E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బుద్ధి చెప్పిన బాలు.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..శృతికి శోభా షాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బుద్ధి చెప్పిన బాలు.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..శృతికి శోభా షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 12th: ఇంట్లోకి వెళ్ళగానే అరేయ్ చూసుకొని రారా లేకుండా అంటే కింద పడతావని బాలు అంటాడో లేదో మనోజు మళ్లీ కింద పడతాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత నువ్వు నోరు తెరిచి ఏది అనద్దు అని అందరూ చెప్తున్న సరే.. బాలు మాత్రం వినకుండా శాపం పెడతాను అని అంటాడు.. ఒకవైపు రోహిణి వద్దని చెప్తూనే మరోసారి బాలు పై సీరియస్ అవుతుంది. బాలు ఏమంటే అదే జరుగుతుంది అని ప్రభావతీ కూడా నోరు మూసుకొని ఉంటుంది.. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ మాత్రం బాలు శాపాలతో కామెడీగా అనిపిస్తుంది..

మనోజ్ పై బాలు రివేంజ్..

మనోజ్ బాలు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి.. బాలు గురించే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు.. రోహిణి మనోజ్ కి టిఫిన్ పెట్టి నేను వెళ్లి కాఫీ తీసుకొని వస్తాను నువ్వు తింటూ ఉండు అని అంటుంది. రోహిణి ఆ బాలు గాడు మనకి తప్పుడు బిల్లులు ఇచ్చి ఇంకా ఎన్ని కట్టిస్తాడో నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని అనడంతో బాలు విని ఒక్కసారిగా సీరియస్ అవుతాడు.. ఆ 30,000 వాడు వాళ్ళ డ్రైవర్లని తీసుకుని వచ్చాడో లేదా మీనా పూల వాళ్ళని తీసుకొని వచ్చిందో అర్థం కావడం లేదు కచ్చితంగా వాళ్లే ఏదో ప్లాన్ చేసినట్లున్నారు అని మనోజ్ అంటాడు.. అదంతా నేను చూసుకుంటాలే కానీ నువ్వు ముందు తిను అని రోహిణి అంటుంది. అయితే రోహిణి పక్కకు వెళ్లగానే మనోజ్ దగ్గరికి బాలు వచ్చి అక్కడ ఉన్న పచ్చిమిరపకాయలను పెట్టగానే వాటిని అయ్యో కారం అని గట్టిగా కేకలు వేస్తాడు.. మనోజ్ అలా ఇబ్బంది పడడం చూసి బాలు మీనా చాలా సంతోషంగా ఉంటారు. అయితే బాలు మళ్లీ రోహిణి వచ్చేలాగా పచ్చిమిరపకాయలను పక్కనపెట్టి ఏమీ తెలియనట్టుగా వస్తారు. రోహిణి ఏమైంది మనోజ్ ఎందుకలా అరిచావు అని అడుగుతుంది..

మనోజ్ కు బాలు పై అనుమానం..

Advertisement

మనోజ్ బాలు మీనా అక్కడికి రావడంతో వీడే ఏదో చేసి ఉంటాడు.. వీడే నాకు పచ్చిమిరపకాయలు పెట్టినట్టు ఉన్నాడు అని మనోజ్ అనగానే బాలు సీరియస్ అవుతాడు.. నేను ఇప్పుడే వస్తున్నాను ఇలా మాట్లాడవంటే మామూలుగా ఉండదు మళ్ళీ శాపం పెడతాను అని బాలు అంటాడు.. మనోజ్ నీకు కళ్ళు కనిపించక ఏదేదో మాట్లాడుతున్నావు వాళ్ళు ఇప్పుడే వచ్చారు నువ్వు నోరు మూసుకొని తిను అని రోహిణి అంటుంది.. ఇక బాలు మనోజ్ ని బాగా ఆడుతున్నానని చాలా సంతోషంగా ఉంటాడు. నువ్వు ప్లేట్లో పెట్టిన ఇడ్లీ మాత్రమే తిను పక్కన ఉన్నవి ఏవి తినొద్దు అని రోహిణి మళ్లీ వెళ్ళిపోతుంది..

కస్టమర్ కు శృతి ఝలక్..

రెస్టారెంట్లో శృతి అందరి దగ్గర ఆర్డర్లు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఒకతను నువ్విలా మంచి అమ్మాయిలాగా ఉన్నావ్.. నిన్ను చూస్తుంటే చాలా ఇబ్బంది పడిపోతున్నావని అర్థమవుతుంది.. వేరే కంపెనీ ఒకటీ స్టార్ట్ చేశాను అక్కడ నీ ఇష్టం వచ్చిన జాబ్ చేసుకోవచ్చు అని అతను అనగానే శృతి అవునా సర్ మీరు చాలా మంచి వాళ్ళు అని అంటుంది.. అయితే నేను రావడం కాదు లోపల చేసుకో మా ఆయన ఉన్నాడు అతన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తాను మీరు అతనికి ఇదే విషయం చెప్పండి అని అనగానే అతను షాక్ అవుతాడు.. జాబ్ లేదు ఏం లేదు నా ఆర్డర్ నాకు తొందరగా తీసుకొని వస్తే నేను తినేసి వెళ్తాను అని అనగానే.. అదేంటి జాబ్ అన్నారు ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు అని శృతి అంటుంది.. నువ్వు మీ హస్బెండ్ అన్నావు కదా అందుకే నేను మనసు మార్చుకున్నాను అని కస్టమర్ అంటాడు.. అక్కడున్న మేనేజరు శృతిని వాడి మీద తన్ని తరిమేమంటావా అని అడుగుతాడు.. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలంటే కూల్ గా డీల్ చేయాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

శోభకు షాకిచ్చిన శృతి..

Advertisement

శోభ అక్కడ కూర్చుని ఉంటుంది.. శృతి అక్కడికి వెళ్లి ఆర్డర్ అని అడగగానే శోభాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అదేవిధంగా శృతిని అలా చూసి శోభ కూడా షాక్ అవుతుంది.. నువ్వేంటి ఇక్కడ వెయిటర్ గా పని చేస్తున్నావా..? నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోతున్నావా అని శృతికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది శోభ.. కానీ శోభ ఎంత చెప్తున్నా సరే శృతి మాత్రం మాటకు మాట సమాధానం చెబుతూ వస్తుంది. నువ్వు మంచి వాడివని అనుకున్నాను కానీ మా అమ్మాయి చేత ఇలాంటి పని చేస్తున్నవని నాకు అర్థం కావడం లేదు అని శోభా చాలా ఫీల్ అయిపోతుంది. మమ్మీ ఇక్కడ గొడవ చేయొద్దు నువ్వు వెళ్ళు అని అనగానే.. ఎవరితో చెప్తే నీ తిక్క కుదురుతుందో నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి శృతి ఇది నేను పని చేసే చోటా నాకు ఇలాంటివి ఎందుకు అని రవి ఫీలవుతాడు..

ప్రభావతి నడుం విరిగింది..

మనోజ్ ఒంటరిగా కూర్చుంటే బోర్ కొడుతుంది పాటలు వినాలని అనుకుంటాడు. మనోజ్ ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని పాటలు వింటూ ఉంటాడు.. బయటినుంచి వచ్చిన బాలు అది చూసి వీడికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటాడు… పాటలను మార్చి మార్చి మనోజ్ కి చుక్కలు చూపిస్తాడు.. అయితే అక్కడున్న ఫోన్ ని బాలు చేతిలో పట్టుకొని మనోజ్ ని వెతుక్కునేలా చేస్తాడు.. బాలు మనోజ్ అలా వెతుక్కోవడం చూసి తెగ నవ్వేసుకుంటాడు.. ప్రభావతి వస్తుందని గమనించిన బాలు ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఏంట్రా కుక్కలాగా అలా వెతుకుతున్నావు అని బయట నుంచి వచ్చినట్లు వస్తాడు.. నా ఫోన్ కనిపించడం లేదు అని వెతుక్కుంటున్నా అని అంటాడు.. నీ ఫోన్ అక్కడే ఉందిరా నీ కళ్ళు పోవడమేమో గాని మాకు బుర్ర పోయేలా ఉంది అని ప్రభావతి అంటుంది.. ఇక ప్రభావతి అనవసరంగా బాలును గెలికి అతని శాపానికి గురవుతుంది… నీ నడుమును విరుగుతాయి ఏమైనా అంటే అని బాలు ప్రభావతిని అంటాడు. మనోజు ప్రభావతి కూర్చుంటూ ఉండగా ఆ కుర్చీని లాగడంతో తను కింద పడిపోయి నడుము విరగట్టుకుంటుంది. ఈ సీన్ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. బాలు మనోజ్ ప్రభావతులను వదలకుండా వరుసగా కౌంటర్లు ఇస్తూ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : అర్రె ఏంట్రా ఇది.. కన్నాకు దొరికిపోయిన కేశవ.. మహా షాకింగ్ నిర్ణయం..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×