E-Paper
Advertisement

Saylim Chaudhari: అమర్దీప్ అలాంటివాడని ఊహించలేదు.. నిజాలు బయటపెట్టిన బ్యూటీ!

Saylim Chaudhari: అమర్దీప్ అలాంటివాడని ఊహించలేదు.. నిజాలు బయటపెట్టిన బ్యూటీ!
Advertisement

Saylim Chaudhari: బుల్లితెరపై స్టార్‌గా ఎదిగి ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుడు అమర్దీప్ చౌదరి(Amardeep chowdary). ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుమతి శతకం’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర కథానాయిక సైలీమ్ చౌదరి (Saylim Chaudhari) అమర్దీప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నటుడిగా, వ్యక్తిగా అమరదీప్ ఎలా ఉంటారు? సెట్స్‌లో ఆయన ప్రవర్తన ఏంటి? అన్న విషయాలపై ఆమె పంచుకున్న మనసులోని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమర్దీప్ చాలా కైండ్ పర్సన్..

సినిమా షూటింగ్ సమయంలో కో-స్టార్స్‌ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటే అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది. ‘సుమతీ శతకం’ చిత్ర కథానాయిక సైలీమ్ చౌదరి అమర్దీప్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి వ్యక్తి, సెట్స్‌లో ఎంతో మద్దతుగా ఉంటారు. బయటకు కనిపించే దానికంటే అమర్దీప్ చాలా కైండ్ పర్సన్” అని ఆమె పేర్కొన్నారు. కేవలం నటుడిగానే కాకుండా షూటింగ్ సమయంలో తోటి నటీనటులకు సౌకర్యంగా ఉండేలా చూసుకునే గుణం ఆయనలో ఉందని, ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్ర ఇది..

Advertisement

ఈ సినిమాలో సైలీమ్ ‘సుమతీ శతకం’ అనే ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయిలా కనిపిస్తూనే ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్ర ఇది అని ఆమె వివరించారు. ఇలాంటి కష్టమైన పాత్ర చేస్తున్నప్పుడు హీరో అమర్దీప్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అన్నారు. రొమాంటిక్ సీన్స్ లేదా ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆయన చూపించిన చొరవ వల్ల తన నటన మరింత మెరుగ్గా వచ్చిందని సైలీమ్ అభిప్రాయపడ్డారు. ప్రతి నటి కోరుకునే డ్రీమ్ రోల్‌ను తాను ఈ చిత్రంలో పోషించానని, దానికి అమర్దీప్ సహకారం కూడా ఒక కారణమని ఆమె కొనియాడారు.

also read:Athadu Movie:మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న అతడు మూవీ.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికేనా?

టాలీవుడ్‌లో పెద్ద హీరోగా ఎదగడం ఖాయం..

Advertisement

అమర్దీప్ కష్టపడే తత్వం చూస్తుంటే ఆయన త్వరలోనే టాలీవుడ్‌లో పెద్ద హీరోగా ఎదుగుతారని సైలీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం అమర్దీప్ మాత్రమే కాకుండా టీమ్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పని చేశారని, తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. షూటింగ్ అనుభవాలు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా సాగాయని, అమరదీప్ లాంటి నటుడితో పని చేయడం వల్ల తనకు తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరిగిందని ఆమె సరదాగా పంచుకున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా అమర్దీప్ కెరీర్‌ను మార్చేస్తుందని ఆమె బలంగా నమ్ముతున్నారు.

అమరదీప్ నటనలో మాత్రమే కాదు, వ్యక్తిత్వంలో కూడా హీరో అని సైలీమ్ మాటలు నిరూపిస్తున్నాయి. ‘సుమతీ శతకం’ సినిమాతో ఈ జోడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అమర్దీప్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×