E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన లాయర్.. మహాను వదిలేసిన చక్రీ..కానిస్టేబుల్ కు నిజం చెప్పిన చక్రీ..

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన లాయర్.. మహాను వదిలేసిన చక్రీ..కానిస్టేబుల్ కు నిజం చెప్పిన చక్రీ..
Advertisement

Podarillu Today Episode March 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సరే నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సరే.. ఎవరు అవునన్నా కాదన్నా కూడా మీ ఇద్దరికీ ఇప్పుడు అధికారికంగా పెళ్లయిపోయినట్లే.. అరే సర్టిఫికెట్ కూడా వచ్చింది కాబట్టి మీరిద్దరూ అఫీషియల్ గా భార్య భర్తలు.. మీకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే వెంటనే విడాకులు తీసుకో అని హారిక అంటుంది. అప్పుడు నువ్వు ఆ ఇంట్లోంచి వెళ్లిన ఎవరూ ఏమీ అనుకోరు అని హారిక చెప్పడంతో మహాలక్ష్మి దాని గురించి ఆలోచిస్తుంది.

చక్రి మాత్రం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. హారిక మా పిన్ని కొడుకు పెళ్లి ఉంటే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్ ను కలవడానికి అని చెప్పేసి బయటకు వచ్చాను. నేను వెళ్ళాలి మహా లేకపోతే మీ అన్నయ్యకి డౌట్ వస్తుంది అని హారిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చక్రి ని బయటికి వెళ్దామని చెప్పిన మహాలక్ష్మి. చక్రికి బయటకు వెళ్లిన తర్వాత విడాకుల గురించి చెప్పి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. ఎలాగైనా సరే మన విడాకులు తీసుకొని విడిపోదామని మహాలక్ష్మి అంటుంది కానీ చక్రి మాత్రం ఇష్టం లేకపోయినా ఓకే అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయరు టైం పడుతుంది కాస్త వెయిట్ చేయండి అని చెప్పగానే చక్రి ఇది ఆగిపోతే బాగుండు.. దేవుడు మా ఇద్దరిని కలపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుండు అని చక్రి అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా సరే విడాకులు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది.. లాయర్ ఇంకా పిలవలేదు ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి.. ఈ విషయం ఎలాగైనా సరే ఒకసారి హారికకు చెప్పాలని ఫోన్ చేస్తుంది. హారిక కు లాయర్ దగ్గరకు వచ్చిన విషయాన్ని చెప్తుంది. లాయర్ ఏమన్నారు విరాకుల్ కి అప్లై చేస్తామన్నారా లేదా అని హారిక అడుగుతుంది. ఇంకా లాయర్ ని కలవలేదు వదిన ఆయన ఏం చెప్తారో చూడాలి అని మహా అంటుంది.

ఏది ఏమైనా సరే నువ్వు విడాకులు తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటావు ఎంత వీలైనంత త్వరగా నువ్వు విడాకులు తీసుకోవడానికి ప్రయత్నించు అని హారిక అంటుంది. ఇక లాయర్ గారు పిలవడంతో మహాచక్రియ ఆయన దగ్గరికి వెళ్తారు. మాకు విడాకులు కావాలండి మేము మ్యూచువల్గా విడిపోవాలని అనుకుంటున్నామని అంటారు. అదేంటి ఆయన మాట్లాడడా అని లాయర్ ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు నేను అదే చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది. అయితే చక్రి మౌనంగా ఉండడంతో లాయరు ఏంటమ్మా మీ సమస్య ఎందుకు ఆయనని భర్తగా కూడా ఒప్పుకోవడం లేదు అని అంటాడు. అయితే మీకు పెళ్లి అయ్యి ఎన్ని నెలలు అవుతుంది అని అడుగుతాడు. కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది అని మహాలక్ష్మి చెప్పగానే ఏంటి రెండు నెలలకే విడాకుల ఏమైంది అని అడుగుతారు. మా ఇద్దరి మైండ్ సెట్ కలవడం లేదు. ఇద్దరం కలిసి దూరంగా ఉండాలని అనుకుంటున్నాము.

Advertisement

మ్యూచువల్ గా విడాకులు తీసుకోవాలని వచ్చాము అని మహాలక్ష్మి చెపుతున్న సరే లాయర్ మాత్రం అవన్నీ కుదరవు పెళ్లయి ఒక ఏడాది తర్వాతే మీరు విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అని అంటారు.. అయితే మీది ఆధార్ కార్డు ఇవ్వండి అని లాయర్ అడుగుతాడు. చక్రి మాత్రం చక్రం అడ్డు వేయమన్నాను ఆధార్ కార్డు అడ్డు పెట్టేవా అని మనసులో చాలా సంతోష పడిపోతూ ఉంటాడు. ఆధార్ కార్డు కూడా లేకుండా పోలీసులు మీ పెళ్లి ఎలా చేశారు నాకు అర్థం కావడం లేదు ఈ కేసును అయితే నేను టేక్ ఆఫ్ చేయను అని లాయర్ కచ్చితంగా చెప్పేస్తాడు. ఆ తర్వాత బయటికి వెళ్లగానే ఆధార్ కార్డు లేకుండా పోలీసులు పెళ్లి ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.

Also Read : శ్రీయకు పల్లవి పై అనుమానం.. చక్రధర్ కు అవని వార్నింగ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

అయితే చక్రి మాత్రం ఈ లాయరు అన్న మాటలు తలుచుకొని ఫుల్ హ్యాపీగా ఉంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి ఎంతగా చెప్తున్నా సరే విడాకులు కావాల్సిందే అని చెప్పడంతో చక్రి నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్ళిపోతాను అని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే చక్రి కానిస్టేబుల్ కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తాడు. మా ఇద్దరినీ వాళ్ళ పేరెంట్స్ విడగొట్టాలని చూస్తున్నారు మీరే దగ్గర ఉండి దేవుడు లాగా కలపాలి అని చెప్తాడు. ఇక నాకు వదిలేసేయ్ నేను చూసుకుంటాను అని అతను చెప్పి వెళ్ళిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో కానిస్టేబుల్ ఫోన్ చేసిన విషయాన్ని మహా చక్రితో చెప్తుంది ఆ విషయాన్ని కేశవా వింటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×