// // With Love OTT release date : రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి -->
E-Paper
Advertisement

With Love OTT release date : థియేటర్లలో అదరగొడుతున్న అనస్వర రాజన్ రొమాంటిక్ కామెడీ మూవీ… ఓటీటీలోకి ఎప్పుడంటే ?

With Love OTT release date : థియేటర్లలో అదరగొడుతున్న అనస్వర రాజన్ రొమాంటిక్ కామెడీ మూవీ… ఓటీటీలోకి ఎప్పుడంటే ?
Advertisement

With Love OTT release date : ఓటీటీ మూవీ లవర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలపై ఎప్పటికప్పుడు ఒక లుక్కేసి ఉంచుతున్నారు. ముఖ్యంగా థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సినిమాలు బిగ్ స్క్రీన్ పై ఉండగానే ఏ ఓటీటీలో, ఎప్పుడు రాబోతోంది అనే విషయాలపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు కూడా మూవీ లవర్స్ కోసం ముందుగానే అప్ కమింగ్ సినిమాల లిస్ట్ ను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక తమిళ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్ అయ్యింది. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇటీవల థియేటర్లలో విడుదలైన తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘విత్ లవ్ (With Love)’. 2026 ఫిబ్రవరి 6న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మధన్ తొలిసారిగా రచయితగా, దర్శకుడిగా పని చేశారు. హరీష్ కుమార్, కావ్య అనిల్, సచ్చిన్ నాచియప్పన్, తేని మురుగన్, శరవణన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ రొమాంటిక్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే సినిమా భారతదేశంలోనే రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు చేరుకుంది.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఈ చిత్రం పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రదర్శన ముగింపు దశకు చేరుకున్న తర్వాత స్ట్రీమింగ్ కానుంది. సమాచారం ప్రకారం మార్చి 6న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. 130 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీకి IMDbలో 7.2 రేటింగ్ ఉండడం విశేషం. థియేటర్లలో మంచి టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఓటీటీలో ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుందా లేదా అనేది చూడాలి.

Also Read : మలయాళం థ్రిల్లర్ ఎండింగ్ లో ఏమైంది ? మిస్సైన బేబీని హీరో ఏం చేశాడంటే ?

కథలోకి వెళ్తే…

Advertisement

‘విత్ లవ్’ కథ సత్య (అభిషన్ జీవింత్), మోనిషా (అనస్వర రాజన్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఇద్దరూ ముందుగా బ్లైండ్ డేట్ కోసం కలుస్తారు. మాటల్లో ఒకప్పుడు ఇద్దరూ ఒకే పాఠశాలలో సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. టీనేజ్‌లో ఇద్దరికీ లవ్ స్టోరీలు ఉంటాయి. కానీ వాటిని బయట పెట్టరు. హీరో హీరోయిన్ వేరే వేరే వ్యక్తులపై క్రష్ ఉంటుంది. అది తెలుసుకున్న తరువాత సత్య – మోనిషా తమ పాఠశాలను తిరిగి సందర్శించాలని, తాము ప్రేమించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలని డిసైడ్ అవుతారు. ఈ రిలేషన్ లో ముందుకు వెళ్ళే ముందు… టీనేజ్ లో తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. మరి ఆ తరువాత ఏమైంది? అన్నదే కథ.

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×