E-Paper
Advertisement

నూకరాజు పై రెచ్చిపోయిన రాకింగ్ రాకేష్.. ఏమైందంటే?

నూకరాజు పై రెచ్చిపోయిన రాకింగ్ రాకేష్.. ఏమైందంటే?
Advertisement

Rocking Rakesh: బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న ‘కుకు విత్ జాతిరత్నాలు’ షో ముగింపు దశకు చేరుకుంది. వచ్చే వారం ఫినాలే రౌండ్‌కు వెళ్లే టాప్ 6 కుక్స్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొనగా, అంతకంటే ముందే డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. రాబోయే ఎపిసోడ్‌ను ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌గా డిజైన్ చేశారు. కంటెస్టెంట్లు, జాతిరత్నాల స్నేహితులు షోకి వచ్చి చేసిన రచ్చ, కామెడీ హంగామాకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ప్రోమో హంగామా:

ఈ వీకెండ్ ఎపిసోడ్ కోసం మేకర్స్ విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ఫ్రెండ్‌షిప్ డే కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఈ స్పెషల్ షోకి కుక్స్, జాతిరత్నాల క్లోజ్ ఫ్రెండ్స్ గెస్టులుగా వచ్చారు. పొదరిల్లు మహా కోసం చక్రి రాగా.. అన్షు, ఈషా, దివ్య, నీతూ నటరాజ్ వంటి వారంతా సందడి చేశారు. రాకింగ్ రాకేష్ కోసం అతని బెస్ట్ ఫ్రెండ్ పంచ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి ప్రోమోలోనే ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు.

వచ్చిన వెంటనే పరువు తీసేసిన ప్రసాద్:

Advertisement

స్టేజ్ మీదకి వచ్చీ రాగానే పంచ్ ప్రసాద్ తన మార్క్ పంచ్‌లతో రాకింగ్ రాకేష్, నూకరాజుల పరువు తీసేశారు. రాకేష్, నూకరాజుల కామెడీ టైమింగ్‌పై ప్రసాద్ వేసిన జోకులకు సెట్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత ప్రసాద్ ఒక ఫన్నీ స్టోరీ చెప్తుండగా, దానికి నూకరాజు, అవినాష్, సుహాసిని, రోహిణి తమ యాక్టింగ్‌తో క్యారెక్టర్లలో లీనమై మరింత వినోదాన్ని పంచారు.

ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేంత స్నేహం:

కథ చెప్తూ “వీళ్లిద్దరూ ఎంత ప్రాణ స్నేహితులంటే.. ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేంత!” అంటూ ప్రసాద్ చెప్పిన డైలాగ్ షోకే హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ .. తాను చెప్పిన పని వినలేదంటూ నూకరాజు పై ఒక రేంజ్ లో బండబూతులు తిడుతూ రెచ్చిపోయాడు. అయితే ఇదంతా మొదట షాకింగ్ అనిపించిన ఆ తర్వాత ఇదంతా ఫన్నీ గొడవ అని తెలిసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అలా మొత్తనికైతే ఫన్నీ గొడవలు, సరదా కామెంట్లు షో వాతావరణాన్ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేశాయి. రాకేష్ నూకరాజుపై సరదాగా రెచ్చిపోతూ చేసిన రచ్చ ప్రేక్షకులకు నవ్వుల విందు అందించింది.

Advertisement

ALSO READ:హైపర్ ఆదితో విభేదాలు.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!

ముగ్గురు చేసిన వంటను.. నలుగురు రుచి చూడాలి:

ఫన్ ముగిసిన తర్వాత అందరూ కుకింగ్ టాస్క్‌లో మునిగిపోయారు. నూకరాజు, రాకేష్, ప్రసాద్ ముగ్గురూ కలిసి ఒక డిష్ తయారు చేశారు. వంటలు పూర్తయ్యాక యాంకర్ ప్రదీప్ మాంచి పంచ్ వేస్తూ “ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసిన వంటను.. ఇక్కడ ఉన్న నలుగురు జడ్జ్ ఫ్రెండ్స్ టెస్ట్ చేస్తారు” అని అనడంతో ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా ముగిసింది.

డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్:

జడ్జెస్ వంటలను టేస్ట్ చేసిన తర్వాత ఈ వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక దీంతో ఫినాలే రౌండ్‌కు వెళ్లే టాప్ 6 కుక్స్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఎపిసోడ్ శనివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది.

మొత్తానికి ‘కుకు విత్ జాతిరత్నాలు’ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ నవ్వుల పంట పండించబోతోందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. రాకింగ్ రాకేష్, పంచ్ ప్రసాద్, నూకరాజుల కాంబినేషన్ తెచ్చిన ఫన్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఫినాలేకు ముందు జరిగే ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరు ఇంటికి వెళ్తారు, ఎవరు ఫినాలే రౌండ్‌కు చేరుకుంటారో చూడాలంటే ఈ శనివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×