E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని దారుణంగా తిట్టిన మాధవ్..కేశవతో శైలు ట్రాక్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Podarillu Today Episode : చక్రీని దారుణంగా తిట్టిన మాధవ్..కేశవతో శైలు ట్రాక్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..
Advertisement

Podarillu Today Episode June 25th : మహా దగ్గరకు వెళ్లిన నారాయణ నేను ఎక్కువగా కాలుస్తున్నాను.. నువ్వు లేవు కదా ఊడ్చి వాళ్ళు కూడా లేరు అని అంటారు.. నన్ను తిట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు కదా అందుకే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని నారాయణ అంటాడు.. ఆ కొంపలోని నలుగురు అన్నదమ్ములు చాలా బాధపడిపోతున్నారు.. ఆ సంతోషాన్ని మిగిల్చావు. ఇప్పుడు నువ్వు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో సంతోషం కూడా పూర్తిగా పోయింది అని మహాలక్ష్మికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటాడు.. మీరందరూ ఒకే రక్తం కదా మీ బుద్ధి ఎలా ఉంటుందో మార్చలేము అని అంటారు. నిజానికి చక్రి ఎలా రావడానికి కారణం నేనే అని నారాయణ నిజం చెప్పడంతో మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. మొత్తానికి నారాయణ మీద కోపంతో ఉంటుంది మహాలక్ష్మి.. మళ్లీ ఆ ఇంట్లో ఆడ దిక్కులేని పాడిపడ్డ కొంపలాగా మారిపోతుంది..

మాధవ్ దెబ్బకు చక్రీ కన్నీళ్లు..

కన్నా కాలేజీకి వెళ్తుంటే చక్రి నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. నీ బండి ఇవ్వరా నేను ఒకసారి పని తీసుకుని వెళ్లి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వస్తానని చక్రి అంటాడు. కానీ చక్రికి కన్నా దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. ఎందుకు నన్ను కూడా బండిమీద తీసుకుని వెళ్లి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా..? అయితే నాకు నువ్వేమీ దిగబెట్టాల్సిన అవసరం లేదు.. ఒకవేళ నువ్వు కూడా నన్ను బండిమీద ఎక్కించుకొని వెళ్లి మధ్యలో ఎక్కడైనా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని కన్నా కోపంగా మాట్లాడుతాడు.. కన్నా అలా మాట్లాడటం విన్న మాధవ్ మీరు మృగాల ఏంటి వాడితే ఎందుకు మాట్లాడుతున్నారు అని మాధవ్ అరుస్తాడు. ఏంటి అన్నయ్య నువ్వు కూడా ఇలా మాట్లాడతావా నేను తప్పేమీ చేయలేదు అన్నయ్య.. నేను ఏమి చేయలేదు అని తనకు తానే సమర్ధించుకుంటూ మాట్లాడుతాడు. అయితే నేను ఎంత నమ్మకంగా మిమ్మల్ని పెంచాను ఎంతో గొప్పగా అన్ని బుద్ధులు నేర్పిస్తూ పెంచాను.. కానీ నువ్వు ఇలా మృగంలాగా మరి ఒక అమ్మాయిని భయపెడతావా..? అసలు అమ్మాయి ఎంత భయపడి పోయిందో నీకు తెలుసా..? ఇప్పుడు అమ్మాయి పోగొట్టుకున్న ఒక నమ్మకం మళ్ళీ తిరిగి వస్తుందా అని మాధవ్ చక్రికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతాడు..

కన్నీళ్లు పెట్టుకున్న చక్రీ..

Advertisement

మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు.. ఒక అమ్మాయి ఇక్కడికి వస్తే తనని ఎంతో గొప్పగా చూసుకోవాలి.. మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని మనం అండగా చూసుకోవాల్సింది పోయి ఇలా మృగంలాగా ప్రవర్తిస్తావా.. నీ మీద ఉన్న నమ్మకం కూడా పూర్తిగా పోయింది.. అమ్మాయికి ఏ మగాడిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు.. మహాలక్ష్మి చాలా తెలివైనది ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు.. నీలాంటి వాడి దగ్గరికి మళ్లీ వస్తుంది అని నేను అనుకోవడం లేదు అని మాధవ్ సీరియస్గా చక్రిపై అరుస్తాడు. ఇక అందరూ వెళ్ళిపోతారు.. చక్రి మాత్రం నేనొక్కడినే తప్పు చేశానా నేను ఏమన్నా మర్డర్ చేసేనా నన్ను ఎందుకు మీరందరూ దూరం పెడుతున్నారు.. ఉద్యోగం లేదు లైసెన్స్ లేదు ఇప్పుడు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు..

కేశవ కోసం శైలు ప్లాన్..

కేశవ అసిస్టెంట్ అయిన చింటూ దగ్గరికి శైలు వస్తుంది.. నేను ఎంతగా బాధపడినా ఏడ్చినా కూడా ఆ బండోడు మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు.. నాకు చాలా బాధగా ఉంది పార్టనర్.. తను నన్ను అలా దూరం పెడుతున్నాడు అంటే నాకు ఏదోలా ఉంది అని బాధపడిపోతుంది. మీ ఇద్దరి మధ్య గొడవ సాల్వ్ అయిపోయింది కదా ఇక మీరెందుకు బాధపడతారు అన్న బ్రో పట్టించుకోకపోయినా మీరు వదిలేయాలి అని అనగానే.. లేదు నేను ఒక ప్లాన్ చెప్తాను అలా చేస్తే మీ అన్న బ్రో. నాకు చుట్టూ తిరుగుతాడు వాడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు.. వాడితో ఎలాగైనా సరే ఆ విషయాన్ని బయట పెట్టించాలి అని శైలు అదిరిపోయే ప్లాన్ చేస్తుంది..

మహా కోసం వెళ్లిన చక్రి..

Advertisement

మహాలక్ష్మి కోసం చక్రి తన ఆఫీసు దగ్గరికి వెళ్తాడు.. అతని చూసిన దివ్య బయటకొచ్చి ఎవరు కావాలి మీరు ఇలా గొడవ చేస్తే మహాలక్ష్మిని కూడా అందరూ తిడతారు అని చెప్తుంది.. నేను మహాలక్ష్మి గారితో కాస్త మాట్లాడాలి తనని ఒకసారి బయటికి రమ్మని చెప్తారని చక్రి అడుగుతాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి మళ్ళీ వస్తే ఏం గొడవ చేస్తాడు అని బయటికి వచ్చి చక్రితో మాట్లాడుతుంది.. ఇది నేను పని చేసే ఆఫీస్ ఇక్కడికి మీరు వస్తే నన్ను కూడా తప్పుగా అనుకుంటారు.. మీరు చేసిన పనికి నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను అని మహాలక్ష్మి బాధ పడిపోతుంది.. చేసుకున్న అబద్ధపు పెళ్లిని మీరు అడ్డుపెట్టుకొని ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు.. ఇంకెప్పుడు నా ఆఫీస్ దగ్గరికి మీరు రావద్దు అని వార్నింగ్ ఇస్తుంది..

కేశవ దెబ్బకు నారాయణ షాక్..

శైలుకి పెళ్లిచూపులు జరిగాయి పెళ్లవుతుంది అని చెప్పగానే కేశవ ఫీల్ అయిపోతాడు. ఆ మాట వినగానే కేశవ చాలా బాధపడిపోతాడు.. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరమైపోతుంది అని కంగారు పడిపోతుంటాడు.. ఇంటికి వచ్చి తను తన గర్ల్ ఫ్రెండ్ దూరమవుతుందన్న కోపాన్ని నారాయణ మీద చూపిస్తాడు.. ఇంటికి రాగానే మాధవ దోశలు వేసుకు కనిపిస్తాడు.. కేశవ ని తింటావా అని అడిగితే ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. చ క్రీ ఎక్కడున్నాడో ఫోన్ చేయమని చెప్తే వాడికి చేయాల్సిన అవసరం నాకు లేదు అని అరుస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన నారాయణను కేశవ దారుణంగా తిడతాడు.. చక్రీకి నేర్పించి మహాలక్ష్మిని ఇలా బయటికి పంపించాడు అని మాధవతో చెప్తాడు.. కేశవ అలా మాట్లాడటం విని కన్నా కూడా నాకు ఆకలి చచ్చిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. కన్నా వదిన చాలా బాధపడుతుంది అని ఎమోషనల్ అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు దగ్గర స్టూడెంట్ గా మీనా.. ప్రభాకు బుర్ర గిర్రున తిరిగింది.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×