E-Paper
Advertisement

Jagan Angry: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం.. మదనపల్లి బాలిక ఘటన, మహిళలకు రక్షణ ఎక్కడంటూ..

Jagan Angry: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం.. మదనపల్లి బాలిక ఘటన, మహిళలకు రక్షణ ఎక్కడంటూ..
Advertisement

Jagan Angry: కూటమి ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. మదనపల్లి బాలికపై అత్యాచారం, ఆపై హత్య ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. మహిళలకు రక్షణ ఎక్కడంటూ అందులో ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం

Advertisement

మంగళవారం మదనపల్లిలో బాలిక అత్యాచారం, హత్య ఘటనపై సీరియస్‌గా స్పందించారు మాజీ సీఎం జగన్. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.

ఎందుకు రక్షణ కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న మాజీ మంత్రుల ఇళ్లపై పోలీసులతో దాడి చేయించడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడం లేదన్నారు. కేవలం ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో బాలికలపై అత్యాచారం చేసిన ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు.

Advertisement

మదనపల్లి బాలిక ఘటన, మహిళలకు రక్షణ ఎక్కడంటూ ప్రశ్న

ప్రభుత్వంలో హోంమంత్రి లా అండ్‌ ఆర్డర్‌కు బాధ్యత వహించరని రాసుకొచ్చారు. ఇలాంటి ఘటనలకు ఏ మంత్రి బాధ్యత వహించరని ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదన్నారు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారని ప్రశ్నించారు.

పొలిటికల్‌ గవర్నెన్స్‌-రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేశారని, ఇకపై లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉంటుందన్నారు. చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ వైఫల్యాలకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపై కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారని రాసుకొచ్చారు.

ALSO READ: అర్ధరాత్రి రణరంగంగా ఏయూ క్యాంపస్.. ఆపై ఘర్షణలు

అందుకు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. ఇకనైనా మేలుకుని లా అండ్ ఆర్డర్ తోపాటు మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టాలంటూ ముగించారు మాజీ సీఎం జగన్.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×