E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా ఫుల్ హ్యాపీ.. చక్రితో ప్రేమలో పడుతుందా..? ప్రతాప్ కు నిజం తెలిసిపోతుందా..?

Podarillu Today Episode : మహా ఫుల్ హ్యాపీ.. చక్రితో ప్రేమలో పడుతుందా..? ప్రతాప్ కు నిజం తెలిసిపోతుందా..?
Advertisement

Podarillu Today Episode December 27th : చక్రి మహా గురించి మాధవ్ కి చెప్తాడు.. ఆ పెళ్లిని మనం ఆపేయాలి అన్నయ్య అని చెప్పగానే మాధవ్ షాక్ అవుతాడు.. ఆడపిల్ల పెళ్లి ఆపాలనుకోవడం పాపం రా నీకు తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. చక్రి ఎంత చెప్తున్నా సరే మాధవ్ వినడు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది నేను ఈ విషయాన్ని ఎలా వదిలేస్తాను అన్నయ్య అంటాడు. కేశవకు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తాడు చక్రీ.. అసలు అందరికీ భయం లేకుండా పోతుంది నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోతున్నారు అని మాధవ్ అంటాడు. ఏంట్రా నువ్వు ఇంత తొందరగా వచ్చావు అని కేశవ్ అని మాధవ్ అడుగుతాడు. చక్రీ ఫోన్ చేశాడు అనగానే మాధవ్ షాక్ అవుతాడు.. కేశవ్ మాత్రం వాడు వాడి జీవితంలో మంచి పని చేస్తున్నాడు హెల్ప్ చేయడం తప్పులేదు కదా అని మాధవ్ తో అంటాడు. మొత్తానికి అందరూ కలిసి చక్రికి అమ్మాయి నచ్చిందని ఫిక్స్ అయిపోతారు. మహాను కలవడానికి వచ్చిన భూషణ్ ను పడేసేందుకు ప్లాన్ చేస్తాడు చక్రీ. దానికి భూషణ్ పెద్ద రచ్చ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్స్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి మహని ఎలాగైనా సరే మెప్పించి తన మనసులో చోటు సంపాదించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు మాధవ్ పెద్దవాళ్లతో వ్యవహారం వద్దురా మనకి సమస్యలు లేనిపోనివి వచ్చి పడతాయి అని ఎంత చెబుతున్న సరే చక్రి మాత్రం వినడు. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే కాపాడాలి నాపై ప్రేమను పుట్టేలా చేయాలి అని అనుకుంటాడు. తను ఇష్టపడిన అమ్మాయి కావడంతో ఇంట్లోని వాళ్ళు కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతారు. కన్నా ఈ అమ్మాయి చాలా బాగుంది అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటాడు. మాధవ్ ఒకవైపు భయపడుతూనే తమ్ముడు సంతోషాన్ని కాదనలేక ఒప్పేసుకుంటాడు..

Advertisement

తర్వాత రోజు మహా కు పెళ్లి జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. నా బ్రతుకు ఆశలు అన్ని ఆవిరి అయిపోయాయి ఒక మూర్ఖుడి చేతిలో నన్ను పెడుతున్నారు నేను అందరికీ అంత భారం అయిపోయాను అని బాధపడుతూ ఉంటుంది. హారిక మాత్రం తనని ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించినా కూడా మహా మాత్రం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తానికి మహా పెళ్లికూతురు గెటప్ లో రెడీ అయ్యి కిందకొస్తుంది. ప్రతాప్ మా కూతురికి ఇన్ని రోజులకి పెళ్లి వయసు వచ్చిందని అనుకుంటున్నాము అని ఎమోషనల్ అవుతాడు.. నా దిష్టి తగిలేలా ఉంది అంటూ లలిత మాత్రం దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి రా అనేసి మహాని తీసుకుని వెళుతుంది… ఇక పెళ్ళికొడుకు వాళ్ళు వస్తే తొందరగా మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్దామని ప్రతాప్ అంటాడు.

మనం తొందరగా బయలుదేరాలి లేకపోతే అక్కడ ముహూర్తం దాటిపోతుంది రిజిస్టర్ గారు ఉంటారు అని ప్రతాప్ అంటాడు. అప్పుడే బయటనుంచి కారు దిగి పరిగెత్తుకుంటూ భూషణ్ తల్లిదండ్రులు లోపలికి వస్తూ ఉంటారు. అది చూసి నా చక్రి పెళ్లి జరగబోతుంటే వీళ్ళు ఎందుకు కంగారుపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏదో జరిగింది అని లోపలికి వెళ్తాడు. వాళ్ళు అంత కంగారుపడుతూ ఏడుస్తూ లోపలికి రావడం చూసిన ప్రతాప్ ఏమైంది అని అడుగుతాడు. దారిలో పూలమాలలు కొనడానికి భూషణ్ దిగారు. అతన్ని ఎవరు తీసుకెళ్లిపోయారు అని ఏడుస్తారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఏంటి ఇలా చేయడానికి అని లలిత అడుగుతుంది.

Advertisement

ఇంట్లోని వాళ్ళందరూ భూషణ్ పెళ్లి సమయానికి లేడని కంగారు పడుతుంటారు. అహమాత్రం లోలోపల సంతోష పడిపోతూ ఉంటుంది. ఏం జరిగిందో చెప్పండి అని ప్రతాప్ అడిగి తెలుసుకుంటాడు. భూషణ్ తల్లి పూలమాల కోసం దిగిన భూషణ్ ని ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్తారు. ప్రతాప్ నా కాబోయే అల్లుడ్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు అంత ధైర్యం ఎవరికీ లేదు నేను కాసేపట్లో అల్లుని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతాను అని వాళ్ళతో అంటాడు.. ఇక ఆది ప్రతాప్ తమ అల్లుడు గురించి రౌడీలతో చెప్పి వెతకమని చెప్తారు.. ఆ తర్వాత మహా చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసిన హారిక నువ్వు ఇలా చేస్తే కచ్చితంగా నువ్వే చేసేవాన్ని వాళ్ళు అనుకుంటారు కాస్త ఆగు అని అంటుంది.

Also Read :మీనా, బాలు ప్రేమకు ఫిదా.. ఎమోషనల్ స్టోరీ.. గెలిచిన మీనా, బాలు..?

పెళ్ళికొడుకు లేడు అని తెలుసుకున్న వాళ్ళందరూ మహాను చూసి బాధపడుతూ ఉంటారు. మహా గదిలోకి వెళ్లి తీన్మార్ డాన్స్ వేస్తుంది. చక్రి మేడంకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను ఇకమీదట నామీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది అని సంతోషంతో గాల్లో తేలిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో భూషణ్ ని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది తెలుసుకోవాలని ప్రతాప్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి చక్రి ఆ కిడ్నాప్ చేయించాడని తెలుసుకుంటారా? తన బాధను పోగొట్టిన చక్రి ప్రేమలో మహా పడుతుందా? చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×