E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని భర్తగా ఒప్పుకున్నా మహా.. బృందావనంకు లక్ష్మీ కల.. మహా దెబ్బకు భయపడ్డ కేశవ..

Podarillu Today Episode : చక్రీని భర్తగా ఒప్పుకున్నా మహా.. బృందావనంకు లక్ష్మీ కల.. మహా దెబ్బకు భయపడ్డ కేశవ..
Advertisement

Podarillu Today Episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆది మహాలక్ష్మి పరిస్థితిని ఇంట్లో వివరించి బాధపడతాడు. లళిత కూడా తన కూతురు అలాంటి ఇబ్బందులు పడుతుందని బాధపడుతుంది. మహాలక్ష్మికి మస్కిటో కాయిల్ ఆల్ అవుట్ అలాగే బ్యాటు అన్ని తెచ్చి చెక్రి ఇస్తాడు. వాటిని మళ్లీ బయటకు తీసుకొచ్చిన మహా వాళ్ళందరూ ముందే ఇవ్వడంతో అందరూ కలిసి చక్రిని కొడతారు. ఇక తర్వాత రోజు మహాలక్ష్మి బయట బట్టల ఆరెస్తూ ఉంటె తాయారు అక్కడికి వస్తుంది.. మహాలక్ష్మి ని ఎలాగైనా సరే ఇంట్లో విషయాలు అని చెప్పి బయటికి పంపించాలని అనుకుంటుంది.

ఆ ఇంటి గురించి ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మహాలక్ష్మి బయటపెడుతుంది.. అయితే తాయారు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే నీ జీవితం బాగుంటుంది అని చెప్పడంతో అది విన్న నారాయణ తాయారు పై గ్లాస్ విసిరేస్తాడు.. కోడలికి లేనిపోనివి నూరిపోస్తున్నావా నీకు కొంచమైనా బుద్ధి లేదా అని నారాయణ తాయారుని తిడతాడు.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఫస్ట్ నీ మొగుడు దుబాయ్ లో ఏం చేస్తున్నాడో అది ఆలోచించు. ఆ తర్వాత మా గురించి ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అంటాడు.. ఆ మాటతో తాయారు నా మొగుడు ఎలాంటోడు నాకు తెలుసు ముందు నీ ఇంటి గురించి నీ కోడలికి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సిమ్ యాక్టివేట్ అవ్వడంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న నా కూతురు ఒకప్పుడు ఉండేది అమ్మ ఇప్పుడు లేదు ఆమె చచ్చిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి ఏ కష్టం వచ్చి ఫోన్ చేసిందో అర్థం చేసుకోరా అని ప్రతాప్ ని ఎంతగా బ్రతిమిలాడినా సరే.. అతను మాత్రం ఇక చాలు ఆపండి అని కోపంగా అంటాడు. మహా తన వాళ్లు అన్న విషయాన్ని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.. చక్రి మహా దగ్గరికి వచ్చి ఏమైందో అని అడుగుతాడు ఆ విషయం చెప్పి తను చాలా ఫీల్ అవుతుంది.. తన ఇంట్లో వాళ్ళు తను చచ్చిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి చాలా బాధపడుతుంది.. ఇక రాత్రి తన తండ్రి అన్న మాటని తెలుసుకుని బాధపడుతూ ఉండగా చక్రి లోపలికి వస్తాడు..

మహాలక్ష్మి ఏడుస్తూ కనిపించడం చూసిన చక్రీ ఏమైందండీ ఏడుస్తున్నారు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పండి అని అడుగుతాడు.. మీరు ఎంతసేపైనా లోపలి నుంచి బయటికి రాకపోవడంతో నేనే లోపలికి వచ్చాను. ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి అని చక్రి అడుగుతాడు.. మా నాన్న నేను చచ్చిపోయాను అని ఎవరో తెలియనట్లు మాట్లాడారు. నాకు ముల్లు గుచ్చుకుంటేనే బాధపడిపోయే మా నాన్న ఇలాంటి మాటలు మాట్లాడటంతో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. చచ్చిపోవాలనిపిస్తుందండి అని మహాలక్ష్మి అంటుంది..

Advertisement

మీరు మూడ్ ఆఫ్ లో ఉన్నారు కదా మిమ్మల్ని సిటీ మొత్తం తిప్పి చూపిస్తానని చక్రి అంటాడు. అలా చేయడంవల్ల రాత్రంతా బాగా అలసిపోయి ఉదయాన్నే ఫ్రెష్ గా లేస్తారు అని చక్రి మహాలక్ష్మి రెడీ అయి రమ్మని చెప్తాడు.. మహాలక్ష్మి రెడీ అయి రాగానే ఇద్దరు ఒక డ్యూయేట్సాంగ్ వేసుకుంటారు.. ఇక మహాలక్ష్మిని హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాడు చక్రి. చివరికి ట్యాంక్బండ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఉన్నట్లు గమనిస్తాడు. మనం వచ్చి దాదాపు రెండు గంటలు అయింది మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అని చక్రి అడుగుతారు.. ఏంటి మనము వచ్చేప్పుడే రెండు గంటలు అయింది అసలు టైమే తెలియలేదు మీరు ఈరోజు నాకు గుర్తుండిపోయే మెమోరీని ఇచ్చారు అని చక్రిపై మహాలక్ష్మి ప్రశంసలు కురిపిస్తుంది..

అప్పుడే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ ఏంటి మీరు ఎవరు అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. కానీ చక్రి మాత్రం నోట్లో నీళ్లు నమూలుతు కనిపిస్తాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం మేమిద్దరము భార్యాభర్తలము అని తాళిబొట్టు చూపిస్తుంది. మీరిద్దరు భార్యాభర్తల ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ టైంలో తాగుబోతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మీరు వెంటనే ఇంటికి వెళ్లిపోండి అని కానిస్టేబుల్ అంటాడు. ఇక మహాలక్ష్మి చక్రి ఇద్దరి ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా పడుకుంటారు. ఉదయం లేవగానే మాధవ్ వంటగదిలో వంట చేస్తూ కనిపిస్తాడు. మహాలక్ష్మి అందరిని లేపి పెద్దికి సాయం చేయాలని అంటుంది.

Also Read : బాలును ఇరికించబోతున్న రోహిణి.. ప్రభావతికి దొరికిపోతుందా..? మీనాకు కొత్త టెన్షన్..

ఆ తర్వాత అందరూ కలిసి తల ఒక పని చేస్తే ఇంట్లో ముగ్గు పెట్టడం దగ్గర నుంచి మహాలక్ష్మి పూజ వరకు అన్ని తానే దగ్గరుండి చేస్తుంది.. ఎప్పుడు లేంది ఇలా తన ఇంట్లో పూజలు అలాగే ముగ్గు పెట్టడం చూసి కన్నా ఎమోషనల్ అయిపోతాడు.. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి నేను టీ పెడతాను అని అంటుంది… మహాలక్ష్మి చేసిన వింత ప్రయోగానికి ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది .. రేపటి ఎపిసోడ్ లో మహాలక్ష్మిని సర్టిఫికెట్ల కోసం ఇంటికి రమ్మని అక్కడే లాక్ చేయాలని లలిత అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×