E-Paper
Advertisement

చమ్మక్ చంద్రతో అలాంటి బంధం.. ఇన్నాళ్లకు నిజం చెప్పిన సత్య శ్రీ!

చమ్మక్ చంద్రతో అలాంటి బంధం.. ఇన్నాళ్లకు నిజం చెప్పిన సత్య శ్రీ!
Advertisement

Jabardasth: బుల్లితెరపై ఏకైక కామెడీ షోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ షోలో తమ టాలెంటును ఉపయోగించుకున్న ఎంతోమంది కమెడియన్లు నేడు సినిమాలలో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. కొంతమంది హీరోలుగా.. మరికొంతమంది నిర్మాతలుగా.. ఇంకొంతమంది దర్శకులుగా ..కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ టాలెంటును నిరూపించుకుంటూ సినిమా రంగంలో స్థిరపడిపోతున్నారు.

టీఆర్పీ కోసం పుట్టుకొచ్చే ప్రేమ జంటలు..

ఇదిలా ఉండగా జబర్దస్త్ కార్యక్రమంలో కొన్ని ప్రేమ జంటలు పుట్టుకొస్తే.. టిఆర్పి రేటింగ్ కోసం జబర్దస్త్ నిర్వాహకులు సృష్టించిన ప్రేమ జంటలు కొన్ని.. మరి కొంతమంది మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా ఏదో రిలేషన్ ఉందని ఎఫైర్స్ సృష్టిస్తూ ఉంటారు నెటిజన్స్. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర టీంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకున్న సత్య శ్రీకి కూడా చంద్రతో ఏదో రిలేషన్ ఉందనే రూమర్స్ వినిపించాయి. దాంతో ఆమె ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది.

రూమర్స్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన సత్య శ్రీ..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. నాగబాబు జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాక ఆయనను నమ్ముకున్న ఎంతోమంది షో నుంచీ బయటకు వచ్చేసారు. వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. చమ్మక్ చంద్ర బయటకు రావడంతో ఆయన స్కిట్లో చేసిన సత్య శ్రీ కూడా ఆయనతో పాటే బయటకు వచ్చింది. తర్వాత ఇద్దరు మరో కామెడీ షో లో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఏదో ఉందని వార్తలు రాగా.. దీనిపై సత్య శ్రీ మాట్లాడుతూ.. “చమ్మక్ చంద్ర నాకు గురువు లాంటి వారు. అంతకుమించితే మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మొదట్లో నాకు నటన అంటే కొంచెం భయం ఉండేది. జబర్దస్త్ లోకి వచ్చి చంద్ర టీంలో చేరిన తర్వాత ఆయన శిక్షణలో నేను ఎంతో నేర్చుకున్నాను. నటనపై ఎన్నో మెలుకువలు నేర్చుకన్నాను.

also read:39 ఏళ్ల నాటి జ్ఞాపకాలు.. పవన్ భార్య ఊహించని పోస్ట్!

కుటుంబ సపోర్ట్ తోనే ఇదంతా..

Advertisement

మాపై అనేక రూమర్లు వచ్చినప్పటికీ ఏ రోజు మేము వాటిని పట్టించుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. పరిహార్సల్స్, స్కిట్ సమయంలో తప్ప ఇక ఏ సమయంలో కూడా నేను చంద్రను కలవను. ఇక నేను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం మొదటి నుంచి చంద్ర టీం లోనే స్కిట్లు చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఆయన వెళ్లిపోవడంతో నేను కూడా ఆ షో నుంచి బయటకు వచ్చేసాను. మళ్ళీ కొన్ని కారణాల వల్ల షోలోకి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే” అంటూ ఒక్క మాటతో రూమర్స్ కి చెక్ పెట్టింది సత్య శ్రీ. ప్రస్తుతం రూమర్స్ క్లారిటీ ఇచ్చింది మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×