// // బ్రతికుండగానే చితిపై... తాగుబోతుకు బుద్ధి చెప్పడానికి మెంటల్ -->
E-Paper
Advertisement

బ్రతికుండగానే చితిపై… తాగుబోతుకు బుద్ధి చెప్పడానికి మెంటల్ మాస్ ప్లాన్

బ్రతికుండగానే చితిపై… తాగుబోతుకు బుద్ధి చెప్పడానికి మెంటల్ మాస్ ప్లాన్
Advertisement

Comedy Drama: మృత్యువును దగ్గర నుంచి చూడడం అంటే చచ్చిబతకడమే. అలాంటి ఎక్స్పీరియన్స్ చవి చూడడమే కాదు వినాలన్నా భయమే అందరికీ. కానీ ఓ తాగుబోతుకు కుటుంబం దగ్గరుండి, బతికుండగానే చితి పేర్చి అంత్యక్రియలు చేస్తుంది. మరి ఇలాంటి వింత కథతో రూపొందిన ఆ కన్నడ మూవీ పేరు ‘పిరంతనాళ్ వాళ్త్తుక్కళ్’ (Piranthanaal Vazhthukal). చావుని దగ్గర చూసి జీవితం నేర్చుకున్న ఒక మందుబాబు కథ. 2025 ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నవ్వించి, ఆలోచింపజేసిన తమిళ విలేజ్ కామెడీ-డ్రామా. రాజు చంద్ర దర్శకత్వంలో, జాతీయ అవార్డు గ్రహీత అప్పుకుట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఒక చిన్న తమిళ గ్రామంలో అన్బు అనే వ్యక్తి మద్యం మత్తులో మునిగి తేలుతుంటాడు. రోజంతా తాగడం, ఇంట్లో గొడవలు చేయడం, పని చేయకుండా తిరగడం… ఇదే అతని రొటీన్. భార్య, పిల్లలు, స్నేహితులు అందరూ అతని వ్యసనం వల్ల ఎంతో బాధ పడుతుంటారు. కానీ అతనికి మాత్రం ఇవేమీ పట్టవు. ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని హెచ్చరికలు చేసినా అన్బు ఇంచు కూడా మారడు. చివరికి అతని స్నేహితులు, కుటుంబం ఒక వింతైన, భయంకరమైన ప్లాన్‌ తో అతన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

ఒకరోజు అన్బు పూర్తిగా మత్తులో ఉంటాడు. అతన్ని బ్రతికుండగానే శ్మశానానికి తీసుకెళతారు. “అన్బు చనిపోయాడు” అని ఊరంతా ప్రకటించి, అతనికి బ్రతికుండగానే అంతిమ క్రియలు చేయడానికి సిద్ధమవుతారు. అతన్ని చితిపై పడుకోబెట్టి, చుట్టూ బంధువులు ఏడుస్తూ, కుటుంబం దుఃఖిస్తూ, అంత్యక్రియలు నిర్వహించే నాటకం స్టార్ట్ చేస్తరు. నిప్పు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు నటిస్తారు. ఈ షాకింగ్ ఘటనతో అన్బుకు మత్తు పూర్తిగా తగ్గిపోతుంది.

తాను బ్రతికుండగానే తన అంతిమ యాత్రను, తన కుటుంబం ఏడుస్తున్న దృశ్యాలను, స్నేహితులు దుఃఖిస్తున్న తీరును కళ్లారా చూస్తాడు. ఆ క్షణంలో అతని హృదయం కరిగిపోతుంది. తన వ్యసనం వల్ల తన భార్య, పిల్లలు ఎంత మానసిక వేదన అనుభవించారో, ఊరి ప్రజలు ఎంత విసిగిపోయారో అతనికి అర్థమవుతుంది. ఈ వింత ప్రయోగం సక్సెస్ అయ్యిందా ? మరి ఈ షాకింగ్ ఘటన తరువాత అన్బు ఎలా మారాడు ? మళ్లీ మందు జోలికి వెళ్లాడా లేదా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో లేనట్టే

Advertisement

అప్పుకుట్టి తన సహజ నటనతో అన్బు పాత్రను అద్భుతంగా పోషించారు. ఐశ్వర్య అనిల్ కుమార్, శ్రీజ రవి, రోజీ మాథ్యూ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ‘పిరంతనాళ్ వాళ్త్తుక్కళ్’ కామెడితో పాటు మద్యపాన వ్యసనం వల్ల కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలపై గట్టి సందేశం ఇచ్చే హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా. నవ్వుతూనే జీవితం గురించి ఆలోచింపజేసే ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే విడుదలైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సింప్లి సౌత్ లో తమిళ ఆడియోతో ఈ మూవీని చూడవచ్చు.

Read Also : కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం… ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×