E-Paper
Advertisement

Podarillu Today Episode : విక్కీ మాటతో చక్రీ మైండ్ బ్లాక్.. మాధవ్ టీకి ఫిదా.. అయ్యో చక్రీ ఇజ్జత్ పోయిందిగా..

Podarillu Today Episode : విక్కీ మాటతో చక్రీ మైండ్ బ్లాక్.. మాధవ్ టీకి ఫిదా.. అయ్యో చక్రీ ఇజ్జత్ పోయిందిగా..
Advertisement

Podarillu Today Episode July 4th: రాత్రి అయిన తర్వాత అందరూ పడుకునేందుకు సిద్ధంగా ఉంటారు.. తని చక్రి మాత్రం ఒంటరిగా తనలో తానే బాధపడిపోతున్నట్లు కనిపిస్తాడు.. అది చూసిన కేశవ నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నాం రా ఏమైంది అని అడుగుతాడు.. ఏం కాలేదు..రా అని ఎంతగా చెబుతున్నా కూడా వినకుండా అందరూ బలవంత పెడతారు.. మేమిద్దరం కలిసి రావడం చూసి మీరిద్దరూ కలిసిపోయారని అనుకున్నారు.. కానీ విడాకుల గురించి మీకు చెప్పాలి అని అంటాడు.. బయటికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ వదిన ఏదో చెప్పిందన్నట్లుగా విడాకులు కావాలని అడిగింది.. త్వరలోనే విడాకులు ఇవ్వాలని కూడా నన్ను పోస్ట్ చేసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే విడాకులు ఇవ్వమని అడిగింది అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే విడాకులు తీసుకుని ఇవ్వకుండా నేను ఏదో ఒకటి చేసి మా పెళ్లి ని నిజం పెళ్లి చేస్తాను అని చెక్రి శబదం చేస్తాడు.. అది విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా అది జరిగినట్లే అని వెటకారంగా అనుకుంటారు. ఇక తర్వాత రోజు విక్కీ వాళ్ళు రావడంతో చక్రి కుళ్ళుకుంటాడు..

విక్కీ మాటతో చక్రీ కడుపుమంట..

విక్కీ, దివ్యను మహా బృందావనంకు తీసుకొని వస్తుంది.. వాళ్ళందరూ రావడం చూసి మాధవ్ వాళ్ళందరూ కూడా చాలా గ్రాండ్ గా వెల్కమ్ పలుకుతారు.. అయితే ఆ ఇంటిని చూసిన వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అందుకే అన్నారేమో చాలా బాగుంది అని అతను ఇంటిని పొగిడేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఈ హెరిటేజ్ హౌస్ మాత్రం చాలా బాగుంది అని విక్కి ఆ ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి ఇంటిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు.. ఇక మాధవ్ అందరినీ పరిచయం చేస్తుంది మహాలక్ష్మి. మాధవ్ టీ పెట్టి అందరికీ తీసుకొని వస్తాడు.. ఇంత మంచి టీ తాగుతున్నారు అంటే మీరు చాలా గ్రేట్.. మీ వంటలు చాలా బాగుంటాయి నీ దివ్య చెప్తూ ఉంటుంది ఈసారి మీరు మంచి కర్రీ ఏదైనా చేస్తే నాకు కూడా పెట్టి పంపించండి అని మాధవ్ తో అంటాడు విక్కీ..

చక్రికీ షాకిచ్చిన మహా…

Advertisement

ఇల్లంతా ఒకసారి బాగా చూసిన తర్వాత విక్కీ చాలా బాగుంది ఎలా కట్టారు ఏంటి అని మొత్తం తెలుసుకుంటాడు.. ఇంటిని కట్టి దాదాపు 120 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి అని మాధవ్ చెప్పగానే అప్పట్లో ఇంత పెద్ద ఇల్లు కట్టడం అంటే గ్రేట్ అని అతను ఆ ఇంటిని పొగిడేస్తూ ఉంటాడు.. మా నాన్న మార్చాలని అనుకున్న కూడా ఎందుకు ఇప్పుడు కొత్త ఇల్లు లాగే ఉంది కదా..  మార్చడం ఎందుకు అని అన్నాడు అందుకే ఈ ఇంటిని మేము మా ఆరాధ్య దైవంలాగా చూసుకుంటున్నామని మాధవ్ అబద్దం చెప్తాడు.. ఇక ఆ తర్వాత చక్రీ ఆ రోజు ఆఫీస్ కి వచ్చాడు కదా మరి ఇతను నీకేమవుతాడు లక్కీ అని అనగానే మహాలక్ష్మి నాకు కజిన్ అవుతాడు అని అబద్ధం చెప్తుంది.. ఇక వాళ్ళు బయటికి వెళ్ళగానే కేశవ కన్నా ఇద్దరు కూడా పగలబడి నవ్వేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు ఏదో అనుకున్నాము ఇప్పుడు ఏకంగా కజిన్ అని వాళ్ళిద్దరూ ఎగతాళి చేస్తూ నవ్వుకుంటారు..

చక్రీ, మహా మధ్యలో విక్కీ..

ఇక మేము వెళ్తామండి అని విక్కి అనగానే అదేంటి భోజనం చేయకుండా వెళ్తున్నారు అని అడుగుతాడు.. మేము ఇంకొకసారి వచ్చినప్పుడు భోజనం చేస్తాము ప్రస్తుతానికి అయితే మేము వెళ్లాలని అనుకుంటున్నాము ఆఫీసులో చాలా పని ఉంది అని విక్కీ అంటాడు.. ఇక మహాలక్ష్మి వాళ్ళు వెళ్తుంటే చక్రి వెళ్లి డోర్ తీస్తాడు.. అయితే దివ్య వెనకాల సీట్లు కూర్చోవడానికి వెళ్తుంది. ఇక ముందర సీట్లో కూర్చుని ఎందుకు మహాలక్ష్మి వెళ్తుంది. చక్రి వెళ్లి అనవసరంగా పరువు పోగొట్టుకుంటాడు.. ఏది ఏమైనా కూడా విక్కీ మహాలక్ష్మి లైఫ్ లోకి రావడం చక్రికి అస్సలు ఇష్టం లేదని అర్థమవుతుంది.. మొత్తానికి త్వరలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

శైలుకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

కేశవ రాకముందే శైలు వెళ్లి షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది.. కేశవ అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి అంత చిరాగ్గా కోపంగా ఉన్నావు అని అడుగుతాడు.. మా అమ్మ బిర్యాని చేయమంటే నాలుగు చివాట్లు పెట్టింది. కానీ చివరికి చేసి పెట్టింది అని అనగానే చేసి పెట్టింది కదా అమ్మలంటే అలానే ఉంటారు అని కేశవ కూడా వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తాడు.. వీళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో శైలు కేశవ కి దూరం అవుతుందేమో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ పై మీనాకు అనుమానం.. డైటీషన్ దెబ్బకు ప్రభా షాక్.. బాలు కౌంటర్స్ హైలెట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×