E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: దుష్టశక్తి వల్ల పిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలియక అమర్‌ సతమతం అవుతుంటాడు. ఎవరు తన కుటుంబాన్ని.. తన పిల్లలను టార్గెట్‌ చేశారు అని ఆలోచిస్తుంటాడు. అసలు ఆరు చంపింది ఎవరు..? పెళ్లికి ముందు తనకు శత్రవులు ఎవరున్నారో గుర్తు రావడం లేదు.. అని అన్ని విషయాలు ఆలోచిస్తుంటాడు. అమర్‌ను దూరం నుంచి గమనిస్తున్న మిస్సమ్మ కూడా బాధపడుతుంది. ఆయనకు గతం గుర్తుకు వచ్చి ఉంటే నేనే తన దగ్గరకు వెళ్లి ఓదార్చేదాన్ని కదా రాథోడ్‌ అని చెప్తుంది. ఆ మాటలకు రాథోడ్‌ సారీ మిస్సమ్మ సార్‌కు గతం గుర్తుకు వచ్చింది కానీ ఆ నిజం నీకు చెప్పొద్దని సారే చెప్పారు అని మనసులో అనుకుంటూ బాధపడతాడు.

ప్రచండను కలిసిన మనోహరి చెడామడా తిడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయలేకపోయావు.. చివరి నిమిషంలో బయటకు పారిపోయి వచ్చావు.. కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అమర్‌కు దొరికేసి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది. అసలే అమర్‌ గతాన్ని తవ్వడం మొదలు పెట్టాడు. ఆరును చంపిన విషయం అమర్‌కు తెలిస్తే తనను బతకనివ్వడని భయంగా చెప్తుంది. అందుకు ప్రచండ నేను చేయాల్సిందంతా చేశాను మనోహరి కానీ ప్రతిసారి ఆ భాగీ అడ్డుపడింది. అదీకాక ఆ స్వామిజీని నేను తక్కువ అంచనా వేశాను.. అందుకే చిన్న పొరపాటు జరిగింది లేదంటే ఈ పాటికే బుజ్జమ్మను చంపేసి ఆ శక్తులు తీసుకుని వెళ్లిపోయేవాడిని అంటూ చెప్పగానే.. మనోహరి కోపంగా తిడుతుంది.

Advertisement

అమర్‌ తన రూంలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే.. మిస్సమ్మ వెళ్తుంది. సారీ సార్‌ స్వామిజీ విషయం, అంజులో ఉన్నదుష్టశక్తి గురించి స్వామిజీ చెప్పిన విషయం మీకు ముందే చెప్పలేదు అంటూ బాధపడుతుంటే.. అదేం లేదు మిస్సమ్మ.. గతం మర్చిపోయి టెన్షన్‌లో ఉన్న నాకు మరోక టెన్షన్‌ ఎందుకని అన్ని బాధ్యతలు నువ్వు తీసుకున్నావు.. అందుకు నేనే నీకు థాంక్స్‌ చెప్పాలి. ఆరు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు.. అసలు నువ్వే లేకపోతే గతం మర్చిపోయిన నేను పిల్లలు ఏమైపోయేవారమో.. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న నీ కష్టాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను మిస్సమ్మ అందుకు నేనే నీకు థాంక్స్‌ చెప్పాలి అంటూ మిస్సమ్మను దగ్గరకు తీసుకుని హగ్‌ చేసుకుంటాడు అమర్‌. మిస్సమ్మ కూడా ఎమోషనల్ అవుతుంది.

అప్పుడే అటువైపు వెళ్తున్న చంభా, అమర్‌, మిస్సమ్మలను చూసి షాక్‌ అవుతుంది. వీళ్లేంటి ఇలా అతుక్కుపోయారు.. ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలి అనుకుంటూ వెళ్లిపోతుంది. మిస్సమ్మ తేరుకుని ఏంటి సార్‌ మీరు చేసేది అంటుంది. థాంక్స్‌ చెప్తున్నాను మిస్సమ్మ అని అమర్‌ అంటే థాంక్స్‌ ఇలా హగ్‌ చేసుకుని చెప్తారా సార్‌ అనగానే.. అవును హార్ట్‌ఫుల్‌గా చెప్పాను తప్పా అంటాడు అమర్‌ దీంతో మిస్సమ్మ తప్పా అంటారేంటి సార్‌ తప్పే.. ఇక నుంచి మీరు నాకు దూరం మెంటెన్స్‌ చేయండి అని చెప్పగానే.. అమర్‌ సరే అయితే అంటూ దగ్గరకు వెళ్లి భోజనం చేశావా అని అడగ్గానే.. మిస్సమ్మ దూరం వెళ్తుంది. పద వెళ్లి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా అంటూ ఇద్దరు కిందకు వెళ్తారు.

Advertisement

అప్పుడే మనోహరి బయటి నుంచి వస్తుంది. ఆ వెనకాలే కొడైకెనాల్‌ ఎస్సై కూడా ఇంటికి వస్తాడు. ఎస్సైని చూసి అమర్‌ ఏంటి సార్‌ ఈ టైంలో వచ్చారు అని అడగ్గానే.. మీతో ఒక ఇంపార్టెంట్‌ విషయం చెప్పడానికి వచ్చాను సార్‌ అనగానే.. మనోహరి భయంతో వీడు కచ్చితంగా నా గురించి చెప్పడానికే వచ్చి ఉంటాడు అని మనసులో అనుకుని అమర్‌కు ఇప్పుడు ఒంట్లో బాగాలేదని ఉదయం కలవమని చెప్తుంది మనోహరి. లేదు ఇప్పుడే చెప్పమని అమర్‌ అనగానే.. ఎస్సై తాను ఈ కేసు గురించి ఇక ఎంక్వైరీ చేయలేనని తనను ఈ కేసు నుంచి తప్పించారని ఏసీపీ పార్థసారథి టేకప్‌ చేశారని ఆయన కేసు మొత్తం రీ ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పగానే మనోహరి డబుల్‌ షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×