E-Paper
Advertisement

ఏపీ, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. నేటి నుంచి దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!

ఏపీ, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. నేటి నుంచి దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!
Advertisement

Rain Alert: నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను పలకరించబోతోంది. రానున్న రెండు రోజుల్లో ఇది మరింత బలపడి ‘తీవ్ర అల్పపీడనంగా’ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేందుకు వాతావరణం అనుకూలంగా మారింది.

ఏపీకి వాన గండం..
ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై గట్టిగానే ఉండబోతోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రాలోని పలు జిల్లాల్లో నేటి నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Advertisement

తెలంగాణలో ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్!
ఇటు తెలంగాణను కూడా వరుణుడు వదిలేలా లేడు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడొచ్చని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రయాణికులు, రైతులు జాగ్రత్త..
వరుసగా కురిసే వర్షాల కారణంగా రోడ్లు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వాహనదారులు, ప్రయాణికులు సుదూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు చేతికొచ్చిన పంటలు దెబ్బతినకుండా రైతులు ముందస్తు చర్యలు చేపట్టడం మంచిది. అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు. తాజా వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ సురక్షితంగా ఉండటం ఉత్తమం.

Advertisement

Also Read: వివాదంలో సంజు.. ప్రాక్టిస్ సమయంలో వైభవ్ మెడలు పట్టుకుని బెదిరింపులు?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×