E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ పూజ ఫలించింది.. గుడ్ న్యూస్ చెప్పిన మహా.. శైలు మాటకు కేశవ షాక్..

Podarillu Today Episode : నారాయణ పూజ ఫలించింది.. గుడ్ న్యూస్ చెప్పిన మహా.. శైలు మాటకు కేశవ షాక్..
Advertisement

Podarillu Today Episode July 24th: శైలుకి పెళ్లి సంబంధం చూడాలని సురేష్ పట్టుబట్టి కూర్చోవడంతో ఇక వరాలు కూడా పెళ్లి చేయాల్సిందే అని నిర్ణయించుకుంటుంది.. ఇక శైలుకి ఒక పెళ్లి సంబంధం తీసుకొని వస్తారు మీ అమ్మాయి బాగా నచ్చింది.. మీరు ఓకే అనుకుంటే వాళ్ళు నిశ్చితార్థం కి వస్తారంట అని పంతులుగారు చెప్పడంతో మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. రైలుకి పెళ్లి సంబంధం గురించి చెప్పగానే షాక్ అయిపోతుంది.. మొత్తానికి నీకు పెళ్లి అయ్యేంతవరకు నువ్వు బయటికి వెళ్లడానికి వీల్లేదు అని వరాలు కండిషన్ పెట్టడంతో పాటుగా ఫోన్ కూడా పగలకొట్టేస్తుంది.

నారాయణ పూజ సక్సెస్..

నారాయణ డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా ఉంటే నన్ను తాగనివ్వదు అని బాధ పడిపోతూ ఉంటాడు. ఎప్పుడు లెండి దేవుడికి పూలు వేస్తూ చాలా కఠినంగా పూజలు చేస్తూ ఉంటాడు నారాయణ.. నారాయణ పూజలు విన్న దేవుడు కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరె పొద్దటి నుంచి పూలు వేస్తూనే ఉన్నావురా? ఊపిరి ఆడడం లేదు కాసేపు ఆపరా ఏంట్రా నీ సమస్య అని దేవుడు అడుగుతాడు.. స్వామి ఈరోజు మా అమ్మ బయటకు వెళ్తూ ఉండగా నేను తుమ్మను అది ఎక్కడ అపోసిగంగా మారిపోతుందో నా నోటి దగ్గర మందుని ఎక్కడ లాక్కుంటారో అని భయంగా ఉంది.. మా అమ్మ ఎలాగైనా డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అవ్వాలి అని  కఠినంగా పూజ చేస్తాడు. అతనికి నారాయణ హ్యాపీ న్యూస్ ని మహాలక్ష్మి షేర్ చేసుకుంటుంది.

గుడ్ న్యూస్ ను చెప్పిన మహా..

Advertisement

మహాలక్ష్మి చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది.. వెళ్లిన పని ఏమైందమ్మా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసిందా..? నిజంగానే ఏమైంది చెప్పు తల్లి అంటూ నారాయణ కంగారు పడిపోతూ ఉంటాడు.. అయితే వెళ్లిన పని ఇంకేం అవుతుంది సక్సెస్ అవుతుంది అని మహాలక్ష్మి చెప్పగానే ఏంటి డ్రైవింగ్ లో మీరు పాస్ అయ్యారా అని చాలా సంతోషంగా ఉంటారు.. అసలు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వడానికి ఏం జరిగిందో అది చెప్పండి ముందు అని చక్రీ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం నా టాలెంట్ తోనే డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ లో పాస్ అయ్యాను అని చెప్తుంది.. అయితే చక్రి అక్కడినుంచి వెళ్ళిపోగానే వీడికి ఏమైంది వీడు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అని అందరూ అడగ్గాని మహాలక్ష్మి చక్రి చేసిన సాయం గురించి నిజం చెప్తుంది.. చక్రి అంత పని చేశాడా నిజంగా గ్రేట్ అంటూ తన ఇంట్లో వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉంటారు..

శైలు కు పెళ్లి ఫిక్స్..?

రాత్రి చక్రి ఒంటరిగా ఉండి బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి ఎక్కడున్నారు ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతుంది.. ఎక్కడున్నారు అర్థం కాక అందుకే ఇక్కడ ఉన్నాను అని చక్రి అంటాడు. నేను అంత గొప్ప పని చేస్తే మీరు మా ఇంట్లో వాళ్లకి ఎందుకు చెప్పలేదు అని చక్రి చాలా ఫీల్ అవుతాడు.. అసలు నేను అంత సాయం చేసిన కూడా మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఎంత చెప్తున్నారు సరే మహాలక్ష్మి మాత్రం వెటకారం గానే ఉంటుంది.. కేశవా చక్రి తో మాట్లాడుతుండగా శైలు పిలవగానే కేశవా తనతో పాటు బయటకు వెళ్తాడు.. తనకి పెళ్లి ఫిక్స్ అయింది మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అని చెప్పగానే కేశవ ఎలాగో పెళ్లి చెడగొడతావు కదా దానికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని అంటాడు.. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుందాం మాటలు మాత్రం కాస్త కామెడీగా అనిపిస్తాయి.

సురేష్ చెంప పగలగొట్టిన మహా..

Advertisement

శైలు అన్నయ్య సురేష్ ఫ్రెండ్స్ మెకానిక్ తో వీడి చెల్లెలు ప్రేమలో పడింది అని వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు.. వాడి గురించి ఎంత చెప్పినా సరే మా చెల్లెలు వినడం లేదు రా ఏం చేయాలో అర్థం కావడం లేదు అని సురేష్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న మహాలక్ష్మిని చూస్తున్న సురేష్ కేశవ గాడి వదిన కదా ఇది దీన్ని ఒక ఆట ఆడుకుంటాను చూడు అని అంటారు.. పంచమి పాప అని అవమానించేలా మాట్లాడుతాడు సురేష్.. ఐదుగురు మగాళ్ళతో ఉన్న నిన్ను ఏమని పిలవాలి అని దారుణంగా మాట్లాడుతాడు.. మాట వినగానే మహాలక్ష్మి సీరియస్ అయ్యి సురేష్ చంప పగలగొడుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ రా ఒక ఆడపిల్ల తో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని మహాలక్ష్మి ఎంతగా చెప్తున్నా సరే నన్నే కొడతావా అంటూ తనని అవమానించేలా మాట్లాడుతాడు. అంతేకాదు తన చున్ని పట్టుకొని లాక్కొని వెళ్లిపోతాడు.. మహాలక్ష్మి కిందిపడి బాధ పడిపోతుంది ఇంటికి వస్తుంది.. అది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. సురేష్ కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతిపై నర్మద సెటైర్లు.. భద్ర సర్ప్రైజ్ గిఫ్ట్స్.. సేనా ట్విస్ట్ అదిరిపోయింది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×