E-Paper
Advertisement

Trump on Iran War: త్వరలో ఇరాన్‌ యుద్ధం ఎండ్.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు, సహకరించని మిత్రులు

Trump on Iran War: త్వరలో ఇరాన్‌ యుద్ధం ఎండ్.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు, సహకరించని మిత్రులు
Advertisement

Trump on Iran War: ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగింపుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధం ముగిసిన తర్వాత చాలా సురక్షితమైన ప్రపంచం ఉంటుందన్నారు. తక్షణ ముగింపును తాను ఆశించడం లేదని, కానీ త్వరలో జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో ఇరాన్‌ యుద్ధం ఎండ్-ట్రంప్

Advertisement

ఇరాన్‌లోని దాదాపు 7 వేలకు లక్ష్యాలపై దాడులు చేశామన్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఆర్థిక, సైనిక స్థావరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అంతేకా క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేశామన్నారు. వారం వ్యవధిలో వందకుపైగా ఇరాన్‌ నౌకలు డ్యామేజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇరాన్‌ నేవీ, ఎయిర్ విభాగాలు దాదాపుగా అంతం అయ్యాయని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

ప్రపంచానికి ఇరాన్ నాలుగు దశాబ్దాలుగా పెను ముప్పుగా మారిందన్నారు. ఇజ్రాయెల్‌ సాయంతో ఇరాన్‌ ముప్పును అంతం చేశామని, అయితే యుద్ధం ఇంకా ముగియ లేదన్నారు. ఇరాన్ మళ్లీ కోలుకోవాలంటే దశాబ్దం పడుతుందన్నారు. ఇరాన్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైనట్లు తనకు అనిపిస్తోందన్నారు ట్రంప్.

Advertisement

మిత్రులు సహకరించకపోవడంపై ఆగ్రహం

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశం నుంచి మాట్లాడానికి ఎవరు ఉన్నారో తెలియ లేదన్నారు. ఆ దేశ నేతలెవరో మాకు తెలియదని, మొజ్తాబా ఖమేనీ బతికి ఉన్నారో లేదో స్పష్టంగా చెప్పలేదన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిదన్నారు. ఒకానొక దశలో ఇరాన్‌ దాడులు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. నిఘా వర్గాలు సైతం ఈ దాడులను ఊహించలేదన్నారు.

హార్మూజ్‌ జలసంధిని తెరవడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మిత్రుల సహాయం కోరింది. అందుకు అన్నిదేశాలు తిరస్కరించాయి. ఈ విషయంలో మిత్రదేశాలు సహాయం చేయడంలో విఫలమైతే నాటో కూటమి భవిష్యత్తు దారుణంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. జలసంధి వద్దకు తమ యుద్ధనౌకలను పంపేందుకు బ్రిటన్‌, జర్మనీ, బెల్జియం, స్పెయిన్‌, డెన్మార్క్‌ , ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు ససేమిరా అన్నాయి.

ALSO READ: మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు.. ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి, ఆలస్యంగా ఫుటేజ్

ఈ విషయంలో చైనా జాగ్రత్తగా వ్యవహరించింది. ఉద్రిక్తతలు పెరగకుండా ఉండాలంటే ఇరుపక్షాలు సైనిక చర్యను తక్షణమే నిలిపి వేయాలని సూచన చేసింది. హోర్ముజ్‌ను కొంతకాలం ఇరాన్ మూసి ఉంచితే ఖార్గ్‌ ద్వీపం స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ అడుగులు వేయవచ్చంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్‌ ఆ పని చేస్తే చుట్టుపక్కల గల్ఫ్‌ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్‌ దాడులు చేసే అవకాశం ఉంది. ఫలితంగా పరిస్థితి మరింత జఠిలమవుతుందని రాసుకొచ్చాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×