E-Paper
Advertisement

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..
Advertisement

Podarillu Today Episode July 21st: మహాలక్ష్మి వంటరిగా వస్తుందని చూసిన విక్కీ ఏమైంది ఎందుకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు.. కానీ చివరికి మహాలక్ష్మి ఎలాగోలాగా విక్కీ కారులోనె ఇంటికి వస్తుంది. విక్కీ లక్కీ వచ్చారు అని కన్నా అనగానే చక్రి షాక్ అవుతాడు.. అయితే విక్కీని బయట నుంచి పంపించాలని అనుకుంటాడు కానీ మహాలక్ష్మి మాత్రం లోపలికి తీసుకొని వస్తుంది.. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చక్రి గురించి ఆలోచిస్తూ మహాలక్ష్మి కోపంగా ఉంటుంది.. ఎలాగైనా సరే చక్రితో ఈ విషయాన్ని తేల్చుకోవాలి అని అనుకుంటుంది.. ఇక తర్వాత కేశవ గర్ల్ ఫ్రెండ్ శైలు అక్కడికి వస్తుంది. శైలుని చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అని సంతోషంగా ఉంటారు..

కన్నా మాటతో మాధవ్ షాక్..

మహాలక్ష్మి బర్త్ డే సందర్భంగా ఇంటికి వచ్చిన అందరూ కూడా ఆమె బర్త్డేని చాలా గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు. అయితే మహాలక్ష్మి మాత్రం చక్రి చేసిన మోసాన్ని ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే కేశవ తన గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకొని ఇంటికి వస్తాడు.. ఇల్లంతా ఒక్కసారిగా ఆడవాళ్ళతో కళకళలాడిపోతుంది.. వాళ్ళు చూడముచ్చటైన జంట అని కన్నా మాధవ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు చాలా బాగున్నారు కదా అని మాధవ్ అంటాడు.. అదేవిధంగా అన్నా నీకోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుందో ఏంటో ఎప్పుడు వస్తుందో అని అంటూ ఉండగానే మనిషా నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది.. ఆ మాట వినగానే కన్నా మాధవ ఇద్దరు షాక్ అవుతారు.. అయితే మనిషా రాగానే మాధవ్ కూడా కాస్త సిగ్గుపడుతూ కనిపించడంతో త్వరలోనే వీళ్ళిద్దరికీ సెట్ ఎలా కనిపిస్తుంది.. మాధవ్ వచ్చి రాని హిందీలో మాట్లాడడంతో శైలు తనకి సరిచేసి నిజం చెప్తుంది.. ఇకపోతే మాధవ్ అన్న ప్రతి మాటకు మనిషా కూడా సిగ్గుపడుతూ కనిపిస్తుంది.

నారాయణ ఫుల్ హ్యాపీ..

Advertisement

నారాయణ ఇంట్లోకి రాగానే ఇది మన ఇల్లేనా అని నాకు డౌట్ గా ఉందిరా అని అడుగుతాడు. కన్నా మన ఇంట్లో కనిపించట్లేదా ఈ పాడు పడ్డ బంగ్లా గోడలు అని వెటకారంగా మాట్లాడతాడు. అది చూసిన నారాయణ ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావ్ ఏంటి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్లను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు. అయితే అదే క్రమంలో మనిషా గురించి నీకు తెలిసిందే ఇక కేశవ్ అన్నయ్య బుస్సు ఆ అమ్మాయిని అని అనగానే ఓ ఈ అమ్మాయి అని నారాయణ షాక్ అవుతాడు.. అయితే శైలు ఎవరితను అని అడుగుతుంది మా నాన్న అని అనగానే అవునా మీ నాన్న అయితే కాళ్లకు ఇప్పుడు దండం పెట్టమంటావా ఏంటి అని అడుగుతుంది కానీ ఆయనకు అంత సీన్ లేదులే అవసరం లేదు అని కేశవ్ అంటాడు. చాలా సంతోషంగా ఉంటుంది.

చక్రీ ప్లాన్ గ్రాండ్ సక్సెస్..

చక్రి మహాలక్ష్మి పుట్టినరోజుని గ్రాండ్గా చేసి తనకి ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలని కోరుకుంటూ అనుకుంటాడు.. అయితే మహాలక్ష్మికి ప్రపోష్ చేసే విధంగా కేక్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు.. ఇక విక్కీ కూడా వచ్చి కేక్ కట్ చేస్తే నేను వెళ్ళిపోవాలి నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అని అంటాడు.. ఆ మాట వినగానే చక్రి వీడు వెళ్ళిపోతే బాగుండు అని కుళ్ళుకుంటూ ఉంటాడు.. అప్పుడే కేక్ కటింగ్ చేసి మహాలక్ష్మికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు.. చక్రి గురించి కానిస్టేబుల్ చెప్పిన మాటలను తలచుకొని మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది.. అయితే మహాలక్ష్మి అంత కోపంగా ఉండడానికి కారణం ఏంటి అని అనుకుంటారు. ఇక విక్కీకి కేక్ పెడుతూ ఉండగా చక్రి కావాలని తనని మీద పడినట్లు చేస్తాడు ఇక చక్రి ఆ కేకును తింటాడు మొత్తానికి చక్రి బిక్కిని దూరం చేసే ప్రయత్నం మాత్రం సక్సెస్ అవుతుంది.

మహా మాటతో చక్రీ షాక్..

Advertisement

మహాలక్ష్మికి ఇవాళ ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలి అని చక్రి కేశవ కన్నాతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే లాంగ్ డ్రైవ్ తీసుకుని వెళ్లి తనకి ప్రపోజ్ చేస్తాను అని చక్రి ఇలా అన్నాడో లేదో మహాలక్ష్మి నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకుని వెళ్తాడని అడుగుతుంది. అయితే మహాలక్ష్మి ఆ మాట అనగానే అందరూ కూడా చక్రి పోలంలో మొలకలు వచ్చాయి అని చాలా సంతోషంగా ఉంటారు.. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మహాలక్ష్మికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని చక్రి అనుకుంటాడు. మహాలక్ష్మి మీ చక్రి ప్రపోజ్ చేయగానే నీలాంటి ఒక ఫ్రాడ్ ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటుంది.. చక్రి మహాలక్ష్మి మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు..

అడ్డంగా దొరికిపోయిన చక్రీ..

చక్రి మీరు ఎందుకు నా మీద ప్రేమను పెంచుకుంటున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. అయితే నేనేం చేశాను అండి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీకోసం నేను ఎంత చేసినా కూడా మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు అని చక్రి అంటాడు.. మొత్తానికి మహాలక్ష్మి కానిస్టేబుల్ చెప్పిన నిజం గురించి చక్రికి చెప్పగానే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి.. నువ్వు నాకోసం అన్ని చేశావు నువ్వు ఒక త్యాగమూర్తివి కానీ ఈ ప్రేమ దోమ లాంటివి నా దగ్గరికి తీసుకురావద్దు అని ఒక్కసారిగా చెప్పేస్తుంది.. ఆ మాట వినగానే చక్రి ఈ షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×