E-Paper
Advertisement

Kissik Talks: ప్రభాస్ పై సంజన ఊహించని కామెంట్స్.. అలాంటి రోజు వస్తుందా?

Kissik Talks: ప్రభాస్ పై సంజన ఊహించని కామెంట్స్.. అలాంటి రోజు వస్తుందా?
Advertisement

Kissik Talks:ప్రముఖ సినీనటి సంజన ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో దాదాపు మూడున్నర నెలలపాటు కంటెస్టెంట్ గా కొనసాగి అందరిని అబ్బురపరిచింది. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇందులో ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంది. అందులో భాగంగానే తాను నటించిన ‘బుజ్జిగాడు’ సినిమా గురించి, అందులో ప్రభాస్ క్యారెక్టర్ గురించి, ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడి అందరిని మెస్మరైజ్ చేసింది . ముఖ్యంగా సంజన ప్రభాస్ గురించి చేసిన కామెంట్లకు ప్రభాస్ అభిమానులు భూమి మీద ఆగడం లేదు అనడంలో సందేహం లేదు.

ప్రభాస్ పై సంజన కామెంట్స్..

ఇంటర్వ్యూలో భాగంగా వర్ష బావ గారు ఎలా ఉన్నారు? మీ ప్రభాస్ అని ప్రశ్నించగా.. “ఆయన చాలా బాగున్నారు బాహుబలి తర్వాత మరింత ఎత్తుకు ఎదిగిపోయారు. ప్రభాస్ ని చూస్తే ఏ అమ్మాయి అయినా సరే అలాగే చూస్తూ ఉండిపోతుంది. చాలా అందంగా ఉంటాడు.. మంచి పొడవు.. గుడ్ లుకింగ్” అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. “ప్రభాస్ అందగాడే కాదు అంతకుమించిన గొప్ప సహాయం కూడా చేస్తాడు. మంచి హ్యూమన్ బీయింగ్. తన జిమ్ ట్రైనర్ కి రేంజ్ రోవర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది కానీ గుండెల్లో అందరికీ సహాయం చేయాలనే మంచి గుణం ఉండాలి. ముఖ్యంగా ప్రభాస్ ది అన్ కండీషనల్ లవ్. ఆయన చాలా మంచి వ్యక్తి. ముఖ్యంగా తెలిసి మనకు కొన్నే ఉంటాయి.. తెలియనివి ఎన్నో ఉంటాయి .. ఆయన ఎంతోమందికి తెలియకుండానే సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాదు చాలా కష్టపడే నేచర్ కూడా.. ఇక భవిష్యత్తులో మరింత సక్సెస్ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ప్రభాస్ గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది సంజన.

Advertisement

also read:Kissik Talks: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ – సంజన ఎమోషనల్!

స్పిరిట్ మూవీ కోసం వెయిటింగ్..

నెక్స్ట్ ప్రభాస్ స్పిరిట్ మూవీ వస్తోంది.. మీరు ఎదురు చూస్తున్నారా? అని సంజనను వర్ష అడగగా..” అందరి స్పిరిట్ స్పిరిట్ లోనే ఉంది” అంటూ తెలిపింది. “ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి.. ఫ్రైడే నైట్ ప్రీమియర్ కి వెళ్లి పెద్ద పాప్ కార్న్ తీసుకొని రిక్లైనర్ సీట్లో కూర్చొని ప్రభాస్ సినిమా చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే సంజన ప్రభాస్ గురించి, ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం తాను ఎదురు చూస్తున్న తీరు గురించి చెప్పి అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఇక ప్రభాస్ తో టచ్ లో ఉన్నారా అని వర్ష అడగగా.. నేను ఎవరితో కూడా టచ్ లో లేను. ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవరితో నేను టచ్ లో లేను. ఒక ఇమ్మానుయేల్ మాత్రమే నాకు బాగా పరిచయం. నా పని అయిపోయింది.. అక్కడి నుంచి నేను వచ్చేసాను.. ఇంకా అంతే.. ఎవరితోనూ నేను పెద్దగా టచ్ లో ఉండను అంటూ సంజన తెలిపింది.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×