E-Paper
Advertisement

మీ స్మార్ట్‌ఫోన్ తరచూ స్లో అవుతుందా?.. స్పీడ్ పెంచే 5 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ తరచూ స్లో అవుతుందా?.. స్పీడ్ పెంచే 5 చిట్కాలు
Advertisement

Smart Phone Lagging Solve: మీ స్మార్ట్ ఫోన్ లో లాగింగ్ ఇష్యూ ఉందా? ఏదైనా యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడో, మెసేజ్ చదువుతున్నప్పుడో.. స్టక్ అవుతుందా? వీటికి పలుకారణాలు ఉండవచ్చు. ఎక్కువ కాలం పాటు ఉపయోగించిన తర్వాత స్మార్ట్ నెమ్మదిస్తుంది. దాని పనితీరు తగ్గి లాగింగ్ సమస్యను ఎదుర్కొంటారు. యాప్‌లు తెరవడానికి ఎక్కువ సమయం పట్టడం లేదా వాడుతున్నప్పుడు స్క్రీన్ స్టక్ అవ్వడం వంటి సమస్యలు తరచుగా చికాకు కలిగిస్తాయి. ఈ సమస్యలకు సాఫ్ట్‌వేర్, స్టోరేజ్, కస్టమర్ల అలవాట్ల కారణంగా లాగింగ్ ఏర్పడుతుందని స్మార్ట్‌ఫోన్ నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి కారణాలు

ఫోన్ వాడుతున్న కొద్దీ స్టోరేజీ నిండిపోతుంది. ఓల్డ్ సాఫ్ట్‌వేర్, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌ల కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు నెమ్మదిస్తాయి. ఒకేసారి ఎక్కువ యాప్‌లు వాడుతున్నప్పుడు, అవి RAM, ప్రాసెసింగ్ ఎనర్జీ వినియోగించుకుంటాయి. దీని వల్ల ఫోన్ స్లో అవుతుంది. అలాగే, కొత్త యాప్ లు, అప్‌డేట్‌ ల అందుకోవడంలో సాఫ్ట్ వేర్ ఇబ్బంది పడవచ్చు. మరొక ప్రధాన కారణం స్టోరేజీ సరిపోకపోవడం. మీ ఫోన్ దాదాపుగా ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారంతో నిండిపోయిప్పుడు.. సిస్టమ్ పనిచేయడాన్ని ప్రభావితం చేస్తుంది. కాష్ డేటా, వాడని యాప్‌లు, భారీ మీడియా ఫైల్‌లు ఫోన్ స్టక్ అవ్వడానికి ప్రధాన కారణాలు.

లాగింగ్ కు సాధారణ కారణాలు

  • ఎక్కువ యాప్‌ల వాడకం
  • తక్కువ స్టోరేజీ, RAM
  • పాత ఆపరేటింగ్ సిస్టమ్ లేదా యాప్‌లు
  • అధిక కాష్, జంక్ ఫైల్స్

స్మార్ట్‌ ఫోన్ లాగింగ్ నివారించడానికి 5 చిట్కాలు

  • ఫోన్ లో Cache డేటాను క్రమం తప్పకుండా క్లియర్ చేయాలి. తాత్కాలిక ఫైళ్లు కాలక్రమేణా పేరుకుపోయి, స్మార్ట్‌ఫోన్ ను నెమ్మదిచేస్తాయి. కాష్‌ను క్లియర్ చేయడం ద్వారా తక్షణమే స్పెస్ ఫ్రీ అవుతుంది.
  • వాడని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. స్టోరేజీ. RAM పై భారాన్ని తగ్గించడానికి మీరు తక్కువగా వాడే యాప్‌లను అన్ ఇన్ స్టాల్ చేయండి.
  • సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ చేయండి. మీ ఫోన్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి. ఎందుకంటే ఇది బగ్‌లను సరిచేసి ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
  • మీ ఫోన్‌ను తరచూ రీస్టార్ చేయండి. కొన్నిసార్లు రీస్టార్ట్ మెమరీని రిఫ్రెష్ చేస్తుంది. అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లను నిలివేస్తుంది.
  • బ్యాక్‌గ్రౌండ్ లో పనిచేసే యాప్‌లను క్లోజ్ చేయండి. డేటాను ఆదా చేయడానికి, ఫోన్ స్పీడ్ అవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్‌లను క్లోజ్ చేయండి.
Advertisement

Also Read: మీ ఫోన్‌నే రిమోట్‌ కంట్రోల్‌గా మార్చుకోండిలా.. ఈ యాప్ ఉంటే చాలు!

ఫోన్‌ ఎప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి?

ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయినా… స్మార్ట్‌ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుంటే, దానికి కారణం హార్డ్‌వేర్ కావచ్చు. ఒక ఫోన్ 3-4 సంవత్సరాలు కంటిన్యూస్ వాడుతున్నప్పుడు, లేటెస్ట్ యాప్‌లు, అప్‌డేట్‌లతో స్టోరేజీ పెరుగుతుంది. అలాంటప్పుడు కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడమే ఉత్తమ పరిష్కారం కావచ్చు. స్మార్ట్‌ఫోన్ లాగ్ అనేది చాలా మంది వినియోగదారులకు ఒక సాధారణ సమస్య. స్టోరేజీను సక్రమంగా నిర్వహించడం, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం, యాప్‌లను తెలివిగా వాడుకోవడంతో లాగింగ్ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×