక్టర్ బాబు సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా త్వరలోనే ఆయన సీరియల్లో కీలక పాత్రలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి ఈ వార్త గనక నిజమే అయితే బుల్లితెర ఆడియన్స్ కి ఫుల్ హ్యాపీనే.. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఈ సీరియల్ ని తప్పకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×