// // Comedy drama OTT: నలుగురు అమ్మాయిలతో కేకలు పెట్టిస్తూ... -->
E-Paper
Advertisement

Comedy drama OTT: నలుగురు అమ్మాయిలతో కేకలు పెట్టిస్తూ… నాలుగు సీజన్లతో వచ్చిన నాటు సిరీస్

Comedy drama OTT: నలుగురు అమ్మాయిలతో కేకలు పెట్టిస్తూ… నాలుగు సీజన్లతో వచ్చిన నాటు సిరీస్
Advertisement

Comedy drama OTT : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మాత్రం మరో లెవెల్ లో ఉంటుంది. ముంబైలో ఉండే నలుగురు మహిళల చుట్టూ ఈ కథ ఉంటుంది. ప్రత్యేకించి ఈ సిరీస్ ను మహిళలు చూడడం బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో మహిళలు కష్టాలను ఎలా తట్టుకోవచ్చో, ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మొగుడు, పిల్లలు, సంప్రదాయం అని కాకుండా.. మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం అన్నట్టుగా పక్కా లోకల్ అండ్ బోల్డ్ స్టైల్‌లో ఈ సిరీస్ సాగుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ (Four More Shots Please!). ఇందులో సాయనీ గుప్తా, కీర్తి కుల్హారీ, బానీ జె మరియు మాన్వీ గగ్రూ లీడ్ రోల్స్ లో నటించారు. మొదటి సీజన్ 2019 జనవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. విడుదలైంది. మొత్తం 4 సీజన్లతో చివరి సీజన్ డిసెంబర్ 2025లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ముంబై సిటీలో నలుగురు బిందాస్ ఆడోళ్లు ఉంటారు. ఒకరు జర్నలిస్ట్ అయితే, ఇంకొకరు మొగుడితో విడిపోయిన లాయర్, మరొకరు జిమ్ ట్రైనర్, ఇంకొకరు పెళ్ళి కావట్లేదని బాధపడే రిచ్ పిల్ల. వీళ్ళందరికీ లోకం ఏమనుకున్నా పట్టింపు లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మస్తుగా తాగుతూ, ఎంజాయ్ చేస్తూ ట్రక్ బార్ లో కలుస్తుంటారు. వీళ్ళ లైఫ్ అంతా రచ్చ రచ్చే. ఈ నలుగురి లైఫ్‌లో ప్రేమాయణాలు, బ్రేకప్‌లు మామూలే. ఒకరు పెళ్ళైన వాడితో లవ్ అంటారు, ఇంకొకరు అమ్మాయిలతోనే డేటింగ్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చేసే పెళ్ళి గోల, ఆఫీసులో బాసుల టార్చర్లు తట్టుకోలేక పిచ్చెక్కిపోతుంటారు. కానీ ఎంత గొడవలు అయినా, ఎవరితో బ్రేకప్ అయినా.. చివరకు ఈ నలుగురు దోస్తులు మాత్రం ఒకరికొకరు తోడుగా నిలబడుతుంటారు.

Read Also : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×