E-Paper
Advertisement

Podarillu Today Episode : అర్రె ఏంట్రా ఇది.. కన్నాకు దొరికిపోయిన కేశవ.. మహా షాకింగ్ నిర్ణయం..?

Podarillu Today Episode : అర్రె ఏంట్రా ఇది.. కన్నాకు దొరికిపోయిన కేశవ.. మహా షాకింగ్ నిర్ణయం..?
Advertisement

Podarillu Today Episode July 12th: కేశవను శైలు గట్టిగా పట్టుకొని భుజంపై పడుకుంటుంది. మొండోడైన కేశవ పట్టుకోకపోయిన పర్వాలేదు కదా.. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు కదా అని అంటాడు. ఆ మాటకి శైలు మాత్రం దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. లవర్స్ అన్నాక ఇలానే ఉండాలి ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అని ఇంకాస్త గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. వాళ్ళిద్దర్నీ చూసినా కన్నా అందరినీ అక్కడికి తీసుకొని వస్తాడు. అదే సమయంలో శైలుకి తన ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కేశవ.. ముఖ్యంగా చక్రీ గురించి దారుణంగా మాట్లాడడంతో చాలా ఆవేశంగా ఉంటాడు చక్రి.. అక్కడున్న ప్రతి ఒక్కరి గురించి కేశవ వివరించి చెప్పడంతో.. అందరూ ఒక్కసారిగా కేశవ పై సీరియస్ అవుతారు.. ముఖ్యంగా చక్రీని బేవర్స్ గాడు అని అనడంతో ఇంకాస్త ఊగిపోతాడు.. ఎలాగైనా సరే వీడి ఇంటికి వస్తాడు కదా అప్పుడు వీడి గురించి తేలుస్తాను అని చక్రి అనుకుంటాడు.. ఇక అందరూ కేశవ మాట్లాడిన మాటలకి చాలా కోపంగా ఉంటారు..

కేశవ పై మహా సీరియస్..

కేశవ తన ఇంట్లో వాళ్ల గురించి శైలుకి చెప్పడం అందరూ అక్కడే ఉండి వింటారు. అది విన్న వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్లి వీడు ఇలా అంటాడని అస్సలు ఊహించలేదు. అతని గురించి అతను గొప్పగా చెప్పుకోవాలని మనందరి గురించి ఇలా మాట్లాడతారని అందరూ చాలా సీరియస్ గా ఉంటారు. అప్పుడు మనిషా ఏమైంది ఏం జరిగింది అని హిందీలో అడుగుతుంది.. ఏం జరగలేదు అని మహాలక్ష్మి అంటుంది.. అయితే మహాలక్ష్మి అందరి గురించి అలా చెప్పడానికి అతనికి ఎంత ధైర్యం అని సీరియస్ అవుతుంది.. పోనీలే అమ్మ ఏదో అన్నాడు అని మాధవ్ అనగానే మీరు ఇలా అనడం వల్లే అతను మిమ్మల్ని కూడా పరువు తీసేలా మాట్లాడుతున్నాడు అని మహా సీరియస్ అవుతుంది.. అంతే కాదు అందరూ తమల్ని ఎంతమాట అంటారా అని బాధపడిపోతూ ఉంటారు.. నన్ను మహంకాళి అంటాడా ఇంటికి వస్తాడు కదా అతని సంగతి చెప్తాను అని మహాలక్ష్మి సీరియస్ అవుతుంది..

కన్నా రివేంజ్ ప్లాన్..

Advertisement

కన్నా మనల్ని ఇంత మాట అంటారా నేను ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకొని వస్తాను అని కోపం వెళ్తాడు.. అందరూ ఎంతగా ఆపాలని ప్రయత్నించిన సరే అస్సలు వినకుండా కన్నా నేను నా కోపాన్ని చల్లర్చుకొని వస్తాను అని అంటాడు. నన్ను డిగ్రీ ఫెయిల్ అయినవాడు అని అవమానిస్తాడా..? ఈరోజు వాడి అంతు చూస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు కన్నా. అక్కడ పల్లి నమ్ముతున్న వ్యక్తి దగ్గరనుంచి ఆ బుట్టని తీసుకొని ఇప్పుడే ఇస్తాను అని వెళ్తాడు.. కేశవ శైలు ఉన్న ప్లేస్ కి వెళ్లి పల్లీలు పల్లీలు అంటూ గోల గోలగా అరుస్తాడు.. వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇంకాస్త ఎక్కువగా పల్లీలు అంటూ గట్టిగా అరుస్తాడు. వేడివేడి పల్లీలు ఉతికారేసిన పల్లీలు, డిగ్రీ ఫెయిల్ అయిన పల్లీలు అని గట్టిగా అరుస్తూ ఉండడంతో కేశవ అసలే భయంగా ఉందంటే ఈ పల్లీలమ్మేవాడు ఒకడు అని అంటాడు.. వాడితో నీకేం పని అని శైలు ఎంతగా ఆపడానికి ప్రయత్నించిన సరే పల్లీలు అన్ని అస్సలు ఊరుకునేదే లేదని లేస్తాడు కేశవ.

కన్నాను చూసి మైండ్ బ్లాక్..

ఈ పల్లీలు వాడు గోల ఒకటి.. ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.. వాళ్ల సంగతి చూస్తాను అని కేశవ ఆవేశంగా లేచి ఎదురుగా ఉన్న కన్నా ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. సర్ పల్లీలు కావాలా పల్లీలు పల్లీలు అని కన్నా అనడంతో కేశవ అడ్డంగా వీడికి దొరికిపోయానా అని కంగారు పడిపోతూ ఉంటాడు.. అయితే కేశవను చూసిన కన్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు.. ఇంట్లో చెప్తే నా పరిస్థితి ఏంటి అని భయపడిపోతూ ఉంటాడు కేశవ. పక్కనే ఉన్న శైలు ఏంటి పల్లీల వాడ్ని చూసిన వాళ్ళ షాక్ అవుతున్నావు అని అడుగుతుంది. అది మనము ఇప్పుడు వెళ్ళిపోదాం పద అని కేశవ శైలు ని తీసుకొని వెళ్ళిపోతాడు.. కేశవ్ అన్నయ్య పరిస్థితి ఎలా ఉంది అని అక్కడకు వెళ్లి అందరితో చెప్పి నవ్వుకుంటాడు కన్నా.

మనసులో మాట చెప్పిన చక్రీ..

Advertisement

చక్రి తర్వాత రోజు మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు.. మీతో మాట్లాడాలని వచ్చాను అలా కూర్చొని మాట్లాడదామా అని కూల్ గా అడుగుతాడు.. దేని గురించి మాట్లాడాలో చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది. మీరు నన్ను భర్తగా ఒప్పుకోకపోయినా కూడా.. నేను మిమ్మల్ని తాళి కట్టిన భార్య గాని అనుకుంటున్నాను. మీరు కూడా అలానే ఉంటే బాగుంటుంది అని చక్రి అనగానే మహాలక్ష్మి మైండ్ బ్లాక్ అవుతుంది.. మిమ్మల్ని నేను చాలా సంతోషంగా చూసుకుంటాను అని చక్రి అనగానే మహా ఆలోచనలో పడుతుంది.. మరి చక్రి తో మహాలక్ష్మి కలిసిపోతుందా? లేదంటే బృందావనంకి దూరంగా వెళ్లిపోతుందా అన్నది సస్పెన్స్ గా మారింది? అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి అశ్విన్ ల మధ్య గొడవేంటి..? ప్రణతికి టెన్షన్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×