E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కు సారీ చెప్పిన మహా.. నారాయణపై మహా సెటైర్లు.. తండ్రితో కలిసిపోయిన కొడుకులు..

Podarillu Today Episode : మాధవ్ కు సారీ చెప్పిన మహా.. నారాయణపై మహా సెటైర్లు.. తండ్రితో కలిసిపోయిన కొడుకులు..
Advertisement

Podarillu Today Episode April 4th : మాధవ ఇలా చేయడం వల్ల చాలా బాధపడ్డాడు అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది.. ఆయన సంతోషం కోసమే మనం అందరం అక్కడికి వెళ్ళాము కానీ పెద్ది చాలా బాధపడ్డాడు అని మహాలక్ష్మి అనుకుంటుంది.. గాయత్రి ఆయనకు తోడుగా ఉంటే వాళ్ళిద్దర్నీ చూడ్డానికి మనకు రెండు కళ్ళు సరిపోవు. ఆయన సంతోషం కోసమే కదా మనమంతా చేసింది. మరి ఆయన ఎందుకు ఇలా అనుకున్నాడు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత మాధవ్ బయట ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండగా అక్కడికి వెళ్లిన మహాలక్ష్మి మిమ్మల్ని బాధ పెట్టాలని వెళ్ళలేదు పెద్ది మమ్మల్ని క్షమించండి అని అంటుంది. మీ తప్పేమీ లేదమ్మా మా రాతల రాసిపెట్టి ఉన్నారు కాబట్టి అలా జరుగుతుంది అని పెద్ది అంటాడు..

ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను…

గాయత్రీ నామీద చిన్నప్పటినుంచి ఆశలు పెంచుకుంది.. తనని తప్ప ఎవరిని నేను వేరేలా అనుకోలేదు తనే నా మనసంతా ఉంది.. కానీ ఇంట్లోని పరిస్థితులు మా ఇద్దరిని విడగొడుతున్నాయి. ఇక చేసే దానికి మా చేతిలో ఏమీ లేదు.. కాబట్టి ఇద్దరం మనసుని రాయిగా మార్చుకొని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాము అని మాధవ్ అంటాడు. ఇంకెప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేసి నన్ను మళ్ళీ బాధ పెట్టకండి అని మాధవ అంటాడు.. సరే పెద్ది నేను బాధ పెట్టేలా నేను ఇంకా ఏ పని చేయను అని మహాలక్ష్మి మాట ఇస్తుంది..

మళ్ళీ మాధవ్ పెళ్లి కోసం ప్లాన్.. 

Advertisement

ఉదయం లేచిన తర్వాత మహాలక్ష్మి మాధవ్ కన్నా దగ్గరికి వెళ్తుంది.. నువ్వు నిన్న చేసిన బెండకాయ కూర సరిగ్గా ఉడకలేదు అన్నయ్య అని కన్నా చెప్తాడు. అది ఇప్పుడు చెప్తావ్ ఏంటి రా నిన్ననే చెప్పొచ్చు కదా అని మాధవ్ అంటాడు. నిన్న అంత బాధగా మీకు ఉంది అనిపించినా కూడా.. ఇప్పుడు అన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నారు అని మహాలక్ష్మి అనుకుంటుంది.. మా అన్నయ్య కోపం పాలపొంగు లాంటిది బుసన పొంగుతుంది నీళ్లు చల్లగాని ఆరిపోతుంది అని అంటాడు.. మనం పెద్ది కోసం ఇంకా ఏదైనా ప్లాన్ చేసి పెళ్లి చేయాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు..

నారాయణకు దిమ్మతిరిగే షాక్.. 

పెద్ద ఈ టీ పెట్టి అందరికీ తెచ్చి ఇస్తాడు.. మీరు వీళ్ళందర్నీ ఇలా తయారు చేశారు అని మాధవ్ ని మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది. వాళ్లందర్నీ తిట్టడం ఎందుకులే మాని మాధవ్ ఎంత చెప్తున్నా సరే.. మహాలక్ష్మి మాత్రం వినకుండా క్లాస్ పీకుతుంది.. ఆయన ఒక ఆయన ఉన్నాడుగా అని మహా లక్ష్మి అంటుంది. ఆయనకు టీ లాంటివి పడవు క్వాటర్లు మాత్రమే పడతాయి అని అంటారు.. బయటికి వెళ్లి నారాయణకు టీ ఇస్తుంది. ఇది నేను చేసిన టీ కాదు పెద్ది చేసిన టి అని అనగానే తాగుతాడు.. నువ్వు చేసిన టీ అయితే నేను అస్సలు తాగను అని అనగానే మీరు అలా అంటే కచ్చితంగా నేనే టీ పెట్టుకొచ్చి మీకు ఇస్తాను అని నారాయణతో మహాలక్ష్మి గొడవకు దిగుతుంది.

మాధవ్ పెళ్లి కోసం మరో ప్లాన్.. 

Advertisement

మాధవ్ బాక్స్ పెట్టుకొని బయటకు వెళ్తుండగా అందరూ మనం ఇంకేదైనా చేసి ఈ పెళ్లి జరిగేలా చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అతను చూడగానే ఏదో వేరే దాని గురించి మాట్లాడుకున్నట్లుగా అందరూ పొంతన లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. మాధవ్ వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు లే అని అనుకుంటాడు.. ఆ తర్వాత మాధవ్ అలా వెళ్ళగానే మళ్లీ అతని పెళ్లి గురించి ముచ్చట పెట్టుకుంటారు. ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అని అనుకుంటారు.

నారాయణతో సంతోషంగా కొడుకులు.. 

ఇక మహాలక్ష్మి మీకు డ్రెస్సింగ్ చేయాలి అని అనగానే.. ఏంది నువ్వా అయితే నేను పారిపోతాను అని నారాయణ అంటాడు.. ఆయనకు నువ్వు చేయాలంటే సిగ్గేస్తుందేమో.. మీరు చేయండి రా నీకేమైంది అని నారాయణ అంటాడు. అందరూ కలిసి నారాయణకు డ్రెస్సింగ్ చేస్తారు అయితే ఈ క్రమంలో తండ్రికి చక్కలిగింతలు పెట్టగానే అందరూ సరదాగా నవ్వుకుంటారు.. అంతా ఒక్కసారిగా తన తండ్రితో కలిసి నవ్వుకోవడంతో మహాలక్ష్మి ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటుంది.. మాధవ్ పెళ్లయితే చాలా బాగుంటుంది అని మహాలక్ష్మి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :నిజం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్న అవని.. భరత్ మాటకు మీనాక్షి షాక్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్….

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×