E-Paper
Advertisement

Russia China Moon: అమెరికా వెన్నులో వణుకు.. చంద్రుడిపై అణు కేంద్రం నిర్మించబోతున్న రష్యా, చైనా..

Russia China Moon: అమెరికా వెన్నులో వణుకు.. చంద్రుడిపై అణు కేంద్రం నిర్మించబోతున్న రష్యా, చైనా..
Advertisement

Russia China Moon Nuclear Plant | ప్రపంచ దేశాలు భూమిపై కాకుండి ఇతర గ్రహాలపై మనుషులు నివసించేందుకు అనువైన వాతావరణం కోసం చాలా కాలంగా వెతుకుతున్నాయి. దీని కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు ప్రయోగాలలో భూమి తర్వాత చంద్రుడిపై మనుషుల శాశ్వత నివాసానికి అనువైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు చూస్తున్నారు. చాలా దేశాల స్పేస్ ఏజెన్సీలు ఇప్పటికే చంద్రుడిపై లాంగ్ టర్మ్ మిషన్లకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అణు శక్తిగా పేరు గాంచిన రష్యా దీనికి విపరీతంగా ఆలోచిస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. చంద్రుడిపై రష్యా అణు విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ కేంద్రం రష్యా భవిష్యత్ లూనార్ (చంద్ర) మిషన్లకు నమ్మకమైన విద్యుత్ సరఫరా చేస్తుంది. రష్యా.. చైనాతో కలిసి చంద్రుడిపై జాయింట్ రీసెర్చ్ స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ అణు కేంద్రం ఆ రీసెర్చ్ బేస్‌కు పవర్ సప్లై చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

స్పేస్ లీడర్‌షిప్‌ను తిరిగి సాధించాలని కోరుకుంటున్న రష్యా

Advertisement

కొన్ని దశాబ్దాల క్రితం మనుషులు మొదట అంతరిక్షానికి వెళ్లినప్పుడు సోవియట్ యూనియన్ అయిన రష్యా చాలా మైలురాళ్లు సాధించింది. కానీ గత కొన్ని సంవత్సరాల్లో రష్యా కంటే అమెరికా, చైనా బలంగా ముందుకు వచ్చాయి. రష్యా ఇప్పుడు ఇతర దేశాల కంటే వెనకబడిపోయిందని భావిస్తోంది. మీడియా రిపోర్టుల ప్రకారం.. రష్యా ఈ టెక్నాలజీ గ్యాప్‌ను త్వరగా మూసివేయాలని అనుకుంటోంది. చంద్రుడిపై శాశ్వత బేస్ నిర్మించడం ద్వారా స్పేస్ లీడర్‌షిప్ తిరిగి పొందవచ్చని ప్లాన్ చేస్తోంది. అందుకే లూనార్ ప్రాజెక్టులపై మళ్లీ ఫోకస్ పెంచింది.

2036 నాటికి చంద్రుడిపై రోస్‌కాస్మోస్ పవర్ స్టేషన్

రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ షేర్ చేసింది. 2036 నాటికి చంద్రుడిపై పవర్ స్టేషన్ పూర్తి చేయాలని లక్ష్యం. లావోచ్కిన్ అసోసియేషన్‌తో కాంట్రాక్ట్ సైన్ చేసింది. నేరుగా అణు కేంద్రమని చెప్పకపోయినా.. రోసాటమ్, కుర్చటోవ్ ఇన్‌స్టిట్యూట్ వంటి న్యూక్లియర్ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.

భవిష్యత్ చంద్ర మిషన్లకు విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యం

Advertisement

ఈ ప్లాంట్ రష్యా చంద్ర ప్రోగ్రామ్‌కు సపోర్ట్ చేస్తుంది. చంద్ర రోవర్లు, సైంటిఫిక్ ఆబ్జర్వేటరీలు ఆపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రష్యా-చైనా జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్‌కు కూడా పవర్ ఇస్తుంది. ఈ స్టేషన్‌లో లాంగ్ టర్మ్ సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్లు చేయవచ్చు. చంద్రుడిపై కఠిన పరిస్థితుల్లో సర్వైవల్, ఆపరేషన్లకు స్థిరమైన ఎనర్జీ చాలా ముఖ్యం. అణు విద్యుత్ సూర్యకాంతి పై ఆధారపడకుండా నిరంతరం ఎనర్జీ ఇస్తుంది.

చంద్రుడిపై అణు కేంద్ర రేసులో దూకిన అమెరికా

రష్యా-చైనా మాత్రమే కాదు, అమెరికా కూడా ఇలాంటి ప్లాన్లు ప్రకటించింది. నాసా 2030ల ప్రారంభంలో చంద్రుడిపై అణు రియాక్టర్ పెట్టాలని అనుకుంటోంది. స్పేస్‌లో అణు ఆయుధాలు నిషేధం, కానీ శాంతియుత అణు ఎనర్జీ సిస్టమ్స్ కోసం అనుమతించింది. ఈ నిర్ణయం ఇతర దేశాలను చంద్ర అణు పవర్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సాహిస్తోంది.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

పోటీని పెంచుతున్నచంద్రుడిపై దాగి ఉన్న వనరులు

చంద్రుడిపై భారీ మొత్తంలో హీలియం-3 ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భవిష్యత్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లకు ఇంధనం. భూమిపై ఇది చాలా అరుదు. చంద్రుడిపై మిలియన్ల టన్నులు ఉండవచ్చు. అలాగే ఆధునిక టెక్నాలజీకి ఉపయోగపడే రేర్ మెటల్స్ కూడా ఉన్నాయి. ఈ వనరులు స్పేస్ పవర్ల మధ్య పోటీని పెంచుతున్నాయి.

కొత్త స్పేస్ రేసు మొదలైంది

చంద్రుడు ఇక సైంటిఫిక్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ఎనర్జీ, వనరులకు స్ట్రాటజిక్ ప్రదేశం అవుతోంది. చంద్ర బేస్‌లు డీప్ స్పేస్ ఎక్స్‌ప్లరేషన్‌కు గేట్‌వేలు. రష్యా, చైనా, అమెరికా ముందు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. ఈ కొత్త స్పేస్ ఎరాలో ఎవరు లీడ్ చేస్తారో అణు శక్తి నిర్ణయిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×