E-Paper
Advertisement

బడ్జెట్‌లో రూల్స్ బ్రేక్ చేస్తున్న కొత్త స్మార్ట్ టీవీ.. పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్!

బడ్జెట్‌లో రూల్స్ బ్రేక్ చేస్తున్న కొత్త స్మార్ట్ టీవీ.. పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్!
Advertisement

TCL T89 TV: ప్రస్తుతం స్మార్ట్ టీవీ మార్కెట్లో ప్రీమియం పిక్చర్ క్వాలిటీని ఆశించే వారి కోసం సరికొత్త ‘మినీ ఎల్‌ఈడీ’ (Mini LED) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఈ టెక్నాలజీ ఉన్న టీవీలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి, కానీ ప్రముఖ బ్రాండ్ TCL, బడ్జెట్ ధరలోనే అత్యుత్తమ ఫీచర్లతో TCL T89 QD Mini LED 4K స్మార్ట్ టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దాదాపు 10 కి పైగా ఇతర Mini LED, QLED టీవీలతో రియల్ టైమ్‌లో పోల్చి చూసిన తర్వాత, ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీగా నిలిచింది. డిజైన్ పరంగా మెటాలిక్ సైడ్ ఫ్రేమ్ మరియు చాలా స్లిమ్ బెజెల్స్‌తో వచ్చే ఈ టీవీ హాల్‌లో లేదా బెడ్‌రూమ్‌లో పెట్టినప్పుడు ఇల్లకు చాలా లగ్జరీ లుక్ ఇస్తుంది.

Read also-డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో

Advertisement

ఈ టీవీ మార్కెట్లో మూడు వేర్వేరు సైజులలో లభిస్తోంది. 55 ఇంచుల ధర రూ. 51,999 కాగా, 65 ఇంచులు రూ. 67,999 మరియు 75 ఇంచుల మోడల్ రూ. 89,999 ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం QLED టీవీ మాత్రమే కాదు, క్వాంటం డాట్ లేయర్ మరియు బ్యాక్‌సైడ్ వేలాది చిన్న మినీ ఎల్‌ఈడీల కలయికతో రూపొందిన ‘QD Mini LED’ టీవీ కావడం విశేషం. 55-ఇంచ్ మోడల్‌లో 384 డిమ్మింగ్ జోన్స్, 65-ఇంచ్‌లో 512 డిమ్మింగ్ జోన్స్ ఉండటం వల్ల చీకటిగా ఉండే సీన్లలో పిచ్ బ్లాక్ కలర్స్ అద్భుతంగా కనిపిస్తాయి కాంట్రాస్ట్ రేషియో చాలా రిచ్‌గా ఉంటుంది.

ఇందులో ఉపయోగించిన VA ప్యానెల్ డాల్బీ విజన్, HDR 10+, HLG మరియు 94% DCI-P3 కలర్ గ్యామట్‌ను సపోర్ట్ చేస్తుంది. రియల్ టైమ్ టెస్టింగ్‌లో ఇది 470 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందించింది, అంటే పగటిపూట వెలుతురులో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాచురేటెడ్ కలర్ ప్రొఫైల్ ఉన్నప్పటికీ, స్కిన్ టోన్స్ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. గేమర్ల కోసం ఇందులో అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్. మీరు PS5 వంటి గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేస్తే ప్రాపర్ 4K రిజల్యూషన్‌లో 144Hz స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. DLG టెక్నాలజీ ద్వారా దీనిని 280Hz వరకు పెంచుకోవచ్చు, కానీ అప్పుడు రిజల్యూషన్ కేవలం 2K కి పరిమితం అవుతుంది.

Advertisement

Read also-Today Movies in Tv : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత Google TV OS తో రన్ అవుతుంది. ఇందులో 3GB RAM, 32GB స్టోరేజ్ ఇవ్వడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, మల్టీటాస్కింగ్ మరియు రామ్ మేనేజ్‌మెంట్ చాలా స్మూత్‌గా ఉంటాయి. రిమోట్ లేకుండా నేరుగా “ఓకే గూగుల్” అని కమాండ్ ఇచ్చేందుకు ‘ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్’ సపోర్ట్ కూడా ఉంది. ఆడియో పరంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన 30W స్పీకర్లు లౌడ్ అండ్ క్లియర్ సౌండ్‌ను అందిస్తాయి. కంపెనీ ఈ టీవీపై 2 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఒకవేళ మీ బడ్జెట్ రూ.50,000 ఆ పైన ఉండి, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, స్మూత్ గేమింగ్, మరియు ఫ్యూచర్-ప్రూఫ్ ఫీచర్లు కావాలనుకుంటే, కళ్ళు మూసుకుని ఈ టీవీని ఎంచుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×