E-Paper
Advertisement

సినిమాలు, జూలో కాకుండా.. పులిని అడవిలో చూడాలా? ఈ ప్రాంతాలకు వెళ్లు మామ!

సినిమాలు, జూలో కాకుండా.. పులిని అడవిలో చూడాలా? ఈ ప్రాంతాలకు వెళ్లు మామ!
Advertisement

Best Tiger Reserves: సాధారణంగా మనలో చాలా మంది పులులను సినిమాల్లోనో, జూలలోనూ చూసి ఉంటారు. అదే పులులు అడవిలో రాజసంగా సంచరిస్తున్నప్పుడు చూస్తే వచ్చే థ్రిల్లే వేరు. ఒకవేళ మీరు అలా పులులను చూడాలని భావిస్తే.. దేశంలో అనేక టైగర్ రిజర్వ్ లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈసారి వన్యప్రాణి ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటే దేశంలో పక్కాగా చూడాల్సిన టాప్-5 టైగర్ రిజర్వ్ లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

బందీపూర్ టైగర్ రిజర్వ్ (కర్ణాటక)

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న బందీపూర్ ప్రాంతం.. దేశంలోని పురాతన, అత్యుత్తమ టైగర్ రిజర్వ్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం.. దాదాపు 190కి పైగా పులులకు నిలయం. ఇక్కడ సఫారీ చేస్తే.. పులులతో పాటు ఏనుగులు, అడవి కుక్కలను కూడా చూడవచ్చు.

కాన్హా నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్)

Advertisement

మధ్యప్రదేశ్‌లోని ‘కాన్హా నేషనల్ పార్క్’ అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి దట్టమైన సాల్ అడవులు, విశాలమైన గడ్డి మైదానాలు పులుల సంచారానికి ఎంతో అనువుగా ఉన్నాయి. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘ది జంగిల్ బుక్’కు ఈ అడవులే ప్రేరణ అని చెబుతుంటారు. ఇక్కడ పులులతో పాటు ‘బరాసింగా’ (జింకల జాతి) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ముదుమలై టైగర్ రిజర్వ్ (తమిళనాడు)

నీలగిరి కొండల వాలులో ఉన్న ముదుమలై ప్రాంతం.. పశ్చిమ కనుమలలో పులులకు ప్రధాన ఆవాసంగా మారిపోయింది. ఇది బందీపూర్, నాగర్‌హోల్ అడవులతో కలిసి అద్భుతమైన అభయారణ్య కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్లను చూడొచ్చు. వాటి గంభీరమైన ముఖం, కళ్లు, రాజసంతో కూడిన నడక.. పర్యాటకులను కట్టిపడేస్తుంది.

అన్నామలై టైగర్ రిజర్వ్ (తమిళనాడు)

Advertisement

తమిళనాడులోని అన్నామలై కొండల్లో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్.. పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. సుమారు 958 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవుల్లో 30కి పైగా పులులు ఉన్నట్లు అంచనా. ప్రశాంతమైన వాతావరణంలో వన్యప్రాణులను చూడాలనుకునే వారికి ఇది సరైన వేదిక.

కాళీ టైగర్ రిజర్వ్ (కర్ణాటక)

ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న కాళీ టైగర్ రిజర్వ్.. దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ఇది పులులతో పాటు చిరుతపులులు, అడవి ఏనుగులకు కూడా సురక్షితమైన ఆవాసంగా మారిపోయింది. ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్, సఫారీ చేయడానికి అద్భుతమైన ప్రదేశంగా దీనిని చెబుతుంటారు.

Also Read: కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (మహారాష్ట్ర)

మహారాష్ట్రలోని పురాతన టైగర్ రిజర్వులలో మెల్ఘాట్ ఒకటి. సాత్పురా పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ అడవి.. పులుల సంతతిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి కొండలు, లోయలు.. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామంలా ఉంటాయి.

Also Read: ఒకే ఒక్క టికెట్‌తో.. ఆటో + బస్సు జర్నీ.. ఆర్టీసీ ఈ-ఆటోలు వచ్చేస్తున్నాయ్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×