E-Paper
Advertisement

మొగలిరేకులు సీరియల్ నటుడిపై రమాప్రభ ఫైర్.. ఏమైందంటే?

మొగలిరేకులు సీరియల్ నటుడిపై రమాప్రభ ఫైర్.. ఏమైందంటే?
Advertisement

Rama Prabha: చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ నటీమణి రమాప్రభ (Ramaprabha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. తన సినీ కెరియర్లో సుమారుగా 1400కు పైగా చిత్రాలలో నటించి ఊహించని విజయాలను సొంతం చేసుకుంది.. చిన్నతనం నుంచే నటన మీద ఆసక్తి ఉండడంతో ఆ దిశగా అడుగులు వేసిన ఈమె.. హాస్య నటిగా మంచి పేరు సొంతం చేసుకుంది. అల్లు రామలింగయ్య, రాజాబాబు వంటి నటులకు జోడీగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అలాంటి ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా మదనపల్లిలోనే ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈమెకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొగలిరేకులు నటుడిపై నీకెంత బలుపు అంటూ సీరియస్ అయిందట.మరి ఆయన ఎవరు ? ఈమె ఎందుకు సీరియస్ అయింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

నాటి విషయాలను గుర్తు చేసుకున్న సాగర్..

ఆయన ఎవరో కాదు మొగలిరేకులు సీరియల్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాగర్. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో ఒకప్పుడు బుల్లితెరను ఊపేసిన ఈయన మొగలిరేకులు సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆర్కే నాయుడు పాత్ర ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ చాలామంది ఈయన ఒరిజినల్ పేరు సాగర్ కంటే సీరియల్ పేరు ఆర్కే నాయుడు గానే గుర్తుపెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదేమో. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా చేసిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్.. తన కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు.

సాగర్ పై సినీనటి ఫైర్..

Advertisement

అందులో భాగంగానే తనకు చక్రవాకం తర్వాత మొగలిరేకులు సీరియల్ లో నటించే అవకాశం ఎలా వచ్చింది? అనే ప్రశ్నపై మాట్లాడుతూ..” చక్రవాకం సీరియల్ తర్వాత కెరియర్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో పడ్డాను. అదే సమయంలో ఒక తమిళ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. సీనియర్ నటి రమాప్రభ నన్ను రికమెండ్ చేసి ఆ తమిళ సీరియల్ లో నటించే అవకాశాన్ని ఇప్పించారు. అయితే డేట్స్ అన్నీ ఫిక్స్ అయ్యాక ఏదో కారణంతో నేను అక్కడికి వెళ్తే నాపై అదే రమాప్రభ కోపానికి గురైంది. నిజానికి నేను చెన్నైకి కొత్త. యాక్టింగ్ స్కూల్లో నేర్పించిన యాక్టింగ్ ఒకటి.. బయట చేయాల్సింది మాత్రం మరొకటి.. డ్రామా స్కూల్ లో నాకు సహజంగా ఎలా నటించాలి అనే విషయాన్ని మాత్రమే నేర్పించారు. కానీ సీరియల్స్ లో మాత్రం డ్రామాటిక్గా చేయాలి అనగానే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే నేను చెన్నై వెళ్లలేకపోయాను.

ALSO READ:విజయ్ కోసం త్రిష మతం మారిందా?

సాగర్ కి బలుపు అంటూ రమాప్రభ కామెంట్స్.

Advertisement

దీంతో రికమెండ్ చేసినా వెళ్లకపోవడంతో రమాప్రభ హర్ట్ అయ్యారు . ఆ తరువాత ఒకరోజు మొగలిరేకులు సీరియల్ స్టార్ట్ అయ్యాక అక్కడికి వెళ్తే.. అదే సెట్లోకి అనుకోకుండా రమాప్రభ కూడా వచ్చారు. ఇక మొగలిరేకులు సీరియల్ టీం తో ఈ అబ్బాయికి చెన్నైలో మంచి ఛాన్స్ ఇప్పిస్తే వెళ్లలేదు ఇతనికి చాలా బలుపు.. హీరోగా నటించే అవకాశం వదులుకున్నాడు అంటూ ఫైర్ అయ్యింది. ఇక నేను చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండి ఇక్కడే సీరియల్స్ చేయాలి అనుకుంటున్నాను అన్న విషయాన్ని ఆమెతో చెప్పాను” అంటూ సాగర్ తెలిపారు. ఇకపోతే మొగలిరేకులు టీం కూడా ఎందుకు చెన్నై వెళ్లలేదు అని ప్రశ్నిస్తే నాకు ఇక్కడే ఛాన్స్ ఇవ్వండి నటిస్తాను అని అడిగారట.. ఇక దాంతో ఆర్కే నాయుడు అనే పాత్రకు సెలెక్ట్ చేశారు. అలా మొత్తానికైతే ఆ పాత్రతో తన నటన విశ్వరూపాన్ని చూపించి మంచి పేరు దక్కించుకున్నారు సాగర్.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×