E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రిని రెచ్చగొట్టిన నారాయణ.. బాధతో మందు తాగిన చక్రీ.. అయ్యో.. మహాకు మైండ్ బ్లాక్..

Podarillu Today Episode : చక్రిని రెచ్చగొట్టిన నారాయణ.. బాధతో మందు తాగిన చక్రీ.. అయ్యో.. మహాకు మైండ్ బ్లాక్..
Advertisement

Podarillu Today Episode June 20th :చక్రి ఇంకా ఇంటికి రాలేదని బాధ పడిపోతూ ఉంటుంది మహా.. అయితే ఎందుకు ఇంకా చక్రి రాలేదు అని అడగ్గానే ఎవరి గురించి వెతుకుతున్నారు అని కేశవ్ అంటాడు. మీ అన్నయ్య చక్రి గురించే నేను వెయిట్ చేస్తున్నాను. మరి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. అవునన్నయ్య ఇప్పుడు బండి కూడా లేదు కదా ట్రిప్పు వెళ్లే పని కూడా లేదు కదా ఎక్కడికి వెళ్ళాడు.. రావచ్చు కదా తొందరగా అని కేశవ కూడా తిడతాడు. వాడు లైసెన్స్ పోయిన బాధలో ఉన్నాడు రా వస్తూ ఉంటాడు అని మాధవ్ ఉంటాడు.. నాకు స్కూటీ ఇచ్చే సర్ప్రైజ్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది.. ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి కారు కూడా లేదు కదా మరి అంత ఖర్చు పెట్టి స్కూటీ కొనడం ఎందుకు అని మహాలక్ష్మి అంటుంది. అన్నయ్య నీకోసం కష్టపడకుండా ఉండాలని ఇదంతా చేశాడు అని వాళ్ళు చెప్పగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది.. మహాలక్ష్మి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారని చక్రి బయట నుంచి చూసి బాధపడిపోతూ ఉంటాడు. నేను లేకపోయినా వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు అని అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటారు. నారాయణ, చక్రీ ఇద్దరు గొడవ పడతారు.

చక్రికీ క్లాస్ పీకిన నారాయణ..

ఏంట్రా బాధపడుతున్నావా..? స్కూటీలు కొనడం డబ్బులు ఖర్చు చేయడం వల్ల ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలుగుతుంది అని అనుకుంటున్నావా అని నారాయణ అంటాడు. ఇదంతా నీకు అవసరం లేదని చెక్కి ఎంత చెప్తున్నా సరే. చక్కని చుక్క లాంటి అమ్మాయి నీకు భార్యగా వచ్చింది. మీ పెళ్లి ఎలా జరిగిన పర్లేదు కానీ ఆ అమ్మాయి మనసులో నువ్వు స్థానాన్ని సంపాదించుకోవాలి. భర్తగా బహుమతులు ఇచ్చే వాడికన్నా భారీ మనసులో స్థానం ఉన్నవాడే నిజమైన మొగుడు మగాడు అని నారాయణ చక్రికి క్లాస్ పీకుతాడు. నేను స్కూటీ నేర్పిస్తానంటేనే నన్ను ఏ అవతలకు పో అనేసి అంటుంది. నీ భర్తను అంటే ఇంక తను ఒప్పుకుంటుందా? మంచి మనుషులగా బ్రతుకు ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించు అప్పుడే నీకు విలువ ఉంటుంది అని నారాయణ అంటాడు.

కారేశ్వర్ కు షాకిచ్చిన చక్రీ..

Advertisement

చక్రి నారాయణ అన్న మాటలు తలుచుకొని బాధపడిపోతూ బారుకు వెళ్తాడు. అక్కడ చక్రి పనిచేస్తున్న ట్రావెల్ ఓనరు మందు తాగుతూ ఉండగా దాన్ని తీసుకుని ఘటకటాగేస్తాడు. అసలు నీకు మందు అలవాటు లేదు కదరా అలా తాగితే మత్తెక్కుతుంది నెమ్మదిగా తాగు అని కారేశ్వర్ అంటూ ఉంటాడు. కానీ చక్రి మాత్రం ఇకమీదట నుంచి అలవాటు చేసుకుంటాను అని గ్లాస్ మీద గ్లాస్ తాగుతూ ఉంటాడు. ఏమైంది ఎందుకు అలా తాగుతున్నావు లైసెన్స్ పోయిందని బాధపడుతున్నావా అని కాళేశ్వర్ అంటాడు. ఒక నెల ఆగితే నీ డ్రైవింగ్ లైసెన్స్ నీకు వస్తుంది . నువ్వు మళ్ళీ అదే కారణం తీసుకొని డ్రైవింగ్ చేసుకోవచ్చు దానికి ఎంత బాధ పడిపోతున్నావా అని చక్రీని కారేశ్వర్ అంటాడు.. వీళ్ళ తాగడం చూస్తే నీ భార్య బాధ పడిపోతుంది అని కారేశ్వర అనగానే భార్యను ఏం మాట్లాడుతున్నావు అని చక్రి బాధపడతాడు.

పెళ్లి గురించి నిజం చెప్పిన చక్రీ..

తన మెడలో నేను కేవలం అవసరానికి మాత్రమే తాళి కట్టాను.. అంతేకానీ తనకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆ అమ్మాయి అనుకుంటుంది. అసలు మా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా అని చక్రి మొత్తం వివరించి చెప్తాడు. పోలీస్ స్టేషన్లో మా పెళ్లి అనుకోకుండా జరిగింది అయితే అప్పటినుంచి ఆ అమ్మాయి మనకు జరిగింది ఉత్తుత్తి పెళ్లి మాత్రమే.. ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని నాకు దూరంగా ఉంటుంది అని చక్రి నిజం చెప్తాడు. అనవసరంగా ఏవంటే వి ఊహించుకోవద్దు అని మహాలక్ష్మి అన్నట్లు కారేశ్వర్ తో చెప్తాడు. పిచ్చి సన్నాసి నువ్వంటే ఇష్టం లేకపోతే నీ ఇంట్లో ఎందుకుంటుంది. మంచివాడిగా తనని తీసుకొని వచ్చావు. మగాడి లాగా తన మనసులో చోటు సంపాదించుకో.. ఆడవాళ్లు అలానే పెట్టు చేస్తారు నువ్వే ఒక అడుగు ముందుకు వేసి మగాడిలాగా తన మనసులో చోటు సంపాదించుకొని కారేశ్వర్ అంటాడు..

నారాయణకు మైండ్ బ్లాక్..

Advertisement

చక్రి తాగేసి ఇంటికి రావడం చూసిన నారాయణ షాక్ అవుతాడు.. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా అని అడుగుతాడు. నా బాధ చెప్పుకోలేనిది భరించలేనిది. నేను ఏం చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు అని చక్రి బాధ పడిపోతూ ఉంటాడు. నువ్వు ఇలా పిచ్చిపిచ్చిగా చేస్తావు కాబట్టి నీ భార్య మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నావు.. ఒక్కసారి నీ భార్య మనసులో స్థానాన్ని సంపాదించుకో ఆడవాళ్లు మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని నారాయణ కూడా ఇంటికి రాగానే పెద్ద క్లాసు పీకుతాడు. ఇక మహాలక్ష్మి నాది అని ఫిక్స్ అయిపోతాడు చక్రి. తన గదిలోకి వెళ్లి నువ్వు నా భార్యవి మనిద్దరం ఈ గదిలోనే పడుకోవాలి అని చక్రి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.. మహాలక్ష్మి గదిలోకి వెళ్లిన చక్రి తనని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు మహాలక్ష్మి వెంటనే కళ్ళు తెరిచి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభా, మనోజ్ కు షాక్.. ఇదేం ట్విస్ట్ బాలు.. రివేంజ్ మాములుగా లేదుగా…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×