E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలును కొట్టిన వరాలు.. అయ్యో.. పాపం చక్రీ.. నారాయణకు స్ట్రాంగ్ వార్నింగ్..

Podarillu Today Episode : శైలును కొట్టిన వరాలు.. అయ్యో.. పాపం చక్రీ.. నారాయణకు స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Podarillu Today Episode July 06th: తన కూతురు వేరే మగాడితో అలా సరదాగా కనిపించి తట్టుకోలేకపోయినా శైలు తండ్రి ఒక్కసారిగా శైలు అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ మాట వినదని అక్కడ చూసిన శైలు వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరతను నిన్ను ఎందుకు పిలిచాడాన్ని కేశవ్ అడగ్గానే.. ఆయన మా నాన్న ఇప్పుడే వస్తాను ఆగు అని అక్కడికి వెళుతుంది.. మీరేంటి నాన్న ఇక్కడ అని భయంగా అడుగుతుంది. కాలేజీకి అని చెప్పి వచ్చి నువ్వు ఇక్కడికి ఏం చేస్తున్నావు అని అతను అడుగుతాడు. కీర్తి స్కూటీ రిపేర్ కి వచ్చింది నాన్న దాని రిపీట్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ కి తనే వెళ్ళింది. కీర్తి ఎక్కడ ఉంది అసలు నాకు కనిపించలేదు గాని శైలుని అడగగానే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది కాలేజీకి అని వచ్చిన నువ్వు ఇక్కడికి ఏం చేస్తున్నావ్ అని అతను సీరియస్ అవుతాడు.

తండ్రికే వార్నింగ్ ఇచ్చిన శైలు..

శైలును అందరు చూస్తుండగా తిడతాడు. అంతేకాదు శైలు ను అతను కొడతాడు కూడా.. నాన్న నన్ను తిట్టండి కొట్టండి అంతేగాని ఆ అబ్బాయి మాత్రం ఏమీ అనొద్దు అని శైలు అనగానే.. నా కూతురికి ఏ మందు పెట్టావ్ రా అని శైలుని ఇంకో దెబ్బ కొడతాడు వాళ్ళ నాన్న. నాన్న నేను నీ కూతుర్ని కాబట్టి నువ్వు నన్ను తిట్టు కొట్టు అంతేకానీ అతనిని రైట్స్ నీకు లేవు కేశవ్ అని ఏమైనా అంటే నేను ఊరుకోను అని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ నాన్న ఇంకాస్త గట్టిగా అరుస్తాడు. పద ఇంటికి వెళ్దామని శైలుని పిలిచిన నేను తర్వాత వస్తానని అంటుంది కానీ అతను మాత్రం చేయి లాక్కొని వెళ్తాడు. కానీ మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటుంది. ఏంటి అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమైనా అంటారేమో అని కేశవ భయపడిపోతూ ఉంటాడు.. కానీ నాకేం భయం లేదు నేను వెళ్లి నేను అంత చూసుకుంటాను అని శైలు అంటుంది..

విడాకులు మాట చెప్పి షాకిచ్చిన మహా..

Advertisement

తర్వాత రోజు చక్రీ మా ఇద్దరికి విడాకులు రావద్దు అని దేవుడిని ప్రార్థిస్తూ బాధపడిపోతూ ఉంటాడు.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఏంటి ఎలా ఉన్నారు అని మాట్లాడుతుంది. చక్రి ఏదో ఒకటి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు.. అయితే కన్నా అప్పుడే రాగానే మహాలక్ష్మి ఇంట్లో అందర్నీ పిలువు అని చెప్తుంది.. చాలా కోపంగా ఇంట్లోని వాళ్ళ అందరిని పిలుస్తాడు. అది చూసిన మాధవ్ కేశవ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మేము ఈరోజు విడాకుల కోసం అని లాయర్ దగ్గరికి వెళ్తున్నాము.. విడాకులు వచ్చినా సరే మీ పెళ్లయ్యేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎలాగైనా సరే విడాకులు వస్తే చాలు అని మహాలక్ష్మి అంటుంది..

కేశవనే పెళ్లి చేసుకుంటాను..

శైలు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న తనకి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ ఇస్తాడు.. నాన్న నాన్న ఆ పేరు నన్నెందుకు పిలుస్తున్నావు.. అందరి ముందర నా గురించి అలా మాట్లాడటంతో నేను ఎంత చచ్చిపోయానో నీకు తెలియదా అని ఆయన మాట్లాడుతాడు.. అప్పుడు అక్కడికి వచ్చిన వరాలు ఏం చేసింది అని అడగ్గాని తను నిజం చెప్తాడు.. ఆ మాట వినగానే వరాలు కోపంతో రగిలిపోయి శైలుని కొడుతుంది.. శైలు నన్ను ఎంత కొట్టినా సరే నేను అతన్ని చేసుకుంటాను అని తెగేసి చెప్పేస్తుంది.. ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూసావా అసలు వాళ్ల గురించి నీకేం తెలుసు అని వాడిని ప్రేమించావు అని ఇద్దరు వార్నింగ్ ఇస్తారు. అయినా కూడా శైలు మాత్రం ఏమీ భయపడకుండా లోపలికి వెళ్ళిపోతుంది..

శైలును మెకానిక్ తో చూసిన సురేష్..

Advertisement

శైలు తర్వాత రోజు కాలేజీకి అని బయటికి వచ్చి మళ్ళీ ఆ కేశవాన్ని కలవడానికి వెళుతుంది.. ఏంటే నిన్న మీ నాన్న చూశాడు కదా ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా నేను కొట్టారా అని కేశవ అడుగుతాడు.. అయితే మా ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టిన తిట్టినా.. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను లేదంటే చచ్చిపోతాను అని చెప్పాను అని శైలు అనగానే నీకేంటి ఇంత ధైర్యం అని కేశవ్ అంటాడు. ఏంటి టెన్షన్ పడుతున్నావు అని అంటే చక్రి మహాలక్ష్మి విడాకుల కోసం అని కోర్టుకు వెళ్తున్నారు వాళ్ళిద్దర్నీ ఎలా కలపాలి అని ఆలోచిస్తున్నాను అని కేశవ అంటాడు.. అయితే కేశవ శైలు ఇద్దరు క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉండగా సురేష్ వాళ్ళిద్దర్నీ చూసి ఆవేశంగా ఇంటికి వస్తాడు.. వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడతాడు శైలు కి ఇంకొకసారి ఆ మెకానిక్ జోలికి వెళ్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు.. కానీ శైలు మాత్రం నేను వాడిని పెళ్లి చేసుకుంటాను అని మొండిగా మాట్లాడుతుంది..

నారాయణ ఇంట్లో సురేష్ రచ్చ..

నారాయణ బయట కూర్చుని ఉండగా సురేష్ తన ఫ్రెండ్స్ ని తీసుకొని వాళ్ళ ఇంటి మీదకు వెళ్తాడు. ఇదే నారాయణ ఎవర్రా నువ్వు ఈ పిల్ల బచ్చా గాడివి నా ఇంటికి వచ్చావు అని అడుగుతాడు. అయితే నారాయణ మాట్లాడుతూ ఉండగా సురేష్ ఇంట్లో మెకానిక్ ఉన్నాడా మెకానిక్ రారా బయటికి అని అరుస్తాడు.. ఇంట్లో నుంచి భయపడుతూ బయటకు వచ్చినా మాధవ్ చక్రి ఇద్దరు చూసి ఏమైంది అని అడుగుతారు.. నా చెల్లిని ఆ మెకానిక్ గాడు ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే మాధవ్ ఏంటి కేశవ ప్రేమలో పడ్డాడా అని షాక్ అవుతాడు.. నారాయణ ఈ మొండోడు ప్రేమలో పడ్డాడా అని సంతోషంగా ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షికి ఘోర అవమానం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..శ్రీయలో ఇంత మార్పేంటి..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×