E-Paper
Advertisement

Romantic Thriller OTT : హీరోయిన్ పై పొలిటికల్ లీడర్ మోజు… హై వోల్టేజ్ షాకిచ్చే క్లైమాక్స్… జన్మలో అమ్మాయిల జోలికి వెళ్లరు

Romantic Thriller OTT : హీరోయిన్ పై పొలిటికల్ లీడర్ మోజు… హై వోల్టేజ్ షాకిచ్చే క్లైమాక్స్… జన్మలో అమ్మాయిల జోలికి వెళ్లరు
Advertisement

Romantic Thriller OTT : వీకెండ్ పార్ట్నర్ తో కలిసి ఓ మంచి రొమాంటిక్ సినిమాను చూస్తే వచ్చే కిక్కే వేరు కదూ. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే ఈ మూవీ సజెషన్ మీకోసమే. అయితే ఈ సినిమాలో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు హార్ట్ టచింగ్ స్టోరీ ఉంటుంది. లవ్ అబ్సెషన్ గా మారితే ఎలా ఉంటుంది? కోరుకున్న ప్రేమ టైమ్ కు దక్కకపోతే ఏమయ్యింది ? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉన్న మూవీ పేరేంటి? కథ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2025లో వచ్చిన హిందీ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దీవానే కీ దీవానియత్’ (Ek Deewane Ki Deewaniyat). మిలాప్ మిలన్ జవేరీ డైరెక్ట్ చేశాడు. లవ్ ఆబ్సెషన్ గా టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుందనే స్టోరీ లైన్ చుట్టూ తిరిగే ఇంటెన్స్ స్టోరీ ఇది. సుమారు 2 గంటల 20 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు OTTలో సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 26 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఫ్రీగా చూడొచ్చు. ఈ హిందీ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది.

Advertisement

మెయిన్ లీడ్‌లో హర్షవర్ధన్ రాణే (విక్రమాదిత్య భోంస్లే పాత్రలో – పవర్‌ఫుల్ పాలిటిషియన్ కొడుకు), సోనమ్ బజ్వా (ఆదా రంధావా – బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్) నటించారు. సపోర్టింగ్‌ రోల్స్ లో షాద్ రంధావా, సచిన్ ఖేడేకర్, అనంత్ నారాయణ్ మహదేవన్ లాంటి వాళ్లు ఉన్నారు. హర్షవర్ధన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, సోనమ్ బజ్వా గ్లామర్ సినిమాలో హైలైట్. మిలాప్ జవేరీ డైరెక్షన్‌లో ఎమోషన్స్, డ్రామా బాగా మిక్స్ అయ్యాయి. ‘ఏక్ దీవానే కీ దీవానియత్’ ఒక ఇంటెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్. సాధారణ లవ్ స్టోరీస్ కాదు, ఆబ్సెషన్ డార్క్ సైడ్ ను చూపిస్తుంది. హర్షవర్ధన్, సోనమ్ కెమిస్ట్రీ బాగుంది, మ్యూజిక్ సూపర్. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా… ఈ ఎమోషనల్ డ్రామా రొమాంటిక్ మూవీ లవర్స్‌కి ఖచ్చితంగా నచ్చుతుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్ థీమ్స్ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు చూస్తే బెటర్.

Read Also :  అతీంద్రియ శక్తులతో అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కొరియన్ సూపర్ హీరో సిరీస్… 8 ఎపిసోడ్లు ఒకేసారి

కథలోకి వెళ్తే…

Advertisement

స్టోరీ పవర్‌ఫుల్ పాలిటిషియన్ కొడుకు విక్రమాదిత్య భోంస్లే (హర్షవర్ధన్ రాణే) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ ఆదా రంధావా (సోనమ్ బజ్వా)ని ఫస్ట్ సైట్‌లోనే చూసి ప్రేమలో పడతాడు. మొదట రొమాంటిక్‌గా స్టార్ట్ అయినా, అతని ప్రేమ క్రమంగా డేంజరస్ ఆబ్సెషన్‌గా మారుతుంది. పవర్, ఈగో, హార్ట్‌బ్రేక్ మిక్స్ అయి స్టోరీ ఇంటెన్స్ అవుతుంది. విక్రమ్ ఆదానిని పొందడానికి ఎంతవరకు వెళ్తాడు ? ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×