E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. ఉద్యోగం కోసం పాట్లు..కేశవ లైఫ్ లోకి అమ్మాయి.. ట్విస్ట్ అదిరింది..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. ఉద్యోగం కోసం పాట్లు..కేశవ లైఫ్ లోకి అమ్మాయి.. ట్విస్ట్ అదిరింది..
Advertisement

Podarillu Today Episode February 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మాధవ్ ఒక్కడే పని చేస్తున్నాడని ఫీల్ అయిన మహా చక్రీ గురక పెట్టడం విన్న మహాలక్ష్మి ఎలాగైనా సరే.. చక్రీని లేపి పనులు చేయించాలని అనుకుంటుంది.. అయితే చక్రి మొహం మీద నీళ్లు కొట్టడానికి వెళ్లిన మహాలక్ష్మి కాలు జారీ కేశవ మీద ఆ నీళ్లు పడతాయి. ఇక ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. భయపడిపోయిన మహాలక్ష్మిని చక్రి ఓదారుస్తాడు. మొత్తానికి కాస్త ఫన్నీగా, ఇంకాస్త గొడవగా జరుగుతుంది.

మహాలక్ష్మి బాధపడుతుంది అని కేశవ కూడా ఫీల్ అవుతాడు. తన అసిస్టెంట్ ఏమైందన్నా అలా ఉన్నావ్ అని ఎంతగా అడిగినా సరే కేశవ మాత్రం ఏం జరగలేదు అని అంటాడు. సడన్ గా అలా జరగడంతో నేను చాలా కోపంగా ఫీల్ అయ్యాను. అరిచాను కూడా.. బాధపడిపోయి ఉంటుందనుకుంటాను అదే నాకు చాలా బాధగా ఉంది అని కేశవ అంటాడు.మా మీద అరిచినట్టు అలా అరిస్తే బాధపడి పోకుండా ఏం చేస్తుంది? ఎంత పని చేసావ్ అన్న నిజంగానే వదినమ్మ బాధపడి పోయి ఉంటుంది అని అతను అంటాడు.. మాధవ్ మీద మహాకూటౌట్ వస్తుంది. చక్రి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి కారేశ్వర్ దగ్గరికి వెళ్లి తన జాబ్ గురించి మాట్లాడుతాడు.. అతను మాత్రం నీకు జాబ్ లేదు ఏమీ లేదు వెళ్లిపో అని అంటాడు. చక్రి ఎంతగా బ్రతిమలాడినా సరే నీకు జాబ్ ఇవ్వను ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో చక్రి షాక్ అవుతాడు. అతని ఎంతగా కన్వెజ్ చేయాలని చూసినా కూడా నీకు జాబ్ ఇవ్వను అని గట్టిగా తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే చక్రి బాధ పడిపోతాడు. నువ్వు బాగానే చేస్తావు ఒక అమ్మాయిని లేపుకొచ్చావు వాళ్లు నా తాట తీసి చేతిలో పెట్టారు. నువ్వు అమ్మాయి బాగానే ఉన్నారు కానీ నాకు మాత్రం ఇక్కడ పగిలిపోయింది అని కాలేశ్వరరావు అంటాడు. ఒక అమ్మాయిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాను కానీ ఇక మళ్ళీ మళ్ళీ చేసుకొని ఓపిక నాకు లేదు అని చక్రి ఎంత చెప్పినా సరే అతను మాత్రం నీకు ఇక్కడ ఉద్యోగం లేదు వెళ్ళిపో అని గట్టిగా చెప్తాడు..

పెళ్లయింది భార్యతో ఎన్నో ఖర్చులుంటాయి సరదాగా వెళ్లాలన్నా కూడా చేతిలో రూపాయి కూడా లేదు. కానీ నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వనని అంటున్నావు ఇదేం న్యాయము అని చక్రి అతడ్ని అడుగుతాడు.. కానీ కారేశ్వర రావు మాత్రం కాస్త కరిగినట్లు అనిపిస్తాడు. చక్రి ఎవరినైనా మాయ చేసి తన బుట్టలో వేసుకోగలడు. అయితే అక్కడున్న పని వాళ్ళందరూ కూడా చక్రి బాధను చూసి అతని మల్లి పనిలో పెట్టుకోని బ్రతిమిలాడుతారు. మరి అతను చక్రిని జాబ్ లో పెట్టుకుంటాడా? లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తాడా అన్నది తెలియాలంటే మరికొన్ని ఎపిసోడ్లు చూడాల్సిందే.

Advertisement

కన్నా మహాలక్ష్మి ని వదినా అని పిలుస్తూ ఉంటాడు. కానీ మహా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వదిన మిమ్మల్ని పిలుస్తున్నాను వినిపించడం లేదా అని కన్నా అడుగుతాడు. నువ్వు నన్ను పిలుస్తున్నావా ఇంకెవరినైనా పిలుస్తున్నావేమో ఫోన్లో మాట్లాడుతున్నావేమో అని అనుకున్నాను. ఫోన్లో మాట్లాడానికి ఎవరున్నారు నాకు అని కన్నా అంటాడు. ఆ గాయత్రి ఉంది కదా తను నీకు వదినే అవుతుంది కదా.. అవును కానీ చిన్నప్పటి నుంచి నాకు గాయత్రి అని పిలవడమే అలవాటు అని కన్నా అంటాడు. అయితే ఆరోజు నీ గురించి ఒక నిజం చెప్పాలని అనుకుంది అదేంటో నాకు చెప్పు అని కన్నా అని అడుగుతుంది మహాలక్ష్మి. కానీ కన్నా మాత్రం అదేం లేదు వదిన ఏదో చిన్నది కానీ అని చెప్పకుండా దాచేస్తాడు.

నువ్వు చెప్పకుంటే ఏమి నేను గాయత్రీ ని అడిగి తెలుసుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది.. ఎప్పుడు అవన్నీ ఎందుకు వదిన మాకు ఆకలేస్తుంది భోజనం చేద్దామని కన్నా అడుగుతాడు.. సరిపడా వడ్డించుకుని తిందామని అన్న కూడా.. అప్పుడే కేశవ భోజనానికి అని ఇంట్లోకి వస్తాడు అక్కడ మహాలక్ష్మిని చూసి అట్నుంచి భయపడి పోయి పారిపోతాడు. ఏంటి అతను ఎందుకు వెళ్లిపోయాడు అని మహా అడుగుతుంది. అతను మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి తింటాడు లేండి అని అంటాడు.. నారాయణ మాత్రం ఇంట్లో ఉన్న కూరల్ని చూసి ఏంట్రా మీ అన్నకి చికెన్ షాప్లు మటన్ షాపులు ఏవి కనిపించలేదా? ఏమీ లేనట్టు దోసకాయ దొండకాయ అంటూ రకరకాల చేసాడు..

Also Read : రవి, శృతి మధ్యలోకి అమ్మాయి.. బాలు దెబ్బకు ప్రభా షాక్.. శృతి షాకింగ్ నిర్ణయం..?

ఏంట్రా కొంచమైనా బుద్ధి లేదా వీడికి తన్నుని ఎలా చూసుకోవాలి అని నారాయణ అంటాడు. పెద్దిని నాయన తిట్టడం చూసి మహాలక్ష్మి కోప్పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో మహాలక్ష్మి తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంటుంది.. కానీ ప్రతాప్ మాత్రం ఆమెకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది . సోమవారం ఎపిసోడ్లో మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×