E-Paper
Advertisement

Thriller Movie OTT : ఫ్యామిలీ ఫ్యామిలీ అలాంటి వాళ్ళే… ఒక్కో ట్విస్ట్ కి మైండ్ బ్లాక్… బుర్ర బుర్రబద్దలయ్యే క్లైమాక్స్

Thriller Movie OTT : ఫ్యామిలీ ఫ్యామిలీ అలాంటి వాళ్ళే… ఒక్కో ట్విస్ట్ కి మైండ్ బ్లాక్… బుర్ర బుర్రబద్దలయ్యే క్లైమాక్స్
Advertisement

Thriller Movie OTT : కొరియన్ సినిమా చరిత్రలోనే మాస్టర్‌ పీస్ గా నిలిచింది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ధనవంతులు, పేదల మధ్య ఉన్న తేడా, మనుషులు పరిస్థితులను బట్టి ఎలా మారిపోతారో అద్భుతంగా చూపిస్తుంది. నాలుగు ఆస్కార్లు గెలిచిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలా ఉంటుందో. క్లైమాక్స్ మాత్రం వీర లెవెల్ లో ఉంటుంది. కామెడీతో పాటు, కంటెంట్ కూడా ఉన్న ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘పరసైట్’ (Parasite). 2019లో కొరియన్ డైరెక్టర్ బాంగ్ జూన్-హో రూపొందించిన మాస్టర్‌ పీస్ ఇది. ఆస్కార్‌లో బెస్ట్ పిక్చర్ సహా 4 ఆస్కార్స్ గెలిచిన మొదటి నాన్ ఇంగ్లీష్ సినిమా కూడా ఇదే. IMDbలో 8.5 రేటింగ్ ను కూడా పొందింది. ఈ చిత్రం $ 167.6 మిలియన్లతో కొరియాలోనే19వ అత్యంత విజయవంతమైన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లే, యూట్యూబ్ మూవీస్, సోనీ లివ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ప్రధానంగా రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న రేకుల షెడ్ లో ఉండే కిమ్ ఫ్యామిలీ, ఇంకొకటి చాలా ధనవంతులు అయిన పార్క్ ఫ్యామిలీ. కిమ్ ఫ్యామిలీ చాలా దరిద్రంలో బతుకుతుంటారు. ఒక రోజు కిమ్ కొడుకు కి-వూ, తన ఫ్రెండ్ ద్వారా పార్క్ కుటుంబంలో ఇంగ్లీష్ ట్యూటర్‌గా చేరుతాడు. మెల్లగా తన చెల్లెలిని ఆర్ట్ టీచర్‌గా, తండ్రిని డ్రైవర్‌గా, తల్లిని వంట మనిషిగా… ఎవరికీ తెలియకుండా ఒకరి తర్వాత ఒకరిని ఆ ఇంట్లో ఉద్యోగాల్లో చేర్పిస్తాడు.

అందుకు తగ్గ అర్హతలు కూడా వాళ్ళకు ఉండవు. కానీ మ్యానేజ్ చేస్తుంటారు. ఒకరోజు పార్క్ ఫ్యామిలీ బయటికి వెళ్లినప్పుడు, పాత వంట మనిషి వచ్చి ఆ ఇంట్లోని ఒక బంకర్ లో ఉన్న సీక్రెట్ గురించి చెబుతుంది. అక్కడ ఆమె భర్త గత కొన్ని ఏళ్లుగా దాక్కుని ఉంటున్నాడని తెలుస్తుంది. ఈ రహస్యం బయటపడటంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలవుతుంది. అదే సమయంలో వర్షం వల్ల వరదలు వచ్చి కిమ్ ఫ్యామిలీ ఇల్లు మునిగిపోతుంది. ఇక కథలో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు మర్డర్ అవుతూ ఉంటారు. అసలు ఆ ఇంట్లో ఉన్న బంకర్లో ఏళ్లుగా ఆ వ్యక్తి ఎందుకు ఉన్నాడు ? ఆ ఇంట్లో ఎందుకు హత్యలు జరుగుతాయి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×