E-Paper
Advertisement

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..  కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే
Advertisement

Vijay Oath Ceremony: తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్‌గాంధీ హాజరయ్యారు. అన్నట్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నటి త్రిష కూడా హాజరయ్యారు.

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం

Advertisement

తమిళనాడులో దాదాపు ఆరు దశాబ్దాల తొలి డీఎంకే, ఏఐఏడీఎంకేయేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు.  విజయ్ చేత గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తోపాటు ఆయన మంత్రివర్గంలోని 9 మంది ప్రమాణ స్వీకారం చేశారు.  అందులో ఏడుగురు టీవీకేకి చెందినవారు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది.

వారిలో ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులుగా సెంగోట్టయ్యన్(ప్రజా పనుల శాఖ), ఆనంద్ (పురపాలక పరిపాలన శాఖ), నిర్మల్‌కుమార్ (విద్యుత్ శాఖ), ఆదావ్ అర్జున (క్రీడలు మరియు మద్యపాన నిషేధ శాఖ), రాజ్‌మోహన్ (ఆది ద్రావిడ సంక్షేమ శాఖ), ముస్తఫా( మైనారిటీ సంక్షేమ శాఖ), అరుణ్‌రాజ్( రిజిస్ట్రేషన్ మరియు వాణిజ్య పన్నుల శాఖ), వెంకట్ రమణన్ (పాఠశాల విద్యా శాఖ) ఉన్నారు.

Advertisement

విజయ్ కేబినెట్‌లో సీనియర్ నాయకుడు కేఏ సెంగోట్టయ్యన్.. దశాబ్దాలుగా మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితలతో కలిసి పని చేశారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. ఆ తర్వాత సెంగోట్టయ్యన్‌ను ఏఐఏడీఎంకే నుండి బహిష్కరించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తన పరిపాలనా అనుభవాన్ని, రాజకీయ బలాన్ని చేకూర్చేందుకు విజయ్ చేస్తున్న ప్రయత్నంగా ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకున్నారు.

కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే

విజయ్‌కి టీవీకే పార్టీకి వ్యూహకర్తలలో ఒకరు ఆదవ్ అర్జున. పార్టీలో కీలకంగా వ్యవహరించే ఆయనను కేబినెట్‌లోకి తీసుకున్నారు విజయ్. అర్జున చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుండి గెలుపొందారు. టీవీకే సంస్థాగత ప్రణాళికలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాదు లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ అల్లుడు కూడా.

విజయ్ కేబినెట్‌లో మరొక వ్యక్తి నిర్మల్ కుమార్. మదురైలోని తిరుపరంకుండ్రం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ మాజీ నాయకుడు నిర్మల్ కుమార్ రాజకీయ శిబిరాలను మార్చారు. దక్షిణ తమిళనాడులో టీవీకేకి కీలకమైన నేతల్లో ఆయన ఎదిగారు.

టీవీకే పార్టీకి బలమైన క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌కు పేరుగాంచిన ప్రధాన కార్యదర్శి ఆనంద్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.

ALSO READ: అన్నాడీఎంకెలో సంక్షోభం.. నేతల తిరుగుబాటు  

ప్రమాణ స్వీకారం చేయనున్న ఇతర మంత్రుల్లో రాజ్ మోహన్ ఒకరు. తన వాక్చాతుర్యానికి పేరుగాంచిన టెలివిజన్, నటుడు కూడా. కారైకుడి నుంచి విజయం సాధించిన డాక్టర్ టి.కె. ప్రభు  కూడా ఉన్నారు.  వీరితోపాటు మరో ముగ్గురు కేబినెట్‌లోకి చేరారు. ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదిలి టీవీకేలో చేరిన డాక్టర్ అరుణ్ రాజ్, తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రివర్గంలోకి వచ్చారు.

చెన్నైలోని మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా వెంకటరమణన్‌ను గెలుపొందారు. విజయ్ ప్రభుత్వంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకుడిగా చెబుతున్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నుంచి గెలుపొందిన కీర్తన, విజయ్ కేబినెట్‌లోకి వచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత చిన్న వయస్సు గల మంత్రిగా నిలిచారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×