E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు నిజం చెప్పేసిన కన్నా.. కేశవ్ గురించి నిజం తెలుస్తుందా..? మళ్ళీ అబద్దం చెప్పిన చక్రీ..

Podarillu Today Episode : మహాకు నిజం చెప్పేసిన కన్నా.. కేశవ్ గురించి నిజం తెలుస్తుందా..? మళ్ళీ అబద్దం చెప్పిన చక్రీ..
Advertisement

Podarillu Today Episode March 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కన్నా కేశవ ఇద్దరు ఇంటికి వస్తారు.. నా ఇంట్లోకి రాగానే వదినెక్కడ అని అడుగుతాడు. మాధవ్ వచ్చి రాతలకే వదినని ఎందుకు అడుగుతున్నావ్ రా అని అంటాడు. నీకెవరు చెప్పారు అంటే కేశవ చెప్పాడు అని అంటాడు. ఇక చక్రి మహా ఇద్దరు బ్యాగుతో వెళ్లారు అని చెప్పగానే మాధవ్ కన్నాకి ఎలా నిజం చెప్పాలి అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఎక్కడికి మహాచక్రి ఇద్దరూ వచ్చేస్తారు.. కన్నా ఎక్కడికి వెళ్లావు వదిన అని ఎంతగా అడుగుతున్నా సరే మహా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది.. మాధవ్ మహా ఇద్దరు కూడా ఎవరో శత్రువులు ఇల్లు రాకుండా చేశారేమో అని అనుమానపడతారు..

మాధవ్మా త్రం చక్రి మీద అనుమానం ఉంటుంది. ఇకపోతే చక్రి ఎలాగోలాగా మాధవ్నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. పెద్ది నాకు చాలా ఇబ్బందిగా ఉంది పెద్ది అని మహా అడుగుతుంది. ఎందుకమ్మా ఇది నీ ఇల్లు అని ఫీల్ అవ్వమని చెప్పాను కదా.. నీకు ఎన్ని రోజులు కాపోతే అన్ని రోజులు ఇక్కడే ఉండమ్మా మా ఇంటి ఆడబిడ్డగా నేను చూసుకుంటాను అని మాధవ్ అంటాడు. నాకు అందులో భయం లేదు పెద్ది నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీరు నిజం చెప్తారా అని అంటాడు.. మీ నాన్న నిజంగానే మీ అమ్మని హత్య చేసి జైలుకు వెళ్లడా అని మహాలక్ష్మి అడుగుతుంది. అది నిజమని చెప్పలేను అబద్ధమని చెప్పలేను. కానీ మా నాన్న మాత్రం అలా చేసి ఉండడని నా నమ్మకం.. మా నాన్న అలాంటి వాడు కాదు అని మహాతో మాధవ్ అంటాడు.. శైలు మాత్రం తన ఫోన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాత్రి అందరూ ఒకే చోటు పడుకోవడం చూసిన నారాయణ చక్రి బయట పడుకోవడం చూసి ఏంట్రా ఇక్కడ పడుకున్నావేంట్రా.. నీకు పెళ్లయింది కదరా ఇప్పుడు నువ్వు బయట పడుకోవడం ఏంట్రా అనేసి లోపలికి వెళ్ళు అని బలవంతంగా పంపించేస్తాడు.. ఒకవైపు మాధవ్ చెప్తున్న సరే నారాయణ మాత్రం అసలు ఒప్పుకోకుండా లోపలికి పంపిస్తాడు.. నారాయణ అలా వెళ్లగానే మాధవ్ చక్రిని బయటకు తీసుకొని వస్తాడు.. కానీ చక్రిని మళ్లీ బయటికి తీసుకురావడంతో కేశవ ఏంటి అన్నయ్య మళ్లీ బయటికి తీసుకొచ్చావు అని అంటాడు.. నాకు పెళ్లి అయ్యేంతవరకు వాళ్ళు బయట పడుకుంటామని చెప్పారు కదరా పడుకొనివు అని అంటాడు. ఉదయం లేవగానే మాధవ్ పై కేశవ సీరియస్ అవుతుంది.. కానీ మాధవ్ నిజం చెప్పలేక ఏదో ఒకటి చెప్పి కేశవ అని మేనేజ్ చేస్తాడు.

బయట చదువుకుంటున్న కన్న దగ్గరికి మహాలక్ష్మి వస్తుంది.. ఏంట్రా ఎగ్జామ్స్ ఉన్నాయా ఏంటి అంతగా చదువుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. సప్లి ఎగ్జాం ఉంది వదిన అని చెప్పగానే మహా షాక్ అవుతుంది. అయితే నువ్వు సప్లి రాయడమేంట్రా అని మహాలక్ష్మి డౌట్ గా అడుగుతుంది.. నువ్వు క్లాస్ టాపరు కదా గోల్డ్ మెడలిస్ట్ వి.. మరి సప్లి రాయడమేంటి అసలు ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావ్ నువ్వు క్లాస్ టాపరే కదా.. నేను కనీసం కాలేజీలో పాస్ కూడా అవలేదు టాపర్ అని ఎవరు చెప్పారు నీకు అని అనగానే మీ అన్నయ్య చక్రి చెప్పాడు అని మహా అంటుంది..

Advertisement

చక్రి అన్నయ్య చెప్తే నువ్వు నమ్మావా? ఏం మాట్లాడుతున్నావ్ వదినా నువ్వు అని మహాను అడుగుతాడు కన్నా.. అయితే మహా చక్రి చెప్పేది అబద్ధాలే అని తెలుసు కానీ.. మరి ఇది కూడా అబద్ధం చెప్పాడా నిన్ను ఫారిన్ పంపించాలని అనుకున్నారని కూడా చెప్పాడు అని అనగానే.. మా అన్నయ్య చెప్పేది నువ్వు నమ్ముతావా? వినాలి గాని చెవులు తూట్లు పడేలా అబద్ధాలు చెప్తాడు అని కన్నా అంటాడు.. ఇక మరి కేశవ గురించి ఏదో చెప్పాడు అతను ఏం చేస్తాడు అతను ఏం చదివాడు అని మహా ఆరా తీస్తుంది. కేశవ్ అన్న గురించి ఏం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకోండి అని కన్నా అంటాడు. కానీ మహా మాత్రం ఏదో చెప్పాడు కానీ గుర్తు రావడంలేదు అని అంటుంది. సరేగాని మీ అన్నయ్య ఏం చేస్తూ ఉంటాడు అని మహాలక్ష్మి అడుగుతుంది.

Also Read :ధీరజ్ కు ప్రేమ అడ్వైజ్.. మిల్లుకు వెళ్లిన రామరాజు.. కంగారు పడిన వల్లి..

మా అన్నయ్య ఏం చేస్తాడో చెప్పడం కాదు నీకు డైరెక్ట్ వెళ్లి చూపిస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అంటాడు.. ఏంటి రా అంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోకూడదు అని మహాను అడుగుతుంది.. ఇక కారేశ్వర్ దగ్గరికి వెళ్లిన చక్రి అతని మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తాడు.. నువ్వు చేసిన దానికి నేను జీవితంలో మర్చిపోలేను. నాకు చాలా ఇది అయిపోయింది నిన్ను ఇంకెప్పటికీ నా దగ్గర పెట్టుకొని ఎంత చెప్తున్నా సరే.. చక్రి మాత్రం అతన్ని మాటలతో మాయ చేసే ప్రయత్నం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×