// // Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్..! -->
E-Paper
Advertisement

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!
Advertisement

Paddy Procurement: స్వేచ్చ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలు, కోటాల మేరకే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసేదిగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలకు మద్దతు ధర ప్రకటించి, ఎంత మేరకు కొనుగోలు చేస్తుందో అదే పరిమితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా..

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటలపై ఆంక్షలు విధించే వివక్షతకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఎదిగిందని, రైతులు అనేక కష్టనష్టాలను భరించి పంటలను పండిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి, తెలంగాణలో పండిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు పరిమితమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసిన నెల్లికంటి సత్యం, ఇప్పుడు కేంద్రం మద్దతు ధర, కేంద్రం కోటాల పేరుతో కొనుగోళ్లను పరిమితం చేయడం సరైన విధానం కాదన్నారు.

Advertisement

Also read: మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ..

రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. రాష్ట్ర క్యాబినెట్ ధాన్యం కొనుగోలు తీర్మానాన్ని వెంటనే పునఃసమీక్షించి, రైతు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలంటే కేంద్రం నిర్ణయించిన పరిమితులకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించిన ప్రతి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనని నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు.

Advertisement

Also read: జొమాటో, స్విగ్గీ వాడుతున్నారా? ఈ బిల్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×