E-Paper
Advertisement

Podarillu TRP Ratings : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…

Podarillu TRP Ratings : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…
Advertisement

Podarillu TRP Ratings : తెలుగు ఆడియన్స్ కు వినోదని పంచే వాటిలో ఎక్కువగా సీరియల్స్ పేర్లు వినిపిస్తాయి. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ప్రతిరోజు తెలుగు చానల్స్ కొత్త సీరియల్స్లను ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తున్నాయి. అందులో కొన్ని చానల్స్ లలో ప్రసారమయ్యే సీరియల్స్ కు టీఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో ఉంది.. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్కు మంచి రేటింగు ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రసారమైన కొత్త సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. డిసెంబర్ 8 నుంచి ప్రారంభం అయిన ఇది మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఈ సీరియల్కు రోజురోజుకీ ప్రేక్షకాధారణ లభిస్తుంది. దాంతో ఈ సీరియల్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇకపోతే డిసెంబర్ నెలలో ఈ సీరియల్ హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం..

డిసెంబర్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్.. 

స్టార్ మా లో ప్రసారమవుతున్న తాజా సీరియల్ పొదరిల్లు.. ఇటీవలే ఈ సీరియల్ ప్రారంభమైంది.. కేవలం నెలలోపలే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదు.. మిగిలిన సీరియల్స్ లతో పోలిస్తే ఇది బాగా ఆకట్టుకుంది. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో పాటుగా మంచి టిఆర్పి రేటింగ్ కూడా సొంతం చేసుకుంటుంది.. పెళ్లి కోసం ఎదురుచూసే అన్నదమ్ములు. ఆస్తికోసం సొంత అన్న పైనే కోర్టు కేసు వేసిన చెల్లెలు.. బావ ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చూసే మరదలు.. ఒక్క ఆడదిక్కు మా ఇంటికి వస్తే మా జీవితాలు మారిపోతాయని ఎదురు చూసే ముగ్గురు అన్నదమ్ములు. తాగుబోతు తండ్రి.. డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎలాగైనా చేసే సక్సెస్ అవ్వాలని అనుకునే ఒక అమ్మాయి.. ఆ అమ్మాయి జీవితంలో అనుకోకుండా పెళ్లి వస్తే ఏం జరుగుతుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ…

Advertisement

ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి ఎపిసోడ్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది. ఎక్కడో ఉన్న అబ్బాయిని ఆ అమ్మాయితో కలిసి ఇలా చేసి చివరికి వాళ్ళ ప్రయాణాన్ని మూడుముళ్ల బంధం వరకు తీసుకెళ్లడమే ఈ సీరియల్ కదా.. ఈ నెలలో చక్రి మహాను కలవడం హైలెట్.. మాధవ్ పెళ్లి సంబంధం కోసం ఎమోషనల్ డైలాగులు.. తాను చేసుకోబోయే అమ్మాయి తను చెప్పినట్టే ఉండాలని కోరుకునే పెళ్ళికొడుకు భూషణ్.. ఇలా మొదలైన ఈ స్టోరీ మహా పెళ్లితో చక్రి నీ దగ్గర చేస్తుంది.. మొదటి చూపులోనే అమ్మాయి ప్రేమలో పడిపోయిన చక్రి ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయాలని అనుకుంటాడు.. అలా మహా ఇంట్లోకి అడుగుపెట్టిన చక్రి మహా ప్రేమను పొందేందుకు తన బాధని దూరం చేయాలని అనుకుంటాడు.. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లలో మహా పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తాడు చక్రి. కానీ మహా కి మాత్రం తన తండ్రి ప్రతాప్ ఎలాగైనా సరే పెళ్లి చేస్తాను అని కంకణం కట్టుకుంటాడు. ఇక తర్వాత మహా చక్రి మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలవుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పుడు మహా కి పెళ్లి జరుగుతుంది అంటే కచ్చితంగా చక్రితో వెళ్ళిపోతుందేమో చూడాలి. డిసెంబర్ నెలలో మహా చక్రిల మధ్య జరిగిన సీన్లు హైలెట్ గా మారాయి..

టీఆర్పీ రేటింగ్.. 

డిసెంబర్ 8 నుంచి ప్రారంభమైన ఈ కొత్త సీరియల్ పొదరిల్లు ప్రతిరోజు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్ తో సమానంగా ఈ సీరియల్కు రేటింగు నమోదు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల కాస్త రేటింగ్ తక్కువగా ఉన్నా కూడా.. మహా చక్రిలు కలిసిన తర్వాత టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగు 10.48 ఉంది. ఇక ముందు ఎపిసోడ్ లకు స్టోరీలో మార్పులు రావడం వల్ల టిఆర్పి రేటింగ్ కూడా పెరుగుతుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×