E-Paper
Advertisement

Podarillu Sailaja : ‘పొదరిల్లు’ సీరియల్ నుంచి శైలజ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

Podarillu Sailaja : ‘పొదరిల్లు’ సీరియల్ నుంచి శైలజ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?
Advertisement

Podarillu Sailaja : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గత ఏడాది చివరి నెలలో ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ గురించి ప్రస్తుతం జనాల్లో రోజుకో వార్త వినిపిస్తుంది.. ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటుల గురించి సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందులో స్టైలిష్ శైలజ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. గత కొద్ది రోజులుగా శైలజ కనిపించకపోవడంతో ఈ వార్తలు ఊపొందుకున్నాయి.. అసలు ఆమె గురించి ఏం వార్తలు వినిపిస్తున్నాయో మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

శైలజ అవుట్..

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న పొదరిల్లు సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతూ మంచి టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకుంటుంది.. ఈమధ్య అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్లతో ఈ సీరియల్ హైలెట్గా నిలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇందులోకి కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అందులో చక్రి తమ్ముడైన కేశవ కి జోడిగా స్టైలిష్ శైలజ అనే క్యారెక్టర్ ను దించారు.. వీరిద్దరి పరిచయం కాస్త గొడవలతో ముగిసింది.. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కనిపించలేదు. చాలా రోజులుగా శైలజ పాత్ర మిస్ అయినట్లు పొదరిల్లు అభిమానులు సోషల్ మీడియా వేధికగా కామెంట్లు పెడుతున్నారు.. ఇప్పటివరకు పొదిరిల్లు టీం మాత్రం ఈ కామెంట్లకి ఎక్కడ స్పందించినట్లు కనిపించలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకు మరో అవకాశాలు రావడంతో వాటిల్లో బిజీగా ఉందని ఇండస్ట్రీలో టాక్.. మరి నిజంగానే ఈ సీరియల్ నుంచి ఆమె క్యారక్టర్ ను తొలగించారా? లేదంటే గ్యాప్ ఇచ్చారా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :అల్లు అర్జున్ గురించి ఇన్నేళ్లకు బయటపడ్డ నిజం.. ఇది అస్సలు ఊహించలేదు పుష్ప..

పొదరిల్లు స్టోరీ విషయానికొస్తే.. 

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.. మహాలక్ష్మి సర్టిఫికెట్ల కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మొత్తానికి చక్రీ వల్ల సర్టిఫికెట్లను సొంతం చేసుకుంది.. గాయత్రి పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తవారింటికి వెళ్ళిపోయింది. అయితే మహాలక్ష్మికి ఇంటర్వ్యూ ఉందని మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. హారిక మహాలక్ష్మి ఇంటికి వచ్చి తనని బయటికి పంపించమని చక్రితో చెప్తుంది. మహా ఎలాంటి ఇంట్లో పెరిగింది ఇప్పుడు ఎలా ఉంటుంది. ఈ ఇంట్లో నువ్వు మహాలక్ష్మి ఉంచడం కరెక్ట్ కాదు మీ ఇద్దరికీ జరిగిన పెళ్లి నిజమైన పెళ్లి కాదు.. నాకు అన్ని విషయాలు తెలుసు మహాలక్ష్మిని మా ఫ్రెండ్ ఇంటికి పంపించు అని చక్రితో చెప్తుంది.. మరి చక్రి మహాలక్ష్మిని వదిలేస్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరి మహాలక్ష్మికి ఉద్యోగం రాగానే చక్రి వాళ్ళ ఇంటిని వదిలేసి వెళుతుందా..? లేదంటే అక్కడే ఉంటుందా అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×