E-Paper
Advertisement

Top Selling Cars Jan 2026: మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!

Top Selling Cars Jan 2026: మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!
Advertisement

జనవరి 2026లో కార్ల బ్రాండ్లు సత్తా చాటుతున్నాయి. భారతీయ కార్ల మార్కెట్ లో SUVలు, ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌లు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఇయర్ ఎండింగ్ డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మారుతి బాలెనో అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. అటు టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాల్లో కొత్త జోష్ కనబరిచాయి. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో మారుతి ఫ్రాంక్స్, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో ఎన్, కొత్తగా ప్రారంభించబడిన టాటా సియెర్రా ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని మరింత జోష్ తో ప్రారంభించాయి.

జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన కార్లు  

⦿ మారుతి సుజుకి బాలెనో: కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి బాలెన్ అమ్మకాల్లో టాప్ లో నిలిచింది. అధిక డిమాండ్, మంచి సేఫ్టీ రేటింగ్ కారణంగా 2025 చివరిలో, 2026 ప్రారంభంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

⦿ టాటా పంచ్: టాటా మోటార్స్ కు చెందిన పలు కార్లు అమ్మకాల్లో సత్తా చాటాయి. మంచి సేఫ్టీ రేటింగ్, సూపర్ స్టైల్ కారణంగా పంచ్.. హై వాల్యూమ్ మైక్రో SUVగా కొనసాగుతోంది.

⦿ హ్యుందాయ్ క్రెటా: ఈ కారు మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUVగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విభాగంలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

Advertisement

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్: ఇండియన్ మార్కెట్ లో హై వాల్యూమ్ హ్యాచ్‌ బ్యాక్ గా సత్తా చాటుతోంది. అమ్మకాల్లో మంచి సత్తా చాటుతోంది.

⦿ టాటా నెక్సాన్: టాటా మోటార్స్ కు చెందిన నెక్సాన్ కూడా మంచి ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. అమ్మకాల్లోనూ జోష్ కొనసాగిస్తోంది.

⦿ మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఇక కొత్త సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV క్రాస్ ఓవర్ గా మారుతి సుజుకి ఫ్రాంక్స్ సత్తా చాటింది.

⦿ మహీంద్రా స్కార్పియో-ఎన్: స్ట్రాంగ్ SUV విభాగంలో మహీంద్రా స్కార్పియో-ఎన్ ముందంజలో ఉంది. అమ్మకాల పరంగానూ మంచి ఊపు కొనసాగిస్తోంది.

⦿ కియా సెల్టోస్: కియా కంపెనీకి చెందిన సెల్టోస్ కూడా మంచి జనాదరణతో దూసుకుపోతోంది. కొత్తగా అప్ డేట్ చేయబడిన ఈ మిడ్ సైజ్ SUV అమ్మకాల్లో దూకుడు కొనసాగిస్తోంది.

⦿ మారుతి సుజుకి డిజైర్: సెడాన్లలో మారుతి సుజుకి డిజైర్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అమ్మకాల పరంగానూ సత్తా చాటుతోంది.

⦿ మహీంద్రా థార్: లైఫ్ స్టైల్ SUV విభాగంలో బలమైన అమ్మకాలను కొనసాగిస్తోంది. ఇండియన్ మార్కెట్ లో ఎక్కువగా ఇష్టపడే కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

జనవరి 2026 మార్కెట్ ట్రెండ్స్

⦿ SUV విభాగం: హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, ఫ్రాంక్స్ లాంటి మోడళ్లు SUV విభాగంలో సత్తా చాటాయి.

⦿ కొత్త లాంచ్‌లు: టాటా సియెర్రా, మహీంద్రా XUV 7XO 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యాయి.

⦿ హైబ్రిడ్, EV వృద్ధి: గ్రాండ్ విటారా, మహీంద్రా XUV 3XO EV లాంటి హైబ్రిడ్ మోడళ్లకు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

⦿ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌లు: మారుతి బాలెనో మంచి వాల్యూమ్‌ను కలిగి ఉంది.

Read Also: బైక్స్ అమ్మకాల్లో కొత్త జోష్, జనవరిలో టాప్ మోడల్ ఇదే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×